భిన్న మతాలు, కులాలు కలిగి ఉండటమే భారతదేశం యొక్క సౌందర్యం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
భిన్న మతాలు, కులాలు కలిగి ఉండటమే భారతదేశం యొక్క సౌందర్యం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మన ఆలోచనలు, చర్యలు సమైఖ్యతను ముందుకు తీసుకుపోయేవిగా ఉండాలన్నారు. జాతీయ సమైఖ్యత కోసం సర్థార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. భారత్ యొక్క విశిష్ట లక్షణమైన వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో దేశంలో అశాంతి రేపుతున్న దాద్రీ వివాదం, హర్యానాలో దళితుల హత్యల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.