న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య అభియాన్(ఏబీ–పీఎం–జేఏవై) కింద లబ్ధిదారులను గుర్తించాలని ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించే జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ ఉత్తర్వులిచ్చింది. సామాజిక, ఆర్థిక, కుల గణన–2011లో లేని వారి పేర్లను ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం సెప్టెంబర్ 23న మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment