తాజాగా పలు ముస్లిం దేశాలలో ‘హలాల్ హాలిడే’కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు హలాల్ హాలిడేని ఇష్టపడుతున్నారు. పలు దేశాలలోని ముస్లిం మహిళలు ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, తమ హక్కుల కోసం డిమాండ్ చేయడాన్ని చూస్తుంటాం. అయితే ‘హలాల్ హాలిడే’ దీనిని భిన్నమైనది. ఇంతకీ ఈ ‘హలాల్ హాలిడే’అంటే ఏమిటి? ఈ ప్రత్యేక సెలవుల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హలాల్ హాలిడే అంటే ముస్లింలు ఇస్లామిక్ నియమాలను అనుసరిస్తూనే ఎక్కడైనా పర్యటించడం. ఈ సమయంలో వారు మతపరమైన విలువల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఎదురుకాదు. వారు మత ఆచారాను పాటిస్తూనే కొన్ని రోజులు వారికి నచ్చిన చోట గడుపుతారు. ఇప్పుడు ఈ భావనను బలోపేతం చేస్తూ, వారికోసం అనేక హోటళ్లు తెరుచుకున్నాయి. చాలా మంది ముస్లింలు విహారయాత్రకు వెళ్లినప్పుడు వారు మద్యం అందుబాటులో లేని రెస్టారెంట్ల కోసం వెదుకుతారు. అయితే ఇప్పుడు హలాల్ హాలిడేను దృష్టిలో ఉంచుకుని పలు హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఈ హోటళ్లలో మద్యం ఉండదు. ఆహారం విషయంలో కూడా మతాచారాలకు అనువైనవి అందుబాటులో ఉంటాయి. ఇంతేకాకుండా ఈ ప్రదేశాలలో దుస్తులకు సంబంధించిన నియమాలు కూడా ఇస్లాం ఆచారాల ప్రకారమే ఉంటాయి.
ఎవరైనా ముస్లిం మహిళ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాలనుకుంటే ఆయా హోటళ్లలో ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. ఎందుకంటే ఆ హోటళ్లలో ఆమె చుట్టూ అదే నియమాన్ని అనుసరించే వారు ఉంటారు. అందుకే ముస్లిం యువతులు ‘హలాల్ హాలిడే’ను ఇష్టపడుతున్నారు. ‘హలాల్ హాలిడే’ కోసం ఏర్పాటైన ప్రాంతాల్లో నమాజ్ మొదలైన మతాచారాల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఫలితంగా వారు మత నిబంధనల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏర్పడదు. గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ ప్రకారం 2022లో హలాల్ ట్రావెల్ వ్యాపారం $ 220 బిలియన్లకు చేరుకున్నదని బీబీసీ ఒక నివేదికలో తెలిపింది.
ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?
Comments
Please login to add a commentAdd a comment