Beneficiaries List
-
నిధులివ్వడానికి లబ్ధిదారులుండాలిగా!
సాక్షి, హైదరాబాద్: ‘‘పేదల కోసం గృహాలు నిర్మిస్తుంటే ఆ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉండాలిగా. అవే లేవు. అలాంటప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’పథకం కింద నిధులెలా ఇచ్చేది’’ ♦ఇది కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రశ్న. ‘‘మేం రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న విధివిధానాలు వేరు. కావాలంటే లబ్ధిదారుల వివరాలు త్వరలో అందిస్తామని అండర్‌టేకింగ్ ఇస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీరు పరిశీలించొచ్చు. ఆ పథకం తదుపరి కిస్తీని విడుదల చేయండి’’ ♦ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి ఇచ్చిన హామీ ‘‘లబ్ధిదారుల జాబితా చూడనంతవరకు నిధుల విడుదల కుదరదు’ ♦ఇది తాజాగా కేంద్రప్రభుత్వ యంత్రాంగం స్పష్టీకరణ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతకాలం రుణాలు తీసుకొని ఆ పథకం కింద ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. కేంద్రం పథకం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన (పీఎంఏవై) కింద ఇచ్చే మొత్తాన్ని కూడా వాటికి జతచేసి అక్కడికక్కడికి సరిపోయేలా ప్లాన్ చేసుకుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న తీరు కేంద్రం ఇచ్చే నిధులు రాకుండా అడ్డుగోడలా మారింది. చకచకా పనులు కాని చ్చేసి కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన రూ. 900 కోట్ల బకాయిలను కేంద్రం నుంచి అందే నిధులతో తీర్చేద్దామనుకున్న తరు ణంలో నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పీఎంఏవై కింద ఇచ్చే నిధులు విడుదల చేయలేమని కేంద్రం తేల్చేసింది. మరోవైపు బకాయిలు ఇస్తేనే పనులు చేస్తా మని కాంట్రాక్టర్లు పనులాపేశారు. హడ్కో నుంచి అప్పు తెద్దామంటే గరిష్ట మొత్తం ఇప్పటికే మంజూరై ఖర్చయిపోయింది. దీంతో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల జాబితా లేక.. గతంలో ఇందిరమ్మ పథకం కింద లక్షల్లో ఇళ్లను నిర్మించి పేదలకందించారు. పనులు మొదలయ్యేలోపే అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. తర్వాత పనులు అయ్యే కొద్ది వారికి నిధులు విడుదల చేస్తుండేవారు. కేంద్రం తన వంతు వాటాగా నిధులిచ్చేది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో అర్హులకు సంబంధించి ఓ అంచనా మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తోంది. వాటిని అందించే వేళ లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఇళ్లను కేటాయిస్తోంది. 2.91 లక్షల ఇళ్లకు గాను 1.08 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో ఇప్పటివరకు 14,000 మందికే ఇళ్లను అందజేశారు. సిద్ధంగా ఉన్న మిగతా ఇళ్లకు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ కేంద్ర విధానం ప్రకారం ముందు లబ్ధిదారుల సంఖ్యను తేల్చి ఆ ప్రకారం ఇళ్లు నిర్మించాలి. దీంతో లబ్ధిదారుల జాబితానే సిద్ధంగా లేనప్పుడు ఏ సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. సమాధానం లేకపోవటంతో నిధులు ఇచ్చేందుకు ససేమిరా అనేసింది. కనీసం 25 వేల మంది జాబితానిస్తే పరిశీలిస్తామన్న కేంద్రం కేంద్రం తాను మంజూరు చేసే పీఎంఏవై ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున కేటాయిస్తుంది. ఇందులో కొంతమొత్తాన్ని ముందుగానే విడుదల చేస్తూ రెండో కిస్తీగా 40 శాతం మొత్తాన్ని ఇస్తుంది. మిగతా మొ త్తాన్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ తర్వాత విడుదల చేస్తుంది. తొలుత రూ.వేయి కోట్లకు పైగా కేంద్రం నుంచి రాగా, రెండో కిస్తీగా ఇప్పు డు రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఇది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి సమర్పించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డబుల్ బె డ్రూమ్ ఇళ్లలో ముందుగా లబ్ధిదారుల జాబి తాను రూపొందించకపోవటంతో కేంద్రానికి సమర్పించలేదు. అందుకే నిధులు అం దలేదు. దీనిపై 3, 4 నెలలుగా రాష్ట్ర అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. జా బితా ఇవ్వకుండా నిధులు ఇవ్వటం సా«ధ్యం కాదని తేలడంతో మార్చి నాటికి జాబితా సిద్ధం చేసి ఇస్తామని రాష్ట్ర అధికారులు ఓ లేఖను సమర్పించారు. దాని కీ అధికారులు సంతృప్తి చెందలేదు. చివరగా కనీసం 25 వేల మందితో కూడిన జాబితాను సమర్పిస్తే పరిశీలిస్తామనగా అధికారులు ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం. -
ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాలో రూ.2,000
రైతుల ఆర్థిక చేయూత కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకోని వచ్చింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి విడతలో వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 7 విడతల నగదును జమ చేసింది. ఇప్పుడు 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది. ఇక నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో దశల వారీగా రైతుల ఖాతాలో వేయనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎనిమిదవ విడత నగదు మీ ఖాతాలో పడతాయి. అయితే, ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలంటే మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తుంది. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
అమ్మకు పెట్టు‘బడి’
అటకమీద దాచిన అమ్మ పోపు డబ్బాకు కొత్త కళ రానుంది. చిన్నారి దాచుకుంటున్న ముంత గలగలమని సవ్వడి చేయనుంది. బుడ్డోడికి ప్యాంట్ చొక్కా కొనిచ్చే ఆర్థిక భరోసా తల్లులకు కలగనుంది. చెప్పిన దానికంటే ముందుగా.. మరింత మిన్నగా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దింది. పారదర్శకంగా ఎంపికలు నిర్వహించిన తొలి జాబితాను ప్రకటించింది. సంక్రాంతిలో తుది జాబితా రూపొందించి తల్లుల ఖాతాలో అక్షరాలా రూ.15 వేలు జమ చేయనుంది. ఇది పేదరికపు కార్ఖానాలో మగ్గుతున్న పేద బిడ్డలను బడి బాట పట్టించి.. ప్రతి ఇంటా విద్యాదీపాన్ని వెలిగించనుంది. గుంటూరు ఎడ్యుకేషన్: పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లులకు మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ‘జగనన్న అమ్మ ఒడి’ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నెలాఖరుకల్లా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి మొదటి వారంలో తుది జాబితాను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు ముందే మాతృమూర్తుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదు జమ చేయనుంది. “జగనన్న అమ్మఒడి’ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తొలి విడత జాబితాను పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 57 మండలాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతోపాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల తల్లులతో కూడిన తొలి విడతజాబితాను ఎంఈవో కార్యాలయాలకు ఆన్లైన్లో పంపారు. ఈ జాబితాను పాఠశాలలు, కళాశాలల వారీగా పరిశీలించిన ఎంఈవోలు వాటిని ప్రింట్ తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకుగానూ వలంటీర్లకు అందజేశారు. ఒకటో తేదీ వరకూ జాబితాల ప్రదర్శన ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసిన అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలను జనవరి ఒకటో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రదర్శించనున్నారు. తల్లిదండ్రులు వీటిని పరిశీలించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని శనివారం “్ఙసాక్షి’’తో చెప్పారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం శనివారం మూడు రకాలుగా జాబితాలను ఆన్లైన్లో ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. వీటిలో మొదటిది విద్యార్థి తల్లి పేరుతో ఎంపిక జాబితా కాగా, రెండోది అనర్హత, మూడోది వలంటీర్ల ద్వారా మరోసారి సర్వే చేసి ధ్రువీకరించాల్సి ఉందని వెల్లడించారు. జాబితాలో పేర్లు లేకున్నా, తప్పులు ఉన్నా ఆందోళన చెందకుండా ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి సరి చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ పేర్లు నమోదు కాని, వివరాల్లో తప్పులు ఉన్న లబి్ధదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 7,85,259 మందితో జాబితాలు జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ, 1200 ప్రైవేటు పాఠశాలల్లో 6,98,331 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 298 జూనియర్ కళాశాలల్లో 1,05,897 మంది చదువుతుండగా.. వీరిలో 86,928 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. మొత్తం 7,85,259 మందితో తొలి జాబితా రూపొందించారు. మొదటి వారంలో తుది జాబితా అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేయనున్నారు. తొలి జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన తరువాత తల్లి, తండ్రి, సంరక్షుల ఆధార్ సంఖ్యను ఆన్లైన్లో ర్యాండమ్‌గా పరిశీలించి, డబుల్ ఎంట్రీలను తొలిగిస్తారు. ఈ ప్రక్రియ అనంతరం లబి్ధదారుల తుది జాబితాను జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. తుది జాబితాలో పేర్లు ఉన్న తల్లులందరికీ జనవరి 9వ తేదీ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
లబ్ధిదారులే మనకు బలం
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మనం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఒక్కో నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది వరకు లబ్ధి పొందారు. వాళ్ల వివరాలు మీకు ఇస్తున్నా. వీళ్లే మన బలం.. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, గెలుపు మనదే’ అని గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధులకు వివరించినట్లు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి వివరాలతో కూడిన జాబితాను నియోజకవర్గాలవారీగా అభ్యర్థులకు కేసీఆర్ అందజేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రూ.లక్ష రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీలకు అభివృద్ధి పథకాలు, సీఎం రిలీఫ్ ఫండ్, గొర్రెల పథకం, చేప పిల్లల పంపిణీ పథకాల లబ్ధిపొందినవారు ప్రతి నియోజకవర్గంలో 60 మంది వరకు ఉన్నారని. వీళ్లంతా ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని, ప్రతి లబ్ధిదారుడి కుటుంబంలో కనీసం ముగ్గురు చొప్పున ఓటర్లను వేసుకున్న 1.80 ఓట్లు వస్తాయని, మన గెలుపునకు ఈ ఓట్లు చాలని, అభ్యర్థులు అవసరమైతే వ్యక్తిగతంగా కానీ, దిగువ శ్రేణి నాయకత్వం ద్వారా వాళ్ల ఇళ్లకు వెళ్లి కలవాలని కేసీఆర్ గెలుపు మంత్రం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే అసమ్మతి ఉందని, మిగతా వాళ్లంతా దారికి వచ్చారని పార్టీ నిర్ణయం మేరకు పని చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారని కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ అభ్యర్థులకు సూచించినట్లు తెలిసింది. త్వరలోనే వరంగల్‌లో భారీ బహిరంగ సభకు వస్తానని, ఈ నెల చివరి వారంలోగా బహిరంగ సభ తేదీని ఖరారు చేయాలని తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆదేశించినట్లు సమాచారం. పూర్తి స్థాయి మేనిఫెస్టోలో మరెన్నో ప్రజాకర్షక హామీలు ఉంటాయని, ఈ లోపు ప్రజలు ఆదరించేలా మినీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం సాగాలని సూచించారు. ప్రజల్లో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించినట్లు తెలిసింది. కోడ్ అమలులో ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని ఆదేశించినట్లు సమాచారం. కాగా ఎన్నికల నిర్వహణలో జిల్లా నుంచి కడియం శ్రీహరికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. సోమవారం ప్రకటిస్తాం : కడియం శ్రీహరి త్వరలోనే వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, బహిరంగ సభల తేదీలను సోమవారం ప్రకటిస్తామని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మహాకూటమిని తాము పోటీగా భావించడం లేదని కడియం వ్యాఖ్యానించారు. 24 లేదా 25న తొర్రూరులో భారీ బహిరంగ సభ ఇదిలా ఉండగా ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో తొర్రూరు పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు స్థానిక తాజామాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణ శివారులో సభా స్థలాన్ని ఆయ న పరిశీలించారు. కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. -
‘ఆయుష్మాన్’ లబ్ధిదారులను గుర్తించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య అభియాన్(ఏబీ–పీఎం–జేఏవై) కింద లబ్ధిదారులను గుర్తించాలని ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించే జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ ఉత్తర్వులిచ్చింది. సామాజిక, ఆర్థిక, కుల గణన–2011లో లేని వారి పేర్లను ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం సెప్టెంబర్ 23న మొదలైంది. -
రైతుబీమా బాండ్లు రెడీ
కరీంనగర్‌రూరల్: రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబీమా పధకం లబ్ధిదారుల పాలసీపత్రాలు వ్యవసాయశాఖకు చేరాయి. సోమవారం నుంచి ఈనెల 13వరకు అర్హులైన రైతులకు గ్రామాల వారీగా బీమా పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ఆర్ధిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేసి రైతుబీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతులు ఏ కారణంతో మృతి చెందినప్పటికీ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయాన్ని అందించనుంది. దీనికోసం రైతులు ఎలాంటి బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రభుత్వమే ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనుంది. రైతుబీమా పథకంలో అర్హులైన రైతులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ ఆద్వర్యంలో జూన్ 8నుంచి గ్రామాల వారీగా అధికారులు నామీనీపత్రాలు, రైతుల ఆధార్‌కార్డులు సేకరించారు. ప్రభుత్వం గత నెల 25వరకు రైతుబీమా పధకంలో రైతుల పేర్లు నమోదుకోసం చివరి గడువుగా నిర్ణయించింది. మొదటి విడతలో60,380 బీమాబాండ్లు జిల్లాలో మొత్తం రైతులు 130643ఉండగా రైతుబీమాలో 114823మంది రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులను స్వీకరించి ఎల్ఐసీకి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మొదటి విడతగా 60,380 మంది రైతులకు బీమాబాండ్లను ఎల్ఐసీ వ్యవసాయశాఖకు పంపించగా.. ఇంకా 70,263బాండ్లు రావాల్సి ఉంది. ఈనెల 6నుంచి 13వరకు అన్ని గ్రామాల్లో బీమాబాండ్లను రైతులకు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 16 మండలాలనుంచి మొత్తం 114823 దరఖాస్తులను పరిశీలించగా 60380 బీమాబాండ్లు వ్యవసాయశాఖకు ఎల్ఐసీ పంపించింది. -
రుణమాఫీ మమ
- మూడో జాబితా విడుదల - ఫిర్యాదులు 29,600..వచ్చింది కొందరికే.. - మొదటి, రెండో విడత అర్హుల జాబితాలో నేటికి జమకాని మాఫీ సొమ్ము - బాబును నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీ మూడో విడత లబ్ధిదారుల జాబితాను రాష్ట్రప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే మొదటి, రెండవ విడత లబ్ధిదారుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమకాలేదు. మూడో విడతలో జిల్లా నుంచి 29,600 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కొన్ని దరఖాస్తులను ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెట్టినట్లు సమాచారం. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మూడో విడత జాబితాలో సగంమందే అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వీరికి రూ.58.12 కోట్ల వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పలురకాల ఆంక్షలు, వడపోతల అనంతరం తయారుచేసిన జాబితాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో 20 శాతం రుణమాఫీ మెత్తం జమకాలేదు. కొద్దిమంది ఖాతాల్లో 20 శాతం మాఫీ సొమ్మ జమ అయినా వడ్డీకి కూడా సరిపోకపోవడంతో అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి పెంచారు. అప్పులు చెల్లించలేక, ఖరీఫ్ సాగుకు రుణాలు పొందలేక రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. జాబితాల్లో తప్పులను సరిచేయాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులు జాబితా విడుదల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు పంట, బంగారు రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో అదనపు వడ్డీ భారం పడింది. మరోపక్క గడువు మీరి పోవడంతో తనఖా బంగారాన్ని బ్యాంకులు వేళం వేస్తున్నా విడిపించుకోలేని నిసహాయ స్థితిలో రైతులు బోరున విలపిస్తున్నారు. ఇన్సెంటివ్ను కోల్పోయారు సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో 3 శాతం ఇన్సెంటివ్‌గా కేంద్రప్రభుత్వం ఇస్తుంది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో పంటబీమా సొమ్మును చెల్లించలేదు. ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయకపోవడం, రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారా రు. జాబితాల ప్రకటనలో గందరగోళం, సవరణలకు సవాలక్ష ఆంక్షలు, ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము రైతులు ఖాతాల్లో జమకాకపోవడం, సవరణలు పెట్టుకున్న రైతుల జాబితాలో అర్హులను ప్రకటించకపోవడం వంటి విషయాలు రైతులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. అంతా సాగతీతే.. జిల్లాలో 5,04,611 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. అయితే ప్రభుత్వం తొలివిడత ప్రకటించిన జాబితాలో 2,22,065 మంది రైతులకు చెందిన రూ. 921 కోట్ల రుణాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి 20 శాతం నిధులు రూ. 206.22 కోట్లు విడుదల చేసింది. రెండో జాబితాలో 1,03,729 మంది రైతులకు రూ.375.65 కోట్లు మాఫీగా ప్రకటించింది. రూ.50వేలు ఉన్న రుణాలను పూర్తిగా రద్దుచేస్తూ రూ. 13.65 కోట్లు, 20 శాతం నిధులు రూ.167.65 కోట్లు మాఫీ నిధులను విడుదల చేసినట్లు ప్రకటించింది. చాలామంది రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమకాలేదు. మూడోవిడతలో అన్నా న్యాయం జరుగుతుందని ఆశించిన రైతులకు తీరా వెబ్సైట్ చూస్తే నిరాశే మిగిలింది.