సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment