
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. అందుకే ఇందులో లబ్ధిదారుడిగా ఉన్న రైతులు కేవైసీ చేసుకున్నప్పటికీ మళ్లీ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలా చేసిన ప్రతి లబ్ధిదారునికి రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు అనగా సంవత్సర కాలానికి రూ.6వేలు అందిస్తుంది.
ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు అధికారులు.ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు. అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ( e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది.
e-KYC నమోదు ఇలా..
ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్‌డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్ అవుతుంది.
చదవండి: African Parrot: మా రుస్తుమా ఎటో వెళ్లిపోయింది.. మీకు కనిపిస్తే చెప్పండి.. రూ.50వేలు ఇస్తాం..
Comments
Please login to add a commentAdd a comment