Identify
-
పార్శిల్లో మృతదేహం కేసులో పురోగతి
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు. -
ఆపదలో ఉన్నా.. డబ్బులు పంపండి!
‘నాకు యాక్సిడెంట్ అయ్యింది అక్కా..ఆసుపత్రిలో ఉన్నాను..అర్జెంట్‌గా బిల్లు కట్టాలని అంటున్నారు..నేను తర్వాత వివరంగా మాట్లాడతాను. ముందు నేను పంపిన నంబర్‌కు గూగుల్ పే చెయ్యి’అని మలక్‌పేట్‌కు చెందిన ఓ గృహిణికి వాట్సప్ కాల్ వచ్చింది. వాట్సప్ ప్రొఫైల్ ఫొటో తన సోదరుడిదే..మాట కొంచెం తేడాగా ఉన్నా..నంబర్ కూడా తనదే ఉంది. నిజంగానే ఆసుపత్రిలో ఉన్నాడనుకుని రూ.50 వేలు ఫోన్‌పే చేసింది. తర్వాత తెలిసింది అది సైబర్ మోసగాళ్ల పని అని.. ఇది కేస్ 01. కేస్–02 మనోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీస్‌లో ఉన్న సమయంలో వాట్సప్ మెసెంజర్లో ఓ మెసేజ్ వచ్చింది. ‘నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చాను. హడావుడిలో పర్స్ తీసుకురాలేదు. నేను చెప్పిన అకౌంట్‌కి ఆసుపత్రి వాళ్లకు రూ.75 వేలు పంపించు. నేను నీతో కాసేపటి తర్వాత ఫోన్లో వివరంగా మాట్లాడతాను..’అని ఆ మెసేజ్ సారాంశం. ప్రొఫైల్ ఫొటో, వివరాలు తన కొలీగ్ ప్రశాంత్వే..నిజంగానే స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో అని ఆన్లైన్లో డబ్బులు పంపాడు మనోజ్. ‘అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది’ అని సాయంత్రం ప్రశాంత్‌కి ఫోన్ చేస్తేగానీ మనోజ్ కు తెలియదు తాను సైబర్‌మోసానికి గురయ్యానని. ప్రొఫైల్ క్లోనింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, స్నాప్‌చాట్.. ఇలాంటి సోషల్ మీడియా వేదికలలో పలువురు పంచుకునే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, అందులో పేర్కొంటున్న సమాచారం, అభిరుచులు ఇలా అన్ని వివరాలు సేకరించి కొద్దిపాటిగా పేర్లు మార్చి నకిలీ ప్రొఫైల్స్‌ను తయారు చేయడమే ప్రొఫైల్ క్లోనింగ్. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతారు. ఆ తర్వాత మోసానికి తెరతీస్తారు. ఆపదలో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బు అవసరం ఉందని, ఇలా మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో మోసాలకు పాల్పడతారు. ఎలా గుర్తించాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు బాగా తెలిసిన వ్యక్తుల ఫొటో లు, ప్రొఫైల్స్‌తో ఉన్న ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్‌గానీ, మెసేజ్ కానీ వస్తే.. అది సైబర్ నేరగాళ్ల పనే అయిఉండొచ్చని అనుమానించాలి. కంగారుపడిపో యి వెంటనే డబ్బులు పంపవద్దు. అసలు విషయం ఏంటన్నది నేరుగా వాళ్ల ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో వ్యక్తి గత సమాచారం అవసరానికి మించి పంచుకోకపోవడమే మేలు. కుటుంబసభ్యు లు, స్నేహితులతో ఉన్న సన్నిహితమైన ఫొ టోలు, వీడియోలు పంచుకోవద్దు. మనం సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టే సమాచారమే సైబర్ నేరగాళ్లు వినియోగించుకుని మోసాలకు తెరతీస్తున్నారన్నది గుర్తించాలి. ప్రొఫైల్ లాక్ ఉపయోగించకపోతే మోసాలకు అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ సెట్టింగ్‌లు తప్పక పెట్టుకోవాలి. -
మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?
‘గుడ్ మార్నింగ్ సర్. నా పేరు సురేష్. సాక్షి ఫన్ డే లో వస్తున్న ‘సై కాలం’ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. రకరకాల మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అసలు ఒక మనిషికి మానసిక సమస్య ఉందో లేదో గుర్తించడం ఎలా? అనే టాపిక్ కూడా రాస్తే బాగుంటుంది సర్’ అంటూ మొన్నా మధ్య ఒక కాల్ వచ్చింది. ఆ సూచన విలువైందిగా తోచింది. అందుకే ఈ వారం ఆ అంశం గురించే తెలుసుకుందాం! సమస్య, రుగ్మత వేర్వేరు సురేష్లానే చాలామందికి మానసిక సమస్యల గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. ఎవరి ప్రవర్తనైనా కొంచెం తేడాగా కనిపించగానే గుళ్లూ, గోపురాలకు తిప్పేస్తారు. యజ్ఞాలూ,యాగాలూ, శాంతి పూజలూ చేయిస్తారు. లేదా మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే మానసిక సమస్యలు, రుగ్మతల మధ్య తేడా అర్థం చేసుకోవాలి. రోజువారీ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సర్దుబాటులో సమస్యలు, కోపం, విచారం, చదువులో, ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి మానసిక సమస్యలు. ఇవి తాత్కాలికం. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్, ఫోబియా, స్కిజోఫ్రీనియా లాంటివి మానసిక రుగ్మతలు. ఇవి దీర్ఘకాలం ఉంటాయి. సహానుభూతి ఉంటే చాలు.. మానసిక వ్యాధి ఉందా లేదా అని అంచనా వెయ్యడానికి సరిపడా మానసిక నిపుణులు మన దేశంలో అందుబాటులో లేరు. అందువల్ల సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం ఉన్నవారెవరైనా ప్రాథమిక అంచనా వేయవచ్చు. అయితే మానసిక వ్యాధి ఉన్నవారితో మాట్లాడాలంటే చాలామంది జంకుతారు. కారణం.. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అనగానే చాలామందికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడే, శుభ్రత లేని వ్యక్తి గుర్తొస్తాడు. అతనితో మాట్లాడితే తిడతాడేమో, కొడతాడేమో అని భయపడతారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులే. వారితో మాట్లాడినందువల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని గుర్తించండి. ఎలా మాట్లాడాలి? ‘మీకేదో మానసిక సమస్య ఉన్నట్లుంది’ అని మొదలుపెడితే ఎవరైనా నొచ్చుకుంటారు. కాబట్టి వారితో మాట కలిపేందుకు.. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకుని, అతని బాధను, సామాజిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి. దీన్నే సహానుభూతి అంటారు. వీలైనంత వరకు ఆ వ్యక్తి బంధువులెవరూ అక్కడ లేకుండా చూసుకోండి. కొంతమంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరించండి. శారీరక జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎంత సహానుభూతితో మాట్లాడతామో, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తితో కూడా అంతే సహానుభూతితో వ్యవహరించాలి. ఏం చెయ్యాలి? మానసిక సమస్య లక్షణాలు కనిపించగానే మానసిక వ్యాధి ఉందని నిర్ధారణకు రాకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడి లక్షణాలు ఎన్నాళ్ల నుంచి ఉన్నాయి, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. అతని సామాజిక, ఆర్థిక, సంబంధ బాంధవ్యాల వివరాలు, సమస్యల గురించి ఆరా తీయాలి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎందుకు మానసిక సమస్యతో బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అతనితో మరింత లోతుగా మాట్లాడి, సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. అవసరమైన సహాయం అందిస్తారు. అడగాల్సిన ప్రశ్నలు.. రాత్రిపూట నిద్ర పట్టడంలో ఏదైనా సమస్య ఉందా? · రోజువారీ పనులు చేయడంలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా? కొద్దికాలంగా విచారంగా, జీవితంలో సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా? · దేని గురించైనా భయభ్రాంతులకు లోనవుతున్నారా? మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నారని బాధపడుతున్నారా? · మద్యం లేదా మాదక ద్రవ్యాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? వీటిలో ఏ ప్రశ్నకైనా ‘అవును’ అని సమాధానం చెప్తే, మరింత సమయం వెచ్చించి మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రుగ్మతను గుర్తించే లక్షణాలు.. ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని బాధల్ని చెప్పడం · మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉండటం డిప్రెషన్ లేదా మద్యపాన సంబంధమైన మానసిక సమస్య ఉందని నేరుగా చెప్పడం మద్యపాన వ్యసనం లేదా గృహహింస లాంటి ప్రత్యేక కారణాలు వైవాహిక, లైంగిక సమస్యలు · దీర్ఘకాల నిరుద్యోగం, సన్నిహిత వ్యక్తి మరణం, జీవితం సమస్యలమయం కావడం అతీంద్రీయ శక్తులు ఉన్నాయని అనుమానించడం. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చి న హైకోర్టు, ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా.. అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వచ్చి న జలగం వెంకట్రావు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చి న విషయాన్ని ఆయన వివరించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎన్నికల షెడ్యూలుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున ప్రజలకు మరింత మేలు చేస్తానని వెంకట్రావు పేర్కొన్నారు. -
వీడియో కాల్లో ఫ్రెండ్‌ను గుర్తుపట్టిన శునకం.. వీటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..
శనకాలు వాటి యజమానులను గుర్తిస్తాయని అందిరికీ తెలుసు. తమ స్నేహితులను కూడా సులభంగా గుర్తుపెట్టుకుంటాయి. అయితే వీడియో కాల్లో శునకాలు ఇతరులను గుర్తించలవా? అంటే సమాధానం చెప్పలేదు. కానీ ఓ కుక్క మాత్రం తన ఫ్రెండ్‌ను వీడియో కాల్లో చూసిన వెంటనే టక్కున గుర్తుపట్టింది. దానితో ఆప్యాయంగా మాట్లాడింది. ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగిన సంభాషణ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ నెటిజన్లను కట్టిపడేసింది. View this post on Instagram A post shared by Rollo and Sadie (@rolloandsadie) శునకం మరో శుకనంతో వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. వీటి మధ్య ప్రేమను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్‌ను నిజంగా మిస్ అయితే ఇలానే ఉంటుందేమో? ప్రేమానురాగాల విషయంలో జంతువులకు మనషులకు తేడా లేదని ఈ శునకాలు నిరూపించాయి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మనకు ఇష్టమైన స్నేహితులు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగొచ్చేంతవరకు డోర్ దగ్గరే ఎదురుచూస్తుంటాం. ఇలాంటి ప్రేమ పొందడం నిజంగా అదృష్టం. మనుషులైనా, శునకాలైనా స్నేహం, ప్రేమ విషయంలో ఒక్కటే.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: జైలులో నన్ను టార్చర్ చేశారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి: నవనీత్ రానా -
Original Gold vs Fake Gold: తెలుసుకోవడం ఎలా?
-
అజ్ఞాత వాసం.. టీడీపీ, జనసేన నేతల గుండెల్లో గుబులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఈ నెల 24న విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోపక్క పోలీసులు ఆధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, కాల్ డేటాలతో ఆందోళనకారులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. 46 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 23 మందిని అదుపులోకి తీసుకుని, కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దాదాపు 150 మందిని అనుమానితులుగా గుర్తించడంతో ఆందోళనకారుల్లో వణుకు పుడుతోంది. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు పోలీసుల కంట పడకుండా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొందరు సొంత ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. మరికొందరు ఫోన్ కాల్స్ వస్తున్నా లిఫ్ట్ చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలిసింది. విధ్వంస కాండకు పాల్పడిన వారిలో అధిక శాతం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలే ఉన్నారు. కేసులు నమోదైన ముగ్గురు బీజేపీ నాయకులు, ఇద్దరు టీడీపీ, ఆరుగురు జనసేన కార్యకర్తలు అజ్జాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆందోళనకారుల ఫోన్ నంబర్ల కాల్ డేటా, ఫోన్లు ఏ టవర్ పరిధిలో ఉన్నాయో పోలీసులు ఆధునిక టెక్నాలజీతో పసిగడుతున్నారు. ఆ రెండు పార్టీ నేతల్లో గుబులు విధ్వంసకర ఘటనల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసు విచారణలో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని పలువురు గుబులు చెందుతున్నారు. తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఆ పార్టీల నేతలు సొంత ఫోన్లకు బదులు కొత్త ఫోన్లు, నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా నిఘా నీడలోనే.. విధ్వసంకర ఘటనలతో అట్టుడికిన అమలాపురం పూర్తిగా కుదుటపడింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా మాత్రం కొనసాగుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులు ముఖ్య కూడళ్ల వద్ద పహారా కాస్తున్నారు. రోడ్లపై వాహనాల విస్తృత తనిఖీలకు పోలీసులు శనివారం నుంచి తెర వేశారు. ఆందోళనకారులను దీటుగా కట్టడి చేసేందుకు తగిన బందోబస్తుతో పోలీసు శాఖ సంసిద్ధమై ఉంది. -
వింత పదార్థం.. దీని గురించి తెలిస్తే మాకు చెప్పండి..
సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్తవి, వింతవి ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతాం. ఒకవేళ అవి భయంకరంగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి. అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది. కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్బుక్లో షేర్ చేసిన దీనికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు. ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పంచుకోవడంతో దీన్నిచూసిన వారంతా ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారుతున్నాయి. దీనిని గుర్తించడంలో అధికారులు ప్రజల సలహా కోరుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవి అనుకొని స్థానికులందరూ భయపడుతున్నారు. కాగా ఇది చేపలాగా ఉంటే స్క్విడ్ గుడ్డు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అనేక ఆకారాలను కలిగి ఉంది. చిన్న చిన్న తెలుపు రంగు బాల్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘బీచ్ మిస్టరీ - ఈ రహస్యమైన జంతువేంటో ఏమిటో మీకు తెలుసా? ఇది కొన్ని నెలల క్రితం బీచ్‌లో కనుగొన్నాం.. ఇప్పటివరకు దీనిని గుర్తించలేకపోయాం. అయితే ఇది స్క్విడ్‌కు చెందిన గుడ్డుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా గుర్తించడంలో మాకు సాయం చేయగలరా అని పేర్కొన్నారు.’ కాగా ఈ పోస్టుపై స్పందించిన చాలామంది అవి స్క్విడ్ గుడ్లు అని చెప్పి, వాటిని తిరిగి సముద్రంలో వదిలి పెట్టమని అధికారులను కోరారు. -
ఎవరీ చిట్టి తల్లి ?
కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలు జిల్లాలో లభించిన చిన్నారిని గుర్తించి తీసుకెళ్లాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాదిన్నర సహస్ర అనే చిన్నారి ప్రస్తుతం పెద్దపాడు సమీపంలోని శిశుగృహలో ఉందని, తల్లిదండ్రులు లేదా బంధువులు 30 రోజుల్లోపు గుర్తించి తగిన ఆధారాలు చూపి తీసుకెళ్లాలన్నారు. లేనిపక్షంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆనాథగా ధ్రువీకరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత ఇస్తామన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. చదవండి: దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక! మగువా.. బతుకు భద్రత తగదా? -
అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ అడిగిన ప్రశ్నకు అమిత్ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. -
చెరువులకు పూర్వ వైభవం తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో మురికి కూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీలుగా కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లోకి వ్యర్థాలను వదిలే మార్గాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని హైదరాబాద్ సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సైతం హెచ్చరికలు జారీ చేయాలంది. అవసరమైతే కఠిన చర్యలకు సైతం వెనుకాడొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. లోటస్ పాండ్, ఖాజాగూడ పెద్ద చెరువు, నాచారం పెద్ద చెరువు, మీర్ ఆలం చెరువు, కూకట్పల్లి రంగథాముని చెరువుల నుంచే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణ, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అం శంపై సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగాఇప్పటికే పలుమార్లు విచారించింది. ఏమైనా చేయండి.. చెరువుల్లోకి మురికి నీటిని వదలకూడదని ప్రజలకు తెలియజేయాలని, పరిస్థితిని బట్టి హెచ్చరికలు కూడా చేయాలని ధర్మాసనం పేర్కొంది. చెరువుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలు చేరడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే చెరువులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని, ఇందుకు ఏం కావాలంటే అది చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. చెరువుల్లోకి వ్యర్థాలను తీసుకొచ్చే మార్గాలను ధ్వంసం చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాదిని ప్రశ్నించింది. 4 వారాలు పడుతుందని జీహెచ్ఎంసీ న్యాయవాది చెప్పగా, అంత గడువు ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పగా, ఈ సమాధానం తమకు అవసరం లేదంది. ఏది అడిగినా కూడా ఎన్నికలని చెప్పడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి... మొత్తం వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలని, వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయి. వీటి ధ్వం సానికి ఎన్నిరోజుల సమయం పడుతుంది తదితర వివరాలను అందులో పొందుపరచాలని సీవరేజీ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితరులను ఆదేశించింది. ఈ సమయంలో హెచ్ ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు జోక్యం చేసుకుంటూ, తాము చర్యలు తీసుకుంటే, వా టిపై కొందరు హైకోర్టును ఆశ్రయించి, సింగిల్ జడ్జి వద్ద స్టే పొందుతున్నారని ధర్మాసనం దృష్టి కి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఏవైనా వస్తే వాటిని తమ దృష్టికి తీసుకురావాలంది. ఇదే ధర్మాసనం చెరువుల శుద్ధీకరణకు జియో ట్యూబ్ టెక్నాలజీ అత్యుత్తమమైనదని, ఇందుకు చాలా తక్కువ వ్య యం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పై ఓ నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఆయుష్మాన్’ లబ్ధిదారులను గుర్తించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య అభియాన్(ఏబీ–పీఎం–జేఏవై) కింద లబ్ధిదారులను గుర్తించాలని ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించే జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ ఉత్తర్వులిచ్చింది. సామాజిక, ఆర్థిక, కుల గణన–2011లో లేని వారి పేర్లను ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం సెప్టెంబర్ 23న మొదలైంది. -
ఏపీలో 196 కరువు మండలాలు
-
ఏపీలో శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టును ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థలం గుర్తింపు జరిగిన తరువాత దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలని, తద్వారా ముఖ్యమంత్రితో సంప్రదించి స్థల ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని తెలిపింది. హైకోర్టు విభజన పై ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 1న తీర్పు వెలువరించింది. ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి పరస్పర సంప్రదింపులతో హైకోర్టు భవనం, పరిపాలన భవనం, న్యాయమూర్తుల, అధికారుల గృహ సముదాయాలు, హైకోర్టు సిబ్బంది క్వార్టర్లు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. మొత్తం ప్రక్రియ ఈ తీర్పు కాపీ అందుకున్న ఆరు నెలల్లోపు పూర్తి చేయాలి.నిధుల కేటాయింపుపై, కేటాయింపు జరిగిన తరువాత హైకోర్టు ఏర్పాటు కోసం వాటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. శాశ్వత హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు 1956 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 51 (3) ప్రకారం ఏపీలో తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేసే విషయంపై సీఎంతో చర్చించి, దీనిపై ప్రధాన న్యాయమూర్తి రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.