ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాలో రూ.2,000 | pm kisan samman nidhi yojana 8th installment date | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాలో రూ.2,000

Published Fri, Mar 19 2021 6:31 PM | Last Updated on Fri, Mar 19 2021 7:29 PM

pm kisan samman nidhi yojana 8th installment date - Sakshi

రైతుల ఆర్థిక చేయూత కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకోని వచ్చింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి విడతలో వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 7 విడతల నగదును జమ చేసింది. 

ఇప్పుడు 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది. ఇక నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో దశల వారీగా రైతుల ఖాతాలో వేయనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎనిమిదవ విడత నగదు మీ ఖాతాలో పడతాయి. అయితే, ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలంటే మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తుంది. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్‏ను సందర్శించాల్సి ఉంటుంది.

చదవండి:

ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్

ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement