పొత్తులపై ప్రజల్లో విశ్వాసం పెద్దగా లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఇలాంటి వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం సహజం. మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలతో ప్రజలకు పెద్దగా సమస్యలేదు. ఎందుకంటే రాబోయే రెండు మూడేళ్ళలో తిరిగి ఆయా పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ పొత్తులతో వారు గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని కొనసాగించగలరన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ప్రాంతీయ పార్టీల పొత్తులు బీజేపీని నిరోధించగలిగినా మహాఘటబంధన్ వంటి భారీ పొత్తులు మాత్రం ప్రజలను అంతగా ఆకర్షించలేవు. వ్యతిరేక ప్రచారమే మోదీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment