భౌ. భౌ..తప్పిపోయా! పోలీస్టేషన్‌కి వెళ్లిన కుక్క! వీడియో వైరల్‌ | Viral Video: Dog Walking Inside Police Station Finds Its Owner Back | Sakshi
Sakshi News home page

Viral Video: భౌ. భౌ..తప్పిపోయా! పోలీస్టేష్‌న్‌కి వెళ్లిన కుక్క

Published Thu, Nov 17 2022 3:27 PM | Last Updated on Thu, Nov 17 2022 3:29 PM

Viral Video: Dog Walking Inside Police Station Finds Its Owner Back - Sakshi

ఎప్పడైనా ఎవరైనా తాము ఒకవేళ తప్పిపోయినా! పోలీస్టేషన్‌కి వెళ్లి సాయం అర్థించేవారు అరుదు. ఎవర్నోఒకర్నీ సాయం అడిగి వెళ్లేందుకు ట్రై చేస్తాం. ఇక సాధ్యం కావట్లేదు అనుకొన్నప్పుడూ పోలీస్టేషన్‌కి వెళ్తాం. కానీ ఇక్కడొక కుక్క ఏకంగా తాను తప్పిపోయానంటూ పోలీస్టేషన్‌కి వెళ్లి కూర్చొంది.

వివరాల్లోకెళ్తే....ఇంగ్లాండ్‌లో ఒక యజమాని వద్ద బోర్డర్‌కోలీ జాతికి చెందిన రోజీ అనే కుక్క ఉంది. అది ఒక రోజు తన యజమానితో వాకింగ్‌కి వచ్చి అక్కడే ఉన్న మరో కుక్కతో కలిసి వెళ్లి తప్పిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ రోజీ అక్కడే ఉన్న లీసెస్టర్‌షైర్‌ పోలీస్టేషన్‌కి వెళ్తుంది. ఆ స్టేషన్‌కి ఆటోమెటెడ్‌ ఓపెన్‌ అండ్‌ క్లోజ్‌ డోర్స్‌ ఉన్నాయి.

ఆ కుక్క నేరుగా ఆ తలుపలు వద్దకు వెళ్లగానే ఆ ఆటోమేటెడ్‌ తలుపులు తెరుచుకున్నాయి. పాపం ఆ కుక్క లోపలికి వెళ్లంగానే అవి క్లోజ్‌ అయిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక లోపల ఒక మూలన అలా కూర్చొని ఉంటుంది. అక్కడే ఉన్న పోలీసులు గమనించి దాన్ని దగ్గరకు తీసుకుని పరిశీలించారు.

ఇది బహుశా తప్పిపోయి ఉంటుందని భావించారు. వెంటనే పోలీసుల ఆ కుక్క ఫోటోతో సహా అది తప్పిపోయి పోలీస్టేషన్‌కి వచ్చిన సీసీఫుటేజ్‌ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఈ కుక్క ఓనర్‌ ఎవరో వారు పోలీస్టేషన్‌కి వచ్చి కలెక్ట్‌ చేసుకోవల్సిందిగా పేర్కొన్నారు. దీంతో ఆ కుక్క ఓనర్‌ హూటాహుని స్టేషన్‌కి వచ్చి తన పెంపుడు కుక్కను కలెక్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. తప్పిపోయానంటూ పోలీస్టేషన్‌ మెట్లెక్కడంతో ఓనర్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇది ఎంత తెలివైన కుక్క, తిరిగి నా వద్దకు వచ్చేసింది అంటూ తెగ మురిసిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి. 

(చదవండి:  విమానం టేక్‌ అఫ్‌ టైంలో ఫోన్‌ మిస్సింగ్‌.. పైలెట్‌ కిటికిలోంచి వంగి మరీ...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement