ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది? | Why temples are calm? | Sakshi
Sakshi News home page

ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది?

Published Thu, Jun 19 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది?

ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది?

ఎందుకు?
 
ఇంటిలో మనం ఎంతసేపు పూజ చేసుకున్నా ఆలయానికి వెళ్లి, ఆ మూర్తి ముందు రెండు నిమిషాలు గడిపితే చాలు... ఎనలేని ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే దేవాలయాలలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాన్ని కూడా ప్రతిష్ఠాపన చేస్తారు. ఆ యంత్రాల ప్రతిష్ఠాపన కార్యక్రమం యోగులు, స్వామీజీలు, బాబాల చేతుల మీదుగా జరుగుతుంది.

వారు జీవించి వున్నంత కాలమే కాదు, తమ భౌతిక దేహం వీడిన తర్వాత కూడా వారి ఆత్మశక్తి, జప ఫలం, తపో మహిమ ఆ యంత్రాలను చేరతాయని ఒక నమ్మకం. ఈ పుణ్యపుడమిలో ఎందరో అవతార పురుషులు జన్మించారు. వారు అవతారం చాలించగానే వారి దివ్యమహిమలన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో వుండే ఆలయాల్లోని యంత్రాలలో ప్రతిష్ఠితమవుతాయని.

ఆ యంత్రాలలోని బీజాక్షరాలలో వుండే దివ్యశక్తులు స్వరబద్ధమైన మంత్రాల ద్వారా మన చెవులను చేరి మన కోరికలను తీరుస్తాయని అంటారు. ఆ సమ్మోహన శక్తే మనల్ని వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆయా ఆలయాలలోని దేవతల దర్శనం చేసుకునేలా చేస్తుంది, మనసులకు ప్రశాంతత ప్రసాదిస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement