భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాన్స్‌జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం!
Comments
Please login to add a commentAdd a comment