కొందరు బడాబాడా నాయకులకు సైతం అనేక మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. ఇలాంటివారు కొన్ని నమ్మకాలను అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఈనాటికీ చాలామంది నాయకులు రాత్రివేళ ఆ ప్రాంతంలో బస చేయాలంటే సంకోచిస్తారట. ఇలా చేయడం వల్ల వారు తమ పదవులకు కోల్పోతారట. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లో ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రి రాత్రి బసచేయాలంటే భయపడిపోతారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ బస చేసిన ఏ మంత్రీ తిరిగి అధికారంలోకి రాలేదని చెబుతుంటారు.
చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రాత్రవేళ బసచేసే ధైర్యం చేయరు. మహాకాళేశ్వరుడు కొలువై ఉండటమే ఇందుకు కారణమని భావిస్తారు. ఉజ్జయినిలో కొలువైన మహారాజు.. మహాకాళేశ్వరుడేనని, అందుకే అక్కడ మరే ఇతర రాజు ఉండడం తగదని అంటుంటారు. అలా చేస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటారు. దీనికి పౌరాణిక కథలను ఉదాహరణలుగా చూపిస్తుంటారు.
చాలామంది నేతలు ఇదే నమ్మకాన్ని కలిగివుండటంతో మిగిలిన నేతలు కూడా వారిని అనుసరిస్తున్నారు. మహాకాళీశ్వరుని ముందు తలవంచి, నమస్కరిస్తూ పూజలు చేసినప్పటికీ.. ఏనాయకుడూ రాత్రివేళ ఇక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఎంతటి అధికార బలం ఉన్నా ఇక్కడికి వస్తే వాటిని పోగొట్లుకోవడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి నమ్మకాలు కేవలం ఉజ్జయినిలో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. కొంతమంది ఇందుకు వాస్తు దోషాలను కారణంగా చూపుతుంటారు.
ఇది కూడా చదవండి: హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా?
Comments
Please login to add a commentAdd a comment