భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్‌లో నాగాలాండ్‌లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది.
అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్‌బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి.
స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్‌లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.
ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!
వివిధ తెగల మధ్య శాంతి
ఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు.
ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment