చిన్నారి సహస్ర
కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలు జిల్లాలో లభించిన చిన్నారిని గుర్తించి తీసుకెళ్లాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాదిన్నర సహస్ర అనే చిన్నారి ప్రస్తుతం పెద్దపాడు సమీపంలోని శిశుగృహలో ఉందని, తల్లిదండ్రులు లేదా బంధువులు 30 రోజుల్లోపు గుర్తించి తగిన ఆధారాలు చూపి తీసుకెళ్లాలన్నారు. లేనిపక్షంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఆనాథగా ధ్రువీకరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత ఇస్తామన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక!
మగువా.. బతుకు భద్రత తగదా?
Comments
Please login to add a commentAdd a comment