diversity
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్‌బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
వైవిధ్యమే భారత్ బలం: మోదీ
న్యూఢిల్లీ: భారతీయులను వైవిధ్యం పట్ల సహజంగా ఉండే ప్రేమే శతాబ్దాలుగా ఐకమత్యంగా ఉంచుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌కున్న ఈ విశిష్టతే ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించిందని చెప్పారు. ‘భారతదేశం వివిధ వర్గాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలకు నెలవు. ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను ఆచరిస్తూనే ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు’అంటూ ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌కు చెందిన నజాకత్ చౌధరికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా చౌధరి ఇటీవల అస్సాంలో పర్యటించారు. ఈ పర్యటన తనలో స్ఫూర్తి నింపిందనీ, మరిచిపోని అనుభూతులను మిగిల్చిందంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రధాని పైవిధంగా బదులిచ్చారు. నేడు 71 వేల మందికి నియామక పత్రాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మందికి మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో నియామక పత్రాలివ్వనున్నారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన ఇప్పటిదాకా 2.9 లక్షల మందికి నియామక పత్రాలిచ్చారని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. -
Saurashtra Tamil Sangamam: అడ్డంకులున్నా ముందడుగే..
సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు. -
మంచి మాట: జీవనమధురిమలు
ప్రతి ఒక్కరి జీవితంలో మాధుర్యముంటుంది. కానీ, దానిని చేరుకునే సోపానం ఒకటి కాదు అనేక రకాలు. మనకి అనువైనదేదో తెలియచేప్పేది మన జీవిత నేపథ్యం. ఈ జీవన మాధుర్యానుభూతి.. స్థాయి.. గాఢతలను నిర్ణయించేది మన జీవిత దృక్పథం.. వైఖరి.. భావన. సుఖం.. సంతోషం .. ఆనందం వీటి భావన, అనుభూతి మనందరిలో ఒకే రకంగా ఉండదు. జీవన మాధుర్యమూ అంతే! కొందరికి ఐశ్వర్యం జీవన మాధుర్యం. మరికొందరికి పుస్తకాలు. అందమైన ప్రకృతి, పరోపకారం .. జీవితార్థ శోధన.. ఆధ్యాత్మికత, జీవాత్మ – పరమాత్మల సంబంధ, సంయోగ యోచన, వృత్తి, హోదా... సజ్జన సాంగత్యం.. ఇలా అనేకానేక ఆలోచనలు జీవన మాధుర్యంలోని విభిన్నతను, వైవిధ్యతను సూచిస్తున్నాయి. లోకో భిన్న రుచిః. చెరుకు తియ్యగా ఉంటుంది. ఇది మనకందరకు తెలుసు. ఈ భావన అనుభవంలోకి రావాలంటే చెరకు గడ మీద ఉండే మందపాటి పెచ్చును తీసి, ముక్కను కొరికి నమలాలి. అపుడు కొద్దిగా తీపిదనం తెలుస్తుంది. ఎంత బాగా నమిలితే అంతటి రసం.. అంతటి తీపి. అలాగే జీవితం కూడ. ఇదీ చెరకు గడే.. ఎలా జీవించాలో తెలుసుకోవాలి. అనుభవించటం తెలియాలి. అనుభవించినకొద్దీ జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. క్షీరసాగర మధనం తరువాతే అమృతం లభించింది. దానిని మన జీవితంలో వెతికి పట్టుకోగలిగే చూపు.. నేర్పు కావాలి. లేనప్పుడు ఎవరైనా గురువును పెద్దల్ని.. అనుభవజ్ఞుల్ని ఆశ్రయించాలి. మధుపం అనేక పుష్పాలమీద వాలి.. వాటిలోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. తేనె అన్ని పుష్పాలలో ఉండదు. వేటిలో ఉంటుందో దానికి తెలుసు. వాటి మీద వాలి వాటి నుంచి తేనెను పీల్చుకుంటుంది. జీవిత పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదించాలంటే అది ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉందో తీసుకోగలగాలి. దాన్ని అందుకోవాలి. జీవితంలోని తీపిని మనకు తెలియచెప్పేది కుటుంబం. ఇది ప్రధాన సాధనం. బంధాలు – అనుబంధాలలోని తీయదనపు రుచి తెలుసుకున్న తరువాత స్నేహం ఆ రుచిని మరింత పెంచుతుంది. మన ఇంటి ఆవరణలో... మన వీధిలో ఉండే వాళ్ళతో సావాసం ఓ అద్భుత మధురసమే. తరువాత విద్యాభ్యాస కాలంలో స్నేహితులు, కాకి ఎంగిళ్ల తిళ్ళు.. మధ్యాహ్న భోజనాలలో పంచుళ్లు, వారితో గిల్లికజ్జాలు.. మౌనవ్రతాలు..ఊరేగటాలతో పాటు విద్యలో అసూయ.. ఒకరినొకరు దాటి వెళ్లాలనుకునే పోటీ తత్వం... సాహసాలు.. దుస్సాహసాలు ... ఇలా ఎన్ని మధురిమలు! గుండె పట్టలేనన్ని! ఇవి అనుభవించిన కాలంలోనే కాక తరువాతి కాలంలో కూడ నెమరువేసుకునే జ్ఞాపకాల తీపి ఊటలవుతాయి. ఒంటరితనంలో, మనసు శూన్యమైన సమయంలో.. గాయపడిన వేళ.. ఈ మధురిమలు ఎంత ఊరటనిస్తాయి! మనసు అతలాకుతలం కాకుండా కాపాడి మనల్ని నిలబెడతాయి. జీవన మాధుర్యాన్ని తెలుసుకుని.. దాన్ని అనుభవించేవారు విద్వాంసులే కానక్కర లేదు. వారు విద్యావిహీనులు కావచ్చు. సామాన్యులూ కావచ్చు. ఎవరైతే ఆ రుచిని ఒడిసి పట్టుకుని ఆస్వాదిస్తారో వారే గొప్ప వేదాంతులు.. యోగులు.. . సత్యశోధకులు. జీవిత మాధుర్యాన్ని తెలుసుకుని అనుభవించటమే జీవన రహస్యం. ఏమిటది? రెండక్షరాలలో ఉంటుందది. అదే.. తృప్తి... వివాహానంతరం ఒక స్త్రీ.. పురుషుడు దాంపత్యమనే నావలో జీవనసాగరంలో ప్రయాణం చేయాలి. ఆరంభపు అనురాగం అంబరమే. ఈ ఆనందపు తీపి గురుతులు మనస్సుకెంత ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని... హాయిని ఇస్తాయో! భార్యాభర్తల దాంపత్యపు తీయని ఫలాలే పిల్లలు. వారి పెంపకం.. ముద్దుమురిపాలు.. ఆపై వీరి వివాహం. మేము సైతం మీ జీవన మాధుర్యానికంటూ వచ్చేవాళ్లే కదా మనవలు.. మనవరాళ్లు. వివాహం వల్ల ఒనగూరే మధురిమలెన్నెన్నో ! రోహిణి కార్తె చండ్ర నిప్పులు తరువాత పలుకరించే తొలకరి జల్లులో ఒక ఆనందముంది. బాగా వేడెక్కిన భూమిని వానచుక్క చుంబించిన తరుణాన అవనినుండి వచ్చే మట్టి వాసనే అది. శీతాకాలపు ఉషోదయాన మంచు కురిసిన పచ్చిక మీద పాదాలుంచిన క్షణం.. ఓహ్... అది ఎంతటి హాయిని... ఆహ్లాదాన్ని ఆనందాన్నిస్తుంది! పిల్ల తెమ్మర మన నాసికకు చేరవేసే పూల సుగంధం కూడ ఒక జీవన మధురిమే. ఇలా మనకి ఆనందాన్నిచ్చేవన్నీ మన జీవన మాధుర్యాన్ని పెంచేవే. ఈ జీవన మధురిమలు ఎవరికైనా సొంతమే. ఎవరైనా ఆనందించవచ్చు. కావలసినది కొంచెం స్పృహ. తపన. అన్వేషణ. జీవిత అంతరార్థాన్ని, తనలోని అంతర్యామిని అర్థం చేసుకుంటూ ఆ సర్వాంతర్యామిని ఈ సకల చరాచర సృష్టిలో చూసే ప్రయత్నం కొందరు చేస్తారు. ఇదే వారి దృష్టిలో మానవ జీవితంలోని మాధుర్యాన్ని చూపగలిగే మార్గం. ఇదే గొప్పదైనది. ఇదే అసలైనది అని వారి భావన. భగవంతుడి తత్వాన్ని అవగతం చేసుకునే ఓ అద్భుతమైన సోపానం. మానవ సేవలో అంకితమవ్వటం మాధవ సేవే కదా! మంచి చేసేది... మంచిని పెంచేది ప్రతిదీ మాధుర్యాన్ని పంచి ఇచ్చేదే. జీవితంలోని మాధుర్యాన్ని దర్శించాలంటే బాధలను, కష్టాలను దూరంగా ఉంచి, ఆనందకరమైన జ్ఞాపకాలను సదా మననం చేసుకుంటూ ఉండాలి. చెడ్డవారిలోనూ మంచిని చూడగలగాలి. చేదులోను తీపిని చూసే మానసిక స్థితిని పెంచుకోవాలి. అప్పుడు సృష్టి అంతా మధురంగానే ఉంటుంది. – లలితా వాసంతి -
భిన్నత్వమే మన బలం
న్యూఢిల్లీ: భిన్నత్వమే భారత్, అమెరికా సమాజాల బలమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఇరు దేశాల చర్యలే 21వ శతాబ్దాన్ని నిర్దేశించబోతున్నాయని చెప్పారు. భారత్‌తో మైత్రి బలోపేతానికి అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భిన్నత్వమే ఇరు దేశాల బలమని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, కోవిడ్‌పై పోరాటం తదితర కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. పలు అంశాలపై బ్లింకెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని జైశంకర్ ట్వీట్ చేశారు. శాంతియుత, సుస్థిర అఫ్గాన్‌ను భారత్, అమెరికా కాంక్షిస్తున్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ సంప్రదింపులు జరిపారు. భద్రత, రక్షణ, ఆర్థికం, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం. దలైలామా ప్రతినిధి డాంగ్‌చుంగ్‌తో భేటీ టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తరఫు సీనియర్ ప్రతినిధి గాడప్ డాంగ్‌చుంగ్‌తో బ్లింకెన్ సమావేశమయ్యారు. తద్వారా టిబెట్‌కు అమెరికా మద్దతు కొనసాగిస్తోందనే సందేశాన్నిచ్చారు. పౌర సమాజం సభ్యులతో బ్లింకెన్ జరిపిన చర్చల్లో టిబెట్ ప్రతినిధి గెషీ డోర్జీ డామ్‌దుల్ పాల్గొన్నారు. మరో 25 మిలియన్ డాలర్లు భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకరిస్తామంటూ బ్లింకెన్ ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వం నుంచి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) ద్వారా మరో 25 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. ఆగస్టు మాసాంతానికికల్లా ఇండియాలో 68,000 విద్యా వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా ప్రారంభ దశలో ఇండియా సహకారం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు. క్రియాశీలకంగా పౌర సమాజాలు దేశంలో తమ గళం వినిపించే అర్హత ప్రతి ఒక్కరికీ ఉందని బ్లింకెన్ ఉద్ఘాటించారు. వారు ఎవరన్న దానితో సంబంధం లేకుండా తగిన గౌరవం ఇవ్వాలన్నారు. భారతీయులు, అమెరికన్లు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, మత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తారని గుర్తుచేశారు. ఏడుగురు పౌర సమాజం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని గుర్తుచేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే కీలక ఆధారమని వెల్లడించారు. పౌర సమాజాలు క్రియాశీలకంగా పనిచేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమవుతుందని బ్లింకెన్ అన్నారు. బైడెన్ అంకితభావం భేష్: మోదీ భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రదర్శిస్తున్న అంకితభావం, పట్టుదల అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. బ్లింకెన్‌తో మోదీ భేటీ అయ్యారు. ‘బ్లింకెన్‌తో భేటీ ఆనందంగా ఉంది. భారత్–అమెరికా సంబంధ బాంధవ్యాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా బైడెన్ చూపుతున్న అంకితభావాన్ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల నడుమ ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడానికే కాదు అంతర్జాతీయంగానూ మన వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం’అని మోదీ ట్వీట్ చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాను బలోపేతం చేసే విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. -
భిన్నత్వం లేకుంటే క్రికెట్టే లేదు: ఐసీసీ
దుబాయ్: పోలీసుల అకృత్యానికి బలైన నల్లజాతి అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ గొప్పతనాన్ని చాటిచెప్పేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులోని వైవిధ్యాన్ని ఈ వీడియో ప్రస్ఫుటం చేస్తోంది. వేర్వేరు జాతులకు చెందిన ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టు సమష్టిగా ఆడి గతేడాది న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్ కలను ఎలా సాకారం చేసుకుందో ఈ వీడియో చూపిస్తోంది. బార్బడోస్ మూలాలున్న జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన సూపర్ ఓవర్‌తో ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచకప్ అందించిన క్షణాలు ఈ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. దీనికి ‘భిన్నత్వం లేకుంటే క్రికెట్టే లేదు’ అనే వ్యాఖ్యను ఐసీసీ జోడించింది. వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్‌లో, టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌లో... స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లకు పాకిస్తాన్లో, ఓపెనర్ జేసన్ రాయ్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. వివక్షకు గురవుతోన్న నల్లజాతి క్రికెటర్లకు మద్దతుగా ఉండాలని వెస్టిండీస్ క్రికెటర్లు గేల్, స్యామీ ఇటీవలే ఐసీసీని కోరారు. -
వైవిధ్యం రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలోని వైవిధ్యమే భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకమని వివిధ భాషలు, సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను పరిరక్షించడంలోనే ఏకత్వం ఇమిడి ఉందని నల్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే భావన రాజ్యాంగ విరుద్ధమైనదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాహితీ ఉత్సవం రెండో రోజైన శనివారం నిర్వహించిన ‘డైవర్సిటీ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్’ అనే అంశంపైన ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పీఠికలోనే ‘భారత ప్రజలమైన మేము..’ అనే సంబోధన ఉంటుందని, అది విభిన్న వర్గాల ప్రజల సమష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ మినహా భారత ప్రధానులంతా ఆ స్ఫూర్తినే కొనసాగించారన్నారు. మతం ప్రాతిపదికన మెజారిటీ, మైనారిటీ నిర్వచించడం సరైంది కాదని, స్థానిక పరిస్థితులు, భాషను ఇందుకు ప్రామాణికంగా భావించాలని పేర్కొన్నారు. దేశంలో హిందూ మతం మెజారిటీ అని, మిగతావి మైనారిటీవని చెప్పేందుకు అవకాశం లేదన్నారు. పంజాబ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ వర్గాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మైనారిటీ వర్గాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పార్లమెంట్ ఉభయ సభలు అత్యధిక మెజారిటీతో ఆమోదించినంత మాత్రాన కొలీజియంపై సుప్రీంకోర్టు తీర్పే అంతిమమైందని, అలాగే అగ్రకుల పేదల రిజర్వేషన్ల విషయంలోనూ మెజారిటీ పార్లమెంట్ సభ్యుల ఆమోదమే ప్రామాణికం కాకపోవచ్చునన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. దళితులు, ముస్లింలు,ఆదివాసీలు, తదితర వర్గాలపైన జరుగుతున్న దాడులు, వారి జీవన విధానాలను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ మార్గమే అనుసరణీయం..... గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘గుజరాత్ సాహిత్యం– గాంధీజీ తులనాత్మక అధ్యయనం’పై జరిగిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు.నేటికీ గాంధీజీ మార్గమే అనుసరణీయమని, జయాపజయాలు అనే కోణంలో దాన్ని అర్థంచేసుకోవడం సరైంది కాదన్నారు. గుజరాతీ రచయిత సితాన్షు యశస్చంద్ర మాట్లాడుతూ, ‘నా తల్లి స్తన్యమిస్తూ చెప్పిన పలుకులు గుర్తు లేవు, కానీ ఆ పలుకులను ఆమె ఏ భాషలో పలికిందో ఆ భాష... పాలతోపాటే నా ఒంట్లోకి ప్రవహించింది. భావాన్ని యధాతధంగా వ్యక్తం చేయగలిగేది తల్లి భాషలోనే’అని చెప్పిన గాంధీ మాటలను గుర్తు చేశారు. ‘సమాజం మారాలని చూడవద్దు, మనిషి ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా నిన్ను నువ్వు మార్చుకుంటే సమాజం నువ్వనుకున్నట్లే మారుతుంది’అని గాంధీజీ చెప్పిన విషయాన్ని... ‘నీటి బిందువులు మారితే సముద్రం కూడా మారిపోతుంది’‘గాంధీ, యాన్ ఇంపాజిబుల్ పాజిబులిటీ’ అంశం మీద సుధీర్ చంద్ర ప్రసంగించారు. ప్రణయ్ లాల్ రాసిన ‘ఇండియా, ఎ డీప్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్’పుస్తకం మీద చర్చాగోష్టి జరిగింది. ‘కాంటెంపరరీ కరెంట్స్ ఇన్ గుజరాతీ లిటరేచర్’ అంశం మీద సాగిన చర్చలో గుజరాతీ సాహిత్యంలో చోటు చేసుకున్న మార్పులను ప్రస్తావించారు. హింసకు కూడా ఓ మానవీయ కోణం రచయితలు, కళాకారుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో పాల్గొంటున్నది సామాజికంగా కింది స్థాయిలోనివాళ్లే కావడాన్ని మానవీయ కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు ‘ఆర్ట్ ఎటాక్స్’ పుస్తక రచయిత్రి ప్రొఫెసర్ మాళవిక మహేశ్వరి. ‘కళ, ఆదర్శవాదం’ అంశం మీద జరిగిన చర్చలో ఆమె సీని యర్ పాత్రికేయుడు సలీల్ త్రిపాఠితో కలిసి పాల్గొన్నారు. చందనా చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. వెనకవుండి దాడులను ప్రోత్సహించేది ఎవరైనా, జీవితంలోని నిరాశ వల్ల ‘ఏదో సాధించిన తృప్తి’కోసం పేదవాళ్లు ఈ హింసలో పాల్గొంటున్నారని మాళవిక చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. మనోభావాలు గాయపడటం అనే కోణాన్ని స్పృశిస్తూ– స్వేచ్ఛకు పరిమితులు విధించినట్టుగా కనబడే రాజ్యాంగం, నిజానికి అప్పటి కాలాన్ని ప్రతిబింబించడంతోపాటు ప్రజలను ఉదారవాదులుగా పరిణామం చెందించే పాత్ర కూడా పోషిస్తోందనీ, అందువల్ల ప్రజాస్వామ్యానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. మృణాళిని సారాభాయి శత జయంతి సందర్భంగా ఆమె కుమార్తె మల్లికాసారాభాయి నివాళులర్పించారు. రెండో రోజు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోహన్ భగవత్ తర్వాతి ప్రధాని? ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తెరమీదకు వచ్చే అవకాశముం దని సీనియర్ పాత్రికేయుడు కింగ్షుక్ నాగ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స్పష్టమైన మెజారిటీæ గెలుచుకుంటే సహజంగా మోదీయే అభ్యర్థిగా ఉంటారు. కానీ 150–160 సీట్లు మించి బీజేపీ గెలవకపోతే మాత్రం భగవత్ కూడా బరిలోకి దిగవచ్చన్నారు. ‘ద చీఫ్ అండ్ ద చీఫ్ మినిస్టర్’ చర్చాకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు యూపీఏ అభ్యర్థిగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని పదవికి పోటీపడే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవచ్చన్నారు. మమతా బెనర్జీ జీవిత కథ ‘దీదీ.. అన్‌టోల్డ్ స్టోరీ’ రాసిన పాత్రికేయురాలు శుతాపా పాల్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి మరో పాత్రికేయురాలు ఉమా సుధీర్ సమన్వయకర్తగా వ్యవహరించా రు. ప్రణబ్ ముఖర్జీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ‘క్విడ్ ప్రో కో’ చర్యనా అన్న ప్రశ్నకు.. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకు ని చేసిన చర్యగా ప్యానెల్ అభిప్రాయపడింది. -
గుజరాత్లో ‘ఏకత్వం’ చిన్నాభిన్నం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్’ ఇక పాత మాటేనా! హిందీ మాట్లాడే వలసవాదులపై దాడులతో గుజరాత్ రగిలిపోతోంది. దాడులను ఎదుర్కోలేక బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వలసకార్మికులు తట్టా బుట్టా సర్దుకొని పారిపోతున్నారు. సబర్కాంత జిల్లాలో సెప్టెంబర్ 28వ తేదీన ఓ 14 ఏళ్ల బాలికను ఓ బిహారి రేప్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో బిహారీలకు వ్యతిరేకంగా ఒక్కసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఆ హింసాకాండ అనతికాలంలోనే హిందీ మాట్లాడే యూపీ, మధ్యప్రదేశ్ వలసకార్మికులపైకి మళ్లింది. అంతే సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, పఠాన్, మెహసాన జిల్లాలకు హింసాకాండ విస్తరించింది. (చదవండి: దాడులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీనే) ఎప్పటిలాగే ఈ అల్లర్లలో కూడా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. పోషిస్తోంది. వలస కార్మికులను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్న వీడియో దృశ్యాలను విపరీతంగా షేర్ చేస్తోంది. దాడులను రెచ్చగొడుతోంది. పరిస్థితి సమీక్షించి ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాలని, చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా? అన్నది ఆలోచించాల్సిన రాజకీయ నాయకులు పరస్పరం బురద చల్లుకుంటున్నారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తున్న గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ, జెడీయూ పార్టీలు అనవసరంగా నిందిస్తున్నాయి. బిహార్‌లో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అల్పేష్ ఠాకూర్‌ను బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌధరి హెచ్చరించారు. (చదవండి: హింసాత్మక చర్యలకు పాల్పడకండి) భారత్‌లో వలసలనేవి సర్వసాధారణం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాలు తమ అభివృద్ధి పథంలో వలసలకు ఆశ్రయమిస్తున్నాయి. మరోపక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు కూడా వలసలకు ఊతమిచ్చాయి. మహారాష్ట్రలో, కర్ణాటకలో బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అప్పుడప్పుడు వింటుంటాం. మహారాష్ట్రలో అడపాదడపా బిహార్, యూపీ వలసదారులకు వ్యతిరేకంగా దాడులు కూడా జరుగుతాయి. గుజరాత్లో రాజకీయ నాయకులు వలసల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఇదే మొదటి సారి. ఉత్తరాది నుంచే వలసలు 1980 దశకంలో ఉత్తర భారత్ నుంచి వలసలు బయల్దేరాయి. రాష్ట్రాల మధ్య వలసలు 1991–2001 దశాబ్దంలో మోస్తారుగా పెరిగాయి. 2001–2011 దశాబ్దంలో ఆ వలసలు రెండింతలు దాటాయి. బాగా వెనకబడిన ఉత్తర ప్రదేశ్ నుంచి వలసలు రెండింతలు పెరగ్గా, బిహార్ నుంచి 2.3 రెట్లు పెరిగాయి. భిన్న మతాల వారు, భిన్న భాషీయులు, భిన్న సంస్కృతుల ప్రజలు కలిసుండే భారత్‌ను విదేశీయులు ప్రశంసిస్తుండగా, మాది భిన్నత్వంలో ఏకత్వం అంటూ మురిసిపోయే వాళ్లం. ఇప్పుడు ఆ మురిపాలు కాస్త నగుపాలయ్యే ప్రమాదం ఏర్పడింది. -
భిన్నత్వంతో విభేదాలు రాకూడదు
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు. భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్‌కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు. అధికారంతో సంబంధం లేదు ‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు. -
ఇలాంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారా!?
సాక్షి, న్యూఢిల్లీ : అక్కడి ప్రజలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా అంతగా పట్టించుకోరు. ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ముఖ్యంగా పరాయి మనిషి కనిపిస్తే పలకరింపుగా వారి బుగ్గలు సొట్టలవుతాయి. చిద్విలాసంగా పెదవులు విచ్చుకుంటాయి. కళ్లలో ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి వారి హృదయాలను తాకుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు కనిపిస్తే ఏ సహాయం చేయడానికైనా వారు ముందుకొస్తారు. అలాంటి మనుషులు ఇంకా ఈ భూమండలం మీద, ఈ ప్రపంచంలో ఉన్నారా? అని ఆశ్చర్యం వేస్తోంది. వారు మరెక్కడో కాదు, మన దేశంలోనే, మన కేరళ రాష్ట్రంలోనే ఉన్నారు. అక్కడ అందరూ కలసి మెలసి జీవించడమే వారి జీవన వైవిధ్యం. అక్కడ జాతి, మత, భాష, ప్రాంత భావాలు లేవా? అంటే ఉన్నాయి. జాతి, మత, భాష, ప్రాంతాలవారీగా వారు 38 సామాజిక వర్గాల వారు. చారిత్రకంగా వారిలో జనాభా ప్రాతిపదికన ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, హిందువులు ఉండగా, వలసపాలన వల్ల ఇంగ్లీషు, డచ్, ప్రోర్చుగీసు వారు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచున్నారు. అలాగే అక్కడికి వివిధ దేశాల నుంచి నావికులు, వ్యాపారులు, కాందిశీకులు, రాజకీయ శరణార్థులు వచ్చి చేరారు. మొదట చేపలు, మాంసాహార వ్యాపారంపై ప్రధానంగా జీవించిన అక్కడి ప్రజలు ఆ తర్వాత మసాలా దినుసులు, తేయాకు ప్రధాన వ్యాపారంగా జీవిస్తున్నారు. వారి వ్యాపారానికి పర్యాటకులే ప్రధాన వినియోగదారులయ్యారు. ఇలా 38 సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక్కచోట కలసి మెలసి జీవించడం మామూలు విషయం కాదు. ఎప్పుడైనా వారి మధ్యలో జాతి, మత, భాషా భేదాలు రావా? అన్న అనుమానం కలుగుతోంది. వారిలో ఎవరి మతం వారదని, ఎవరి జాతి వారిదనే భావం మాత్రమే కాదు. తమ జాతే, తమ మతమే, తమ కట్టుబాట్లే గొప్పవన్న ఆలోచన కూడా ఉంది. అది కేవలం వారి ఇంటికే పరిమితం. బయటకొస్తే వారిలో అందరూ సమానులే. వారిలో సమభావం కొనసాగడానికి వివిధ దేశాల నుంచి అక్కడికి తరలివచ్చే పర్యాటకులే కారణం కావచ్చు. వారు ఒకేసారి కలిసి మసీదుకు, చర్చికి, దేవాలయానికి, యూదులు, జైనుల ప్రార్థనా మందిరాలకు బయల్దేరి వెళతారు. వివిధ ఆలయాల ముందు విడిపోయే వాళ్లు తమ ప్రార్థనల అనంతరం మళ్లీ కలుసుకొని ఎవరి గమ్యాలకు వారు చేరుకుంటారు. కొన్ని సార్లు కలిసే మసీదులు, చర్చిలు, మందిరాలకు వెళతారు. ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ‘మటన్చెర్రీ’ ప్రాంతాన్ని అనుకోకుండా సందర్శించిన ఫొటోగ్రాఫర్ బిజూ ఇబ్రహీం వారి సంస్కృతిని చూసి ముగ్ధులయ్యారు. 38 సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలను ఎంపిక చేసుకొని వారిని ఫొటోలు తీశారు. ఆయన అన్ని ఫొటోలను బ్లాక్ అండ్ వైట్‌లోనే తీశారు. నిజమైన మనుషులపైనే చూపరుల దష్టి పడాలనే ఉద్దేశంతోనే తాను బ్యాక్ అండ్ వైట్‌లో వారి ఫొటోలను చిత్రీకరించానని ఆయన చెప్పారు. కలర్ ఫొటోల్లో మనుషులకంటే వారి చుట్టూ ఉంటే వాతావరణం, వాటి రంగులే ప్రధానాకర్షణగా ఉంటాయని చెప్పారు. కొచ్చిలో ప్రస్తుతం నడుస్తున్న ఫొటో ఎగ్జిబిషన్లో బిజూ ఇబ్రహీం మటన్చెర్రీ ప్రజల ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. మటన్చెర్రీ మరెక్కడో లేదు. కొచ్చి ప్రధాన కేంద్రానికి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ ప్రాంతం. ఆ ప్రాంతం ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. అక్కడ చరిత్రాత్మక మసీదు, చర్చి, దేవాలయాలతోపాటు యూదు, జైన మందిరాలు ఉన్నాయి. నేడు దేశాన్ని పీడిస్తున్న విద్వేష రాజకీయాలు తమ దరి చేరకుండా అక్కడి ప్రజలు అడ్డుకుంటారని భావిద్దాం. అక్కడి ప్రజలు మలయాళం, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. ఆ ప్రాంతానికి ఒకప్పుడు మటన్ వ్యాపారులు ఎక్కువగా ఉండడం వల్ల మటన్చెర్రీ అనే పేరు వచ్చిందని, అంచెర్రీ మఠం ఉండడం వల్ల మటన్చెర్రీ పేరు వచ్చిందనే భిన్న కథనాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే మరి! చిత్రాలు : బీజూ ఇబ్రహీం -
‘వారికి మతతత్వ భావం లేదు’
కోల్‌కతా: తమ రాష్ట్ర ప్రజల్లో మతతత్వ భావం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మమత ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడు ఐకమత్యాన్ని, వైవిధ్యాన్ని నమ్ముతారు. మతతత్వ భావం బెంగాల్ ప్రజల ఆలోచనలోగాని, హృదయాల్లోగాని లేదు’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. గతకొంత కాలంగా బెంగాల్లో మతకల్లోలాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 2016 హౌరా అల్లర్లు, ఈ ఏడాది మార్చిలో అస్నాసోల్, రాణిగంజ్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి మతపరమైన ఘర్షణలు కావని, కేవలం చిన్న చిన్న స్థానిక ఘర్షణలు మాత్రమేనని మమత పేర్కొన్నారు. బెంగాల్లో మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించాలని బీజేపీ భావిస్తోందని మమత బెనర్జీ గతంలో అనేక సార్లు విమర్శించారు. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సారాజ్ గంగారం పార్లమెంట్‌కు సమర్పించిన ఓ నివేదికలో గత మూడేళ్ళుగా దేశంలో అత్యధికంగా మతకల్లోలాలు జరుగుతున్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలివడం విశేషం. -
మన సంస్కృతికి ఇవే మచ్చు తునకలు
న్యూఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిని, భిన్నమతాల వారు ఐకమత్యంతో కలసి ఉండడం భారత్‌లాంటి దేశానికే సాధ్యమైందని లండన్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ గొప్పగా చాటి చెప్పారు. దేశంలో *అసహనం* పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు రాజకీయమే కావచ్చుగాక... నిజంగా మనది భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతని చాటి చెప్పేందుకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు.... ముస్లిం దంపతుల కొడుకుకు గణేశ్ పేరు 27 ఏళ్ల ఇలాయజ్ షేక్ ఒకరోజు నిండు చాలాలు అయిన తన భార్య నూర్ జహాన్‌ను డెలివరి కోసం ముంబైలోని ఓ ఆస్పత్రికి కారులో తీసుకెళుతున్నాడు. మార్గమధ్యంలోనే నూర్ జహాన్‌కు నొప్పులు పెరిగాయి. తన కారులో ప్రసవం ఒప్పుకోనంటూ ఆ కారు డ్రైవర్ వారిని బలవంతంగా అక్కడే దించేశారు. ఏం చేయాలో తోచని షేక్ సమీపంలోవున్న గణపతి గుడికి తన భార్యను తీసుకొని వెళ్లాడు. అక్కడున్న హిందూ మహిళలు కొందరు ఆమె పరిస్థితిని గమనించి గుడి స్తంభాలకు అడ్డుగా చీరలు కట్టి నూర్ జహాన్‌కు ప్రసవం చేశారు. అలా పుట్టిన కొడుకును షేక్ దంపతులు గణేశ్ అని నామకరణం చేశారు. హిందూ స్నేహితుడికి అంత్యక్రియలు చేసిన ముస్లిం ప్రాణాంతక జబ్బుతో అర్ధాంతరంగా కన్నుమూసిన సంతోష్ సింగ్ అనే మిత్రుడికి రజాక్ ఖాన్ తికారి హిందూ మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం, ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లో ఇటీవల చోటుచేసుకొంది. పేదవారైన సంతోష్ సింగ్ కుటుంబాన్ని రజాక్ ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. ఉమ్మడిగా అంత్యక్రియలు మధ్యప్రదేశ్‌లోని బార్వాని జిల్లా సెంద్వా పట్టణంలో సీతారాం అనే 75 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మరణించాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూలేక పోవడంతో స్థానిక హిందువులు, ముస్లింలు కలసి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనుమాన్ ఛాలీసా ఉర్దూలోకి అనువాదం హిందూ, ముస్లింల ఐక్యతను కోరుకుంటా అబీద్ అల్వీ అనే ముస్లిం యువకుడు హనుమాన్ ఛాలీసాను ఉర్దూలోకి అనవదించారు. ముస్లింల విశ్వాసానికి చెందిన ఉర్దూ పుస్తకాలను హిందీలోకి, హిందువుల గ్రంధాలను ఉర్దూలోకి మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన అబీద్ అల్వీ అభిప్రాయపడ్డారు. గణపతి పందిరిలో ముస్లిం ప్రార్థనలు ముంబైలోని ఓ మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు చాలినంత చోటు లేకపోవడంతో మసీదు పక్కన వేసిన గణపతి పందిరిలోకి ముస్లింలను హిందూ భక్తులు ఆహ్వానించారు. పక్కన వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి ఉన్నప్పటికీ ముస్లింలు అదే పందిరిలో ప్రార్థనలు జరిపారు. లూథియానా జైల్లో ఉమ్మడి పండుగలు లూథియానా జైల్లో ముస్లింలు, హిందువులు, సిక్కులు రంజాన్, దీపావళి, గురుపూరబ్ పండగలు కలసే జరుపుకుంటారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సంఘీభావంగా హిందువులు, సిక్కులు 40 రోజుల పాటు ఉపవాసం చేయగా, ముస్లింలు, సిక్కులు దసరా, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ కీర్తనలు ఆలపించే బాబా.... మహారాష్ర్టలోని బీడ్ నగరానికి చెందిన 73 ఏళ్ల సాయిక్ రియాజొద్దీన్ అబ్దుల్ గనీ హిందూ దేవాలయాల్లో మీరా భక్తి గీతాలు, హిందూ కీర్తనలు ఆలాపిస్తూ హిందువులను ఎంతోగానో ఆకర్షిస్తున్నారు. రాజుబాబా కీర్తనకారుడు అని ఆయన్ని హిందువులు పిలుస్తారు. మతసామరస్యమనేది భారతీయ సంస్కృతిలో ఆనాదిగా ఉన్నదే. సూఫీ మతాధికారుల సమాధుల వద్దకెళ్లి ఉర్సు కార్యక్రమాల్లో హిందువులు పాల్గొనడం తెల్సిందే. హిందువులు, సిక్కులు కలసి దేశంలో మసీదులు నిర్మించడం, ముస్లింలు, హిందువులు కలసి దేవాలయాలు, గురుద్వారాలు నిర్మించడం లాంటి సంఘటనలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. -
'వైవిధ్యమే భారత సౌందర్యం'
భిన్న మతాలు, కులాలు కలిగి ఉండటమే భారతదేశం యొక్క సౌందర్యం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మన ఆలోచనలు, చర్యలు సమైఖ్యతను ముందుకు తీసుకుపోయేవిగా ఉండాలన్నారు. జాతీయ సమైఖ్యత కోసం సర్థార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. భారత్ యొక్క విశిష్ట లక్షణమైన వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో దేశంలో అశాంతి రేపుతున్న దాద్రీ వివాదం, హర్యానాలో దళితుల హత్యల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
వైవిధ్యాన్ని కాదంటే చిక్కే
జాతిహితం ఆర్ఎస్ఎస్ పాశ్చాత్యుల వృద్ధికి విస్తుపోతుంది. కానీ దాని సాంస్కృతిక ప్రభావం గురించి భయపడుతుంది. తాత్విక పవనాలు తూర్పు నుంచి పడమటికే వీయాలని నమ్ముతుంది. మోదీ తన విదేశీ పర్యటనల ద్వారా ఆ అవసరాన్ని తీరుస్తున్నారని అది భావిస్తోంది. దేశంలో లోతైన సాంస్కృతిక మార్పులను తేవడానికి కూడా ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని అది వ్యాఖ్యానించినప్పుడే తంటా వస్తోంది. వైవిధ్యంతో సహజీవనాన్ని నేర్చుకుంటూనే, భారత సమాజాన్ని ఏకరూపమైనదిగా ఎలా చేయగలుగుతారు? బీజేపీ గతంలో కూడా దేశాన్ని పాలించింది. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిపతి విజయదశమి సందర్భంగా ఏటా ఇచ్చే సంప్రదాయక సందేశం ఇప్పుడు మాత్రమే జాతినుద్దేశించి చేసిన అధికారిక ప్రసంగంలా ఉంది. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వానికి భిన్నంగా నేడున్నది నిస్సందేహంగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. బహుశా ఇదేమీ చెడ్డ విషయం కాదు. జనసంఘ్/బీజేపీ, ఒక పెద్ద పార్టీలో భాగంగా లేదా కూటమి నేతగా గతంలో కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి, నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి మధ్య ఉద్రిక్తతలను అది సాకుగా చూపుతుండేది. ఈ పరిణా మం ఆ అవకాశం లేకుండా చేస్తుంది. వాజ్‌పేయి విధానాలను ఆర్ఎస్ఎస్ ప్రతిఘటించిందనడానికి ఇప్పుడు ఆధారాలేమీ లేవు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలాంటి విభేదాలేవీ ఉన్నట్టు మనకు కనబడలేదు. మోదీ తనకు నష్టం జరుగుతున్నాగానీ హిందుత్వంలో తనకున్న విశ్వాసం విషయంలో నిష్కప టంగా ఉండటమే ప్రాథమికంగా అందుకు కారణం. పైగా ఆయన, తాను గుజరాత్ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపానని, కేంద్రంలో మాత్రం ఎందుకు సమస్యలు వస్తాయని కూడా విశ్వసిస్తున్నారు. అందువలన వాజ్‌పేయితో పోలిస్తే ఆర్ఆర్ఎస్తో సంబంధాల్లో ఆయన స్థానం భిన్నమైనది. వాజ్‌పేయి ఆర్ఎస్ఎస్ నేతల పట్ల గొప్ప వ్యక్తిగత గౌరవాన్ని చూపేవారు. ఆర్ఎస్ఎస్ నేతల అభిమానపాత్రులకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు, బ్యాంకు లోన్లు. ఒప్పందాలు మంజూరవ్వడానికి, సులువుగా డబ్బు సమకూరడానికి బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు సహాయపడేలా చూసేవారు. సంఘ్, బీజేపీల మధ్య కొత్త బంధం అయితే ఆర్ఎస్ఎస్తో, దాని అధిపతి కేఎస్ సుదర్శన్‌తో ఆయన సంబం ధాలు ధిక్కారం అంచున నిలిచిన అపనమ్మకంతో నిండి ఉండేవి. అయితే వ్యక్తిగత సంభాషణల్లో వాజ్‌పేయి ఆర్ఎస్ఎస్ నేతలపై ఛలోక్తులు విసురు తుండేవారు. తరుచుగా అవి ప్రేమపూర్వకంగా ఉండేవి. అంతేగానీ ఎన్నడూ నిందాపూర్వకంగా ఉండేవి కావు. వారిని ఆయన సాంస్కృతిక వ్యవహారాల్లో తలదూర్చనిచ్చేవారు. తన మిత్రుడు, ఆర్ఎస్ఎస్కు ఇష్టుడు అయిన మురళీ మనోహర్ జోషికి మానవవనరుల శాఖను అప్పగించారు. అయితే జోషికి భౌతికశాస్త్రంలో నిజమైన డాక్టరేటే ఉంది, అల్హాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా కూడా పనిచేశారు. అయితే, ఆర్థిక వ్యవస్థలోని కీలక అంశా లను, విదేశాంగ విధానాన్ని, చివరికి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని, అది పాకిస్తాన్‌తో సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోందనేదాన్ని వాజ్‌పేయి పూర్తిగా తన అధికార పరిధిలోనే ఉంచుకునేవారు. కార్గిల్ యుద్ధ కాలంలోను, పార్లమెంటుపై దాడి తదుపరి ఆయన న్యాయాధికారి శైలిలో వ్యూహాత్మక సంయమనాన్ని పాటించారు. లోతు లేని భావజాల పునాదులు సర్ సంఘ్ చాలక్ దసరా ఉపన్యాసం అప్పట్లో కూడా పత్రికల్లో మొదటి పేజీలోనే వచ్చేది. అయితే దానికి ఇప్పుడున్నంత ప్రాధాన్యం మాత్రం ఎప్పుడూ ఉండేది కాదు. మారిన నేటి పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది దూర దర్శన్ మోహన్ భాగవత్ దసరా ఉపన్యాసాన్ని లైవ్‌లో ప్రసారం చేయడాన్ని కొందరు తప్పు పట్టారు. వారు వార్తా విలువ అనే ముఖ్యమైన విషయంలో పొరబాటు చేశారు. నూతనమైన ఈ ఏర్పాటు రాజకీయ వాస్తవం. ఆర్ఎస్ఎస్ భావజాలపరమైన పునాదులు సరళమైనవి, లోతులేనివి. కేశవ్ బాలిరామ్ హెగ్డేవర్, ‘‘గురూజీ’’ ఎమ్ఎస్ గోల్వాల్కర్, కొంత వరకు వినాయక్ దామోదర్ సావర్కర్లు ఆర్ఎస్ఎస్ సంస్థకు వ్యవస్థాపక పితా మహులు. వారంతా భారత (హిందూ) సంస్కృతి, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలోనే ప్రపంచంలో ఉత్కృష్టమైనవని విశ్వసించినవారు. పాశ్చాత్య శక్తులు జయించిన వారు ఎలా అణచివేతకు గురవుతూ, ఎంతటి దయనీ యంగా ఉండిపోయారో, మరింత సుదూర ‘‘గతంలో’’ మనతో ‘‘సంబం ధాలు పెట్టుకున్న’’ ఇతరులు, ప్రత్యేకించి, దక్షిణ ఆసియాలోని వారు అందు వల్ల ఎలా లబ్ధిపొంది, నేటికీ హిందూ జీవన విధానాన్ని, పేర్లను కొనసాగి స్తున్నారో (ఇండొనేసియాలో లాగా కొందరు తర్వాత ముస్లింలుగా మారినా) గోల్వాల్కర్, హెగ్డేవర్లు గొప్పగా చెబుతుండేవారు. పాశ్చాత్య దేశాలంటే భయం ఆర్‌ఎస్‌ఎస్‌కున్న ‘పాశ్య్చాత్య భీతి’ (వెస్ట్-ఫోబియా) సంకుచితత్వం ఆసక్తి కరం. అది పాశ్చాత్య విలువలను తిరస్కరిస్తుంది. కానీ వారి ప్రశంసలు అందుకోవాలని పిల్లల్లాగా వెర్రిగా తాపత్రయపడుతుంది. భౌతిక సంపన్ను లైనా ఆధ్యాత్మిక దారిద్య్రంలో మగ్గుతున్న అమెరికన్ శ్రోతలను చికాగో ఉప న్యాసంతో ‘‘కట్టిపడేసిన’’ వివేకానందుడు వారి నిజమైన ఆదర్శ పురుషుడు. వారు చెప్పే ‘హిందూ రాష్ట్ర’ మైనారిటీలనన్నిటినీ దేశం నుంచి బహిష్కరిం చదు. ఆర్ఎస్ఎస్ భావజాలం హిందుత్వ పునాదులపై జాతీయ వాదాన్ని పునర్నిర్మిస్తుంది. మైనారిటీలు దాన్ని సంతోషంగా అనుసరించవచ్చు, మరే ఇస్లామిక్ లేదా క్రైస్తవ దేశంలో కంటే హిందుస్థాన్ (ఆర్ఎస్ఎస్ కోరుకు నేదదే) లోనే ఎక్కువ సంతోషంగా ఉన్నామని నమ్మడం ప్రారంభించవచ్చు. భారత ముస్లింల దేశభక్తికి ‘‘కలాం ప్రమాణం’’ మూలాలు ఉన్నది అక్కడే. వారి మతాల కంటే పురాతనమైన హిందుత్వ విశాల హృదయం వల్లనే ఇది సాధ్యపడిందని మైనారిటీలంతా దానికి రుణపడి ఉండాలి. అంతేగానీ అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల లభించినదేమీ కాదు. ఈ ఏడాది దసరా ఉపన్యాసంలో అంబేడ్కర్‌కు కూడా దాదాపు భగత్సింగ్లాగే (కమ్యూ నిస్టు వామపక్షవాది) దైవత్వం ఆపాదించడాన్ని గమనించండి. అంబేడ్కర్ హిందూ మతాన్ని తిరస్కరించి బౌద్ధాన్ని స్వీకరించడాన్ని వారు ఆమోదిం చారు. పైగా 20 ఏళ్లు లోతైన విశ్లేషణ జరిపి ఆయన బౌద్ధాన్ని స్వీకరించడాన్ని కొనియాడారు. కానీ ఆయన రచించిన రాజ్యాంగం గురించి మాత్రం పెద్దగా మాట్లాడలేదు. సారాంశంలో ఆర్ఎస్ఎస్ పాశ్చాత్యుల వృద్ధిని చూసి నివ్వెర పోతుంది. కానీ దాని సాంస్కృతిక ప్రభావం గురించి భయపడుతుంది. కానీ తాత్విక పవనాలు మాత్రం తూర్పు నుంచి పడమటికే వీయాలని నమ్ము తుంది. మోదీ తన విదేశీ పర్యటనల్లో తరుచుగా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ అవసరాన్ని తీరుస్తున్నారని అది భావిస్తోంది. మోదీని ఆర్ఎస్ఎస్ పాత తరం నాయకత్వం... భారత ప్రభుత్వాధికార శక్తిని చేత బట్టి హిందుత్వ శుభ సందేశాన్ని ప్రపంచానికి వినిపిస్తున్న ఆధునికమైన, జెట్ సెట్టింగ్ వివేకానందునిగా చూస్తోంది. ‘సాంస్కృతిక మార్పుల’తోనే తంటా 2014 ఎన్నికల ఫలితాలు భారత దేశంలో లోతైన సాంస్కృతిక మార్పులను తీసుకురావడానికి కూడా తమకు అధికారాన్ని కట్టబెట్టాయని ఆర్ఎస్ఎస్ భావజాల కర్తలు వ్యాఖ్యానించినప్పుడే తంటా వస్తున్నది. ఒక వంక వైవిధ్యంతో సహజీవనాన్ని నేర్చుకుంటూనే, భారత సమాజాన్ని ఏకరూప మైనదిగా కూడా ఎలా చేయగలుగుతారనే అంశంపై నేను సర్సంఘ్చాలక్తో వాదనకు దిగుతాను. అందరికీ సమానంగా వర్తించే ఉమ్మడి చట్టాలు, ఉమ్మడి విధానాలకు ఆయన ఇచ్చిన పిలుపు మెజారిటీవాద ధోరణి, మనగలిగేది కాదు. ఆయన ‘‘జనాభా నియంత్రణ’’ భావన కాలదోషం పట్టినది. ఆర్ఎస్ ఎస్‌లో చాలా మంది అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడినాగానీ, వారిలో ఒక పెద్ద సెక్షన్ సంజయ్‌గాంధీని ఎందుకు మెచ్చుకునేవారో కూడా అది చెబుతుంది. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు, మురికి వాడల నిర్మూలనకు సంజయ్‌గాంధీ ప్రధానంగా ముస్లింలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన భార్య మనేకా, అతనికి ఇష్టమైన అధికారి జగ్మోహన్ (తుర్క్మెన్ గేటు కూల్చివేతల ద్వారా సుప్రసిద్ధుడు) తదుపరి కాలంలో బీజేపీ స్టార్లు కావడంలో ఆశ్చరపోవాల్సిందేమీ లేదు. జనాభా ‘‘నియంత్రణ’’కు భాగవత్ ఇచ్చిన పిలుపు ఆధారపడినది గణాంక సమాచారం మీద కాదు, భ్రమాత్మకమైన భయం మీద. ఏ మతస్తుల లోనైనా జనాభా నియంత్రణకు విద్య, సౌభాగ్యాలను మించిన మార్గం లేదు. ఆశించినదాని కంటే కూడా భారత జనాభా వృద్ధి రేటు నాటకీయమైన రీతిలో పడిపోతోంది (ఇప్పుడు దాదాపు 1.4%), ముస్లింలలో కూడా వృద్ధిరేటు క్షీణి స్తోంది. ఇదంతా పెరిగే ఆదాయాలతో, మరింత ముఖ్యంగా ఆడపిల్లలు పాఠ శాలలకు పోతుండటంతో స్వచ్ఛందంగానూ, సంతోషంగానూ జరుగుతోంది. వైవిధ్యం నేటి తిరుగులేని నిజం వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా భారతదేశపు వైవిధ్యం లోతుగా వృద్ధి చెందు తోంది, మరింత విస్తృతమైనదిగా, ప్రబలమైనదిగా మారుతోంది. ఫెడర లిజం పెంపొందుతుండటంతో రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలను రాష్ట్ర నాయకులు మునుపెన్నటికన్నా ఎక్కువగా అనుభవిస్తున్నారు. వాటిని విస్తరింపజేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాలు, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలు, తమ సొంత శ్రామిక, భూ చట్టాల ముసాయిదాలను తయారు చేసుకుంటున్నాయి. కేంద్రం అలాంటి చట్టాలను చేయకపోవడంతో అవే ఆ ప్రయత్నం మొదలెట్టాయి. కశ్మీర్ నుంచి ఈశాన్యం వరకు సరిహద్దు రాష్ట్రాలు తమ సొంత జనాభాపరమైన దృక్కో ణాల నుంచి తమకు సరిపడే చట్టాలను, పరిపాలనా నిబంధనలను చేసుకుం టున్నాయి. ఉదాహరణకు, గోవధ కశ్మీర్ సొంత రణ బీర్ శిక్షాస్మృతి ప్రకారమే నేరం. ఇవన్నీ భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయే తప్ప, బలహీనపరచడం లేదు. దీన్ని ఇప్పుడు వెనక్కు మరల్చగలమనే భావన ఏదైనా ఏకీకరణ అనే మరో కొత్త కాల్పనికతే అవుతుంది. ఆ అవసరమే లేదు, కాబట్టి ఈ వైవిధ్యంలోనే ఐక్యత కోసం ప్రయత్నించాలి. చరిత్రలో మునుపెన్నటికంటే నేటి భారతదేశం ఎక్కువ ఐక్యంగా, సమగ్రంగా సమైక్యంగా ఉంది. అయినాగానీ వైవిధ్యం మరింత సుస్పష్టంగా పెంపొందు తోంది. అందువలన ఆధునిక భారతంలో ఆర్ఎస్ఎస్కు సమంజసత్వం కలగాలంటే సర్సంఘ్ చాలక్ దానిలోని రెండు అంశాలను సంస్కరించాల్సి ఉందని నా సూచన. ఒకటి, దాని యూనిఫాం ‘‘గణవేష్’’. రెండవది. వైవిధ్యంలో ఐక్యత అనే దాని నినాదాన్ని వైవిధ్యాన్ని కీర్తించడంగా మార్చడం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
విక్రమన్ దర్శకత్వంలో సూర్య
నటనలో వైవిధ్యం కోసం తపించే నటుల్లో సూర్య ఒకరు. ఆయన కథలపై చూపే శ్రద్ధ దర్శకులను ఎంపిక చేసుకునే విధానంలో పరిణితి స్పష్టం అవుతుంది. చిత్రం చిత్రానికి తాను ఎదుగుతూ, తన చిత్రాల విజయాల స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే హీరోగా సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదుగుతున్నారు. సింగం, సింగం -2 వంటి రాక్ హిట్లు తరువాత అంజాన్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో తెరపైకి రానున్నారు. అంజాన్ ఈ నెల 15న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్‌గా సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నారు. విక్రమన్ ఇంతకు ముందు యావరుంనలం చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఇటీవలే తెలుగులో అక్కినేని కుటుంబంతో మనం అనే చిత్రంతో అద్భుతమయిన విజయాన్ని అందుకున్నారు. ఈ బహుభాషా దర్శకుడు సూర్య కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి విక్రమన్ మాట్లాడుతూ సూర్య కోసం కథ తయారు చేస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఈ చిత్రం ఆయన నటిస్తున్న మాస్ చిత్రం తరువాత సెట్‌పైకి రానుందని తెలిపారు. ఈ కథ ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంటూ అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుందన్నారు. చిత్రంలో ఇద్దరు కథా నాయికలు ఉంటారని, అయితే వాళ్ల ఎంపిక జరగలేదని వివరించారు. -
ఎవరూ నడవని బాటలో...
స్ఫూర్తి ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా... ఆడపిల్లలు అనగానే కొన్ని రకాల ఉద్యోగాలు చేస్తేనే బాగుంటుందని తేల్చేస్తారంతా. నాగరికత బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి మాటలు వినిపిస్తాయి. సారాకి ఆ మాటలు అస్సలు నచ్చవు. అందుకే ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే వెంటనే ప్రశ్నించేది. ఇవే ఎందుకు చేయాలి? ఇవి ఎందుకు చేయకూడదు? అని నిలదీసేది. ఏదో తెలియక అడుగుతోంది అనుకునేవారు కానీ... నిజంగానే ఎవరూ సాగని బాటలో సాగుతుందని, ఆడపిల్లలు వెళ్లని రంగంలోకి అడుగుపెడుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. అమెరికాకు చెందిన సారా చిన్నతనం నుంచే వైవిధ్యంగా ఆలోచించేది. ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తీసిపోరని ఆమె ఉద్దేశం. అందుకు తగ్గట్టే సాహసాలు చేసేది. మహిళలు నడపడానికే భయపడే పెద్ద పెద్ద వాహనాలను నడపాలని సరదా పడేది. వాటిని నడుపుతున్నప్పుడు బండిలో ఏదైనా లోపం తలెత్తితే దాని గురించి స్టడీ చేసేది. ఆ శ్రద్ధ కాస్తా ఆమెను మెకానిజం వైపు లాక్కెళ్లింది. ఎలాగైనా సరే వాహనాలను బాగు చేయడం నేర్చుకోవాలని నిర్ణయించుంది. సారా నిర్ణయం గురించి విన్న కుటుంబ సభ్యులు... ‘ఆడపిల్లవై ఉండి మెకానిక్‌గా పని చేస్తావా?’ అన్నారు. స్నేహితులు పరిహాసమాడారు. కానీ సారాకి మాత్రం అది జోక్ చేయాల్సిన విషయంలా అనిపించలేదు. అందుకే ఓ ఇన్స్టిట్యూట్లో చేరి కార్ల మెకానిజం నేర్చుకుంది. మెకానిక్ షెడ్ కూడా పెట్టింది. ఆమెను చూసి మొదట నవ్వినవాళ్లు... ఆమె బళ్లను బాగుచేసే తీరు చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆమెను చూసి ఫ్రెండ్స కూడా ఆ పని చేయాలని సరదాపడ్డారు. వాళ్లకు కూడా ఆ పని నేర్పింది సారా. వారితో కలిసి ‘180 డిగ్రీ ఆటోమోటివ్’ అనే సంస్థను స్థాపించింది. కాలం గిర్రున తిరిగింది. సారా పేరు అమెరికా అంతటా పాకిపోయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ అంటూ దేశమంతా ఆమెను పొగిడింది! -
పెట్టుబడికి పండంటి సూత్రాలు..
చిన్న మొక్క రేప్పొద్దున మహా వృక్షంగా ఎదిగి తియ్యని ఫలాలు ఇవ్వాలన్నా.. చల్లని నీడనివ్వాలన్నా.. ముందుగా నేడు విత్తు నాటడం ముఖ్యం. అది ఎంత ఆలస్యం చేస్తే.. ఫలాలు అందుకోవడానికి అంతే ప్రయాసపడాల్సి వస్తుంది. ఇదే సూత్రం పెట్టుబడులకూ వర్తిస్తుంది.భవిష్యత్‌లో ఆర్థిక కష్టాలు లేకుండా నిశ్చింతగా ఉండాలంటే ఎంతో కష్టించి సంపాదించిన డబ్బును.. ఇన్వెస్ట్ చేసేందుకుకొన్ని సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో కొన్నింటిని గురించి వివరించేదే ఈ వారం ధనం కథనం.. యుక్తవయసులోనే తొలి అడుగు సంపాదన మొదలుపెట్టిన తొలినాళ్ల నుంచే ఇన్వెస్టింగ్ మొదలుపెట్టడం కూడా మంచిది. వచ్చే ఆదాయంలో గోరంతే దాచగలిగినా సరే.. క్రమం తప్పకుండా కొనసాగించాలి. కాంపౌండింగ్ ప్రభావంతో అది కొండంత అవుతుంది. అలాగే, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇది అలవరుస్తుంది. చేసిన పెట్టుబడులపై వచ్చిన రాబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లండి. మన గురించి తెలుసుకోవాలి .. ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా అసలు మీరు ఏ తరహా ఇన్వెస్టరో మిమ్మల్ని గురించి మీరు ప్రశ్నించుకుని, తెలుసుకోవాలి. ఇన్వెస్టింగ్ అనేది ఒక కళలాంటిదే. దీనికోసం మీరు ఎంత సమయం కేటాయించగలరు, ఎంత మేర పరిశోధించగలరు అన్న విషయాలపై అంచనా వేసుకోవాలి. లక్ష్యాలు మనకంటూ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో, పిల్లల చదువు, పెళ్లిళ్ల ఖర్చులు, రిటైర్మెంట్ అవసరాలు.. ఇలాంటివెన్నో ఉంటాయి. వీటిలో కొన్ని స్వల్పకాలికమైన, మధ్యకాలికమైన, దీర్ఘకాలికమైన అవసరాలు ఉంటాయి. ఇలా వేటి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకున్నారో నిర్ణయించుకోవాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. నెలవారీ కావొచ్చు..మూణ్నెల్లకోసారి, ఆర్నెల్లకోసారి కావొచ్చు ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేయగలరన్నది లెక్క వేసుకోవాలి. ఎలాంటి రాబడులను ఆశిస్తున్నారో చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసే సాధనంపై అధ్యయనం ఏయే సాధనాల్లో, ఏయే ప్లాన్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారో వాటిని గురించి సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించండి. ఒకే సాధనం గురించి వేర్వేరు సంస్థలు కల్పించే ప్రయోజనాలు, రాబడులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. సాధనం గురించి, వాటిని అందించే వారి గురించి అవగాహన ఉండాలి. వైవిధ్యం.. ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనమూ ఏదో ఒక సమయంలో హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. కాబట్టి, ఎప్పుడూ కూడా ఒక దాంట్లో మాత్రమే మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయకూడదు. రెండు మూడు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కులను కొంత తగ్గించుకోవడానికి వీలుంటుంది. గత వైభవం కాదు.. ఇన్వెస్ట్మెంట్ సాధనం ఏదైనా సరే.. కేవలం గతకాలపు పనితీరుని బట్టే ఎంచుకోకూడదు. మన మిత్రులో లేక సన్నిహితులకో దాని ద్వారా బోలెడంత లాభాలొచ్చాయన్న కారణంతో ఆ సాధనం వైపు మొగ్గుచూపడం సరికాదు. మన ఫ్రెండ్‌కి లాభాలొచ్చినంత మాత్రాన మనకూ అలాగే లాభాలొచ్చేస్తాయనుకుంటే కష్టం. గతకాలపు పనితీరును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్‌లో అవకాశాలను కొద్దో గొప్పో అంచనా వేసుకోగలిగితే మేలు. టైమింగ్ .. దేనికైనా టైమింగ్ ముఖ్యం. ఏ సాధనంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం.. ఎంత కాలం కొనసాగించగలం, ఎప్పుడు వైదొలగాలనుకుంటున్నాం.. ఇవన్నీ కూడా కీలకమే. కాబట్టి ఈ విషయాల గురించి ముందుగానే కచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. దీర్ఘకాలికం.. మనం పెట్టుబడులను ఎంత కాలం కొనసాగించగలమన్న దానిపైనే రిస్కులు, రాబడులు ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత రాబడి కోసం ఎంత రిస్కు తీసుకోదల్చుకున్నారన్నదీ కీలకమే. ముందుగానే చెప్పినట్లు.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి.. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే రిస్కులను కాస్త యావరేజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఊహించొద్దు.. ఎంత ఆశావహంగా ఉన్నా లాభాల విషయంలో వచ్చే దానికన్నా ఎక్కువగా ఊహించుకుని లెక్క వేసుకోవద్దు. సాధ్యమైనంత వరకూ తక్కువే రావొచ్చని ఆచితూచి అంచనాలు వేసుకుంటే తప్పులు చేసే అవకాశాలు తగ్గుతాయి. సహనం.. సమీక్ష ఒకోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నిస్పృహ ఆవరించి.. సహనం నశించవచ్చు. కానీ, ఇక్కడ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకున్నా మీ కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తుంచుకుని, సాధ్యమైనంత మేర నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయక తప్పదు. అప్పుడప్పుడు మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. గతం గతః తప్పులు చేయడం మానవ సహజం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే.. చేతికి వచ్చిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు.. మీరు తీసుకున్న షేరును ఏదో ఒక రేటుకు అమ్మేసిన తర్వాత.. అది మరింత పెరిగిందనుకోండి. అరెరే మరింత కాలం వేచి ఉండాల్సిందంటూ దాని గురించే ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కన్నా ఇతర అవకాశాలను అన్వేషించి అంది పుచ్చుకోవడం ఉత్తమం. తప్పిదాల నుంచి నేర్చుకుని, ఆ అనుభవంతో ముందుకెళ్లాలి.