పోలీసుల అదుపులో నిందితుడు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో పార్శిల్లో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత గురువారం తులసికి చెక్క పెట్టెలో ఓ పార్శిల్ వచి్చంది. విద్యుత్ సామాన్లనుకుని దానిని తెరచి చూడగా దానిలో గుర్తు తెలియని మృతదేహం ఉంది. రూ.1.30 కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఆ పెట్టెకు ఓ లెటర్ కూడా అంటించి ఉంది.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది(సోదరి భర్త) శ్రీధరవర్మ అలియాస్ సిద్ధార్థవర్మ ఫొటోను, నేరం జరిగాక అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు ఫొటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. ఎవరైనా నిందితుడిని గానీ, కారునుగానీ గుర్తిస్తే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో పోలీసులు కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో ఉన్న నిందితుడు శ్రీధరవర్మను, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే పార్శిల్లో వచ్చిన మృతదేహం పశి్చమగోదావరి జిల్లా కాళ్ల మండలం గాం«దీనగర్‌కు చెందిన బర్రే పర్లయ్యదిగా గుర్తించారు. పర్లయ్య చనిపోవడానికి రెండు రోజుల ముందు శ్రీధరవర్మ దగ్గరకు పనికోసం వెళ్లినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment