government schemes
-
ఉద్యోగులకు వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ రెసిడెన్సీ హోటల్లో వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వివి«ద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ఫెడరేషన్‌ను కాపాడుకుంటామని ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రకటించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదన్నారు.పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలుకు పెంచుతామన్న హామీని తుంగలోకి తొక్కి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గత సర్కారు ఇచ్చిన జీవోలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి సారించి సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వీఆర్ఏలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కరువు.. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎంను కోరిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేవారని, నేరుగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చి చాలా వరకు పరిష్కరించామని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కరువైందని, అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తెస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్క సమస్యనుగానీ, హామీనిగానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఉద్యోగులను మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..
మనమంతా కొద్దిరోజుల్లో 2025లోకి ప్రవేశించబోతున్నాం. ఈ ముగియబోతున్న 2024 కొన్ని రంగాల్లో భారత్‌కు దిశానిర్దేశం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త పథకాలను అమలుచేశాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న భారతదేశ కలలను కలలను సాకారం చేసేందుకు దోహదపడనున్నాయి.ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలోని యువతను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. 2024లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో దేశంలోని అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో 2024లో కేంద్ర ప్రబుత్వం ఏయే పథకాలను ప్రారంభించిందో తెలుసుకుందాం.పీఎం విద్యా లక్ష్మీ యోజనప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన కింద ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఫీజులు, ఇతర ఖర్చులకు హామీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందుతారు. నవంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు.ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అదే సమయంలో రూ. 7.5 లక్షల వరకు రుణాలపై, విద్యార్థులు ప్రభుత్వం నుండి 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని పొందుతారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు వడ్డీపై పూర్తి సబ్సిడీ లభిస్తుంది. ఇదేకాకుండా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు.బీమా సఖీ పథకంఈ పథకం లక్ష్యం ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసీ అందించే బీమా సఖీ పథకం నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలను బీమా ఏజెంట్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మూడేళ్ల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ, గౌరవ వేతనం అందించనున్నారు.పీఎం సోలార్ హోమ్ స్కీమ్ప్రధాని నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీని అందిస్తారు.సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ పథకాన్ని మరింతకాలం పెంచారు. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ అందించనున్నారు. ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. -
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి!
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు. పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.ఈదర గోపీచంద్ వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494 -
ట్రోలింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతగా లబ్ధి చేకూరిందీ, వారి పిల్ల లకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా విధానం ఎంతగా ఉపయోగ పడనున్నదో సంతోషంగా తెలియ పరిచింది. కానీ ఆమె అభిప్రాయంపై కొందరు వ్యక్తులు (ప్రతి పక్షాల కార్యకర్తలు) అనుచిత, అన్పార్ల మెంటరీ పదాలతో కూడిన కామెంట్లు చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ మధ్యకాలంలో ‘సోషల్ ట్రోలింగ్’ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజ కీయాలలో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఒక పార్టీనీ, ఒక వ్యక్తినీ, ఒక నాయకుణ్ణీ, ఒక విధానాన్నీ సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే సామాజిక మాధ్యమాల్లో పలు పార్టీలకు సంబంధించిన వారు అదే పనిగా వారిని విమర్శించడం కనిపిస్తోంది. అయితే ఇందులో మహిళలను కించపరచడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, అనరాని మాటలు అనడం బాధాకరం. రాజకీయ చర్చల్లో సాధారణంగా చిన్న పిల్లల్నీ, మహిళలనూ కించపరచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేవలం రాజకీయ వర్గాలే కాదు సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు మాట్లా డిన ఇంగ్లీష్‌పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి వారు ముందుకు దూసుకువెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటువంటి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్‌పై వ్యంగ్యా స్త్రాలను ఆ యా వర్గాలకు చెందిన వారే కొందరు ట్రోల్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న మహిళలూ, బడిపిల్లలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వారిని క్షోభ పెట్టడం ప్రతిపక్ష కార్యకర్తలకు తగదు. ఇలా చేస్తే వారు అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు... ట్రోల్ చేసేవారిని గుర్తించి, నియంత్రించడానికి ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా తమ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా తగిన నియంత్రణా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటువంటి వారికి జరిమానాలు విధించాలి. భావస్వేచ్ఛ ఉందికదా అని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదుకదా? ఇటువంటి వారి ప్రవర్తన సామాజిక మాధ్య మాల్లో చురుగ్గా ఉండే యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ట్రోలింగ్‌లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం ఇందుకు నిదర్శనం. గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు గురు వారం ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని గుంటూరు ఎస్పీ తుషార్ ప్రకటించారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ట్రోలింగ్‌ను అరికట్టడం సాధ్య మవుతుంది. – డా‘‘ శ్రవణ్ కుమార్ కందగట్ల sravankuc@gmail.com -
టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర
ఈ నైచ్యానికి అంతులేదు. ఈ మానవ మృగాలకు బుద్ధి రానే రాదు. ప్రభుత్వ పథకాలు తమ కుటుంబానికి మేలు చేశాయన్నందుకు.. బీసీ మహిళ గీతాంజలిని వీధి కుక్కల్లా వెంటాడారు. వేధించారు. థర్డ్‌డిగ్రీకి పదింతల ఆన్లైన్ టార్చర్‌కు గురిచేశారు. తట్టుకోలేక ఆమె రైలు కింద పడి తనువు చాలించినా ఈ దరిద్రులకు సిగ్గురాలేదు. రైల్వేస్టేషన్ దగ్గర ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో ఎవరో తీసిన రెండు నిమిషాల వీడియోలో మాటల్ని ఎడిట్ చేసి మరీ.. చనిపోయాక కూడా ఆమెను చిత్రవధ చేయడం మొదలెట్టారు. ‘ఎవరో ఇద్దరు నెట్టేశారంట’ అనే మాటల్ని వీడియోకు కొత్తగా జోడించి దాన్ని ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే పోస్ట్ చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు సిగ్గూ.. లజ్జా.. ఏమైనా ఉన్నాయా? పైపెచ్చు అవే ఎడిటెడ్ మాటల్ని వైరల్ చేస్తూ.. నెట్టేసిన ఇద్దరూ ఎవరు? ఆమెతో ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా మాఫియా పలు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తోందంటే ఏమనుకోవాలి? గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే.. ఆమెపై చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించి తప్పించుకోవాలని చూస్తున్న ఈ రాక్షసుల్ని ఏం చేయాలి? వీళ్లదసలు మనిషి పుట్టుకేనా? వీళ్లకు కుటుంబాలున్నాయా? సాక్షి, అమరావతి/రేపల్లె రూరల్/తెనాలి రూరల్/ సాక్షి నెట్ వర్క్:‘పురాణాల్లో దుశ్శాసనుడు కూడా ఇంతదారుణంగా వ్యవహరించి ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఆయనే ఉంటే మానమృగాలైన టీడీపీ–జనసేన సైకో మూకల తీరు చూసి సిగ్గు పడేవాడు.. ట్రోలింగ్‌తో వెంటపడి, వేటాడి గీతాంజలి మృతికి కారణమైన ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆడబిడ్డ అన్యాయంగా చనిపోయిందనే కనికరం కూడా లేని ఆ పార్టీల అధినేతలు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతుంటే తట్టుకోలేని ఈ మానవ మృగాల టార్గెట్‌తో ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమ కోల్పోయి దిక్కుతోచని వారయ్యారని, ఇందుకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబు, పవన్లేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా సైతం స్పందించింది. మితిమీరిన ట్రోలింగ్‌లకు ముకుతాడు వేయాలని వార్తలు ప్రసారం చేసింది. సర్వత్రా ఆగ్రహం ♦ టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. ఈ ఘటనను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ్, వైఎస్సార్సీపీ నెల్లూరు నాయకురాలు మోయిళ్ల గౌరి, విశాఖపట్నం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ♦ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ శిఖామణి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఐడీసీ ఛైర్పర్సన్ బండి నాగేంధ్ర పుణ్యశీల, మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఇది టీడీపీ, జనసేన సైకోల హత్య ‘గీతాంజలిది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు చిన ఆడబిడ్డలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడమే పాపమైపోయిందా? సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించుకుంటామని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా? టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? మీ సోషల్ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా? తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే టీడీపీ, జనసేన సైకోలు సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని.. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్ మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని గీతాంజలి భర్త చెబుతుంటే బాధేస్తోంది. ఐటీడీపీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మహిళను బలితీసుకునే అధికారం ఎక్కడిది? టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాల కోసం మహిళను బలితీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఆ పార్టీల సోషల్ మీడియా రాబంధుల వికృత చేష్టలతో ఒక మహిళ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ–జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మనుషులా? మృగాలా? తన కూతురికి అమ్మ ఒడి వచ్చిందని, అత్తకు చేయూత, తన మామకు పింఛన్‌తో కలిపి మొత్తం ఇంటిలో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడంతో పచ్చ మందకు కళ్లు కుట్టాయి. ఇలాంటి ఘటనలతో పైశాచిక ఆనందాన్ని పొందేందుకేనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు రూ.కోట్లు వెచ్చించి సోషల్ మీడియాను నడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. మహిళల సంక్షేమానికి ఏం చేశారు. ఆయన హయాంలోనే బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ వేదికల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా ట్రోలింగ్‌తో నీచపు రాజకీయం చేశారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ కక్షగట్టి ట్రోలింగ్ గీతాంజలి మృతికి కారణమైన బాధ్యులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని గీతాంజలి గట్టిగా చెప్పడం టీడీపీ, జనసేనకు నచ్చలేదు. అందుకే పనిగట్టుకుని, కక్షతో ట్రోలింగ్‌కు గురిచేశారు. మానసిక చిత్రహింస తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఒక సామాన్య మహిళపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టేవారిని సభ్యసమాజంలోని ప్రతి వ్యక్తి ఖండించాలి. తాము పొందిన లబ్ధి గురించి తెలియజేస్తున్న ప్రజల స్వేచ్ఛను హరించేలా టీడీపీ–జనసేనల సోషల్ మీడియాల్లో వికృతంగా వ్యవహరించడం దారుణం. – మోపిదేవి వెంకట రమణారావు, ఎంపీ మనిషిని బతికించేలా మాట ఉండాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బతికించేలా ఉండాలి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బలైన గొల్తి గీతాంజలి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం ప్రశంసనీయం. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడేవారిని శిక్షించాలి. – జి.శాంతమూర్తి, వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు దోషులను వదిలేది లేదు: ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసు విచారణ వేగవంతం చేశామని, దోషులను వదిలేది లేదని గుంటూరు ఎస్పీ తుషార్‌డూడీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు తెనాలికి చెందిన గీతాంజలి(32) తెనాలి ఐదో నంబర్ ఫ్లాట్‌ఫాం సమీపంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఆమె 11వ తేదీ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించిందన్న సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు 174 సెక్షన్ కింద కేసునమోదు చేశారని చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి తెనాలి వన్‌టౌన్‌కు బదిలీ చేశారని, రైల్వే పోలీసుల విచారణ నివేదిక ఆధారంగా కేసును సెక్షన్ 174 నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306కి మార్పు చేయడం జరిగిందన్నారు. గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిందన్న ఉత్సాహంలో చేసిన వీడియోను పోస్టు చేసినందుకు ఆమెను చనిపోయేలా కించపరిచారన్నారు. ఇప్పటికే ట్రోల్ చేసిన వారి హ్యాండిల్స్‌ను గుర్తించామని, ఇందులో కొంతమంది తమ పేరుతోనే అకౌంట్ నడుపుతుంటే మరికొందరు ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారు. వీరందరిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు. మానవత్వం లేని నాదెండ్ల తెనాలి పట్టణం వహాబ్చౌక్ ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ప్రారంభంలోనే ఉన్న గీతాంజలి ఇంటి ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడి జరిగిన ఘటన గురించి చర్చించుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల తీరు విమర్శలకు దారితీసింది. గీతాంజలి ఇంటికి కూత వేటు దూరంలోనే ఆయన నవ్వుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ‘ఈయనేం లీడర్.. మానవత్వం లేదా?’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసింది ఉద్యోగులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటు లో, పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగానే సాగిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసునని చెప్పా రు. వారి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు. ఉద్యోగుల జీతాల మొత్తం భారీగా పెరిగినప్పటికీ, వేతనాలు పెంచామని, కొత్త ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం రాలేదని, అదనంగా డబ్బు ఖర్చయిందని తెలిపారు. చంద్రబాబు దిగిపోతూ ప్రభుత్వంపై రూ.2.90 లక్షల కోట్లఅప్పులు పడేశారన్నారు. ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా, ఆదాయం రాకుండా చంద్రబాబు రోజూ అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అన్న పెద్ద మనిషి.. ఈరోజు 18 ఏళ్లు దాటిన అ మ్మాయిల దగ్గర నుంచి పథకాలు ప్రకటించారని, 50 ఏళ్లు దాటగానే బీసీలకు పెన్షన్ ఇస్తానంటున్నారని అన్నారు. అర్హత ఉన్న వారిని తీసేసీ పథకాలు ఇవ్వడం చంద్రబాబు దగ్గర ఉన్న ట్రిక్కని చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం జల్లెడపట్టి అర్హత ఉన్న వారిని గుర్తించి మరీ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయకుండా అమ్మ ఒడి ఇచ్చి వదిలేసి ఉంటే నిధులు మిగిలేవన్నారు. కానీ సీఎం జగన్ ఎంత కష్టమైనా స్కూళ్లను అభివృద్ధి చేయాల్సిందేనని గట్టి పట్టుదలతో పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఆస్పత్రులకు కోటాను కోట్లు ఖర్చు చేశారని, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తెచ్చారని తెలిపారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టులు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇది అని వివరించారు. కోవిడ్ రెండేళ్లు తీసేస్తే మిగిలిన తక్కువ కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బ్రాహ్మణులలో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సీఎం జగన్ బ్రాహ్మణులకు రాజకీయంగా, ఇతరత్రా సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. 2014 –19 మధ్య రాష్ట్రంలో అరాచకం నడిచిందని, తిరిగి ఆ పాలన వస్తే ప్రజలు కష్టాల పాలవుతారని అన్నారు. అన్ని వర్గాలకు అర్ధమయ్యేలా చెప్పగలిగినది బ్రాహ్మణ సామాజిక వర్గమే కనుక సీఎం జగన్ ప్రకటించినట్లు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కామేశ్వరరావు (పీకేరావు), ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్, జ్వాలాపురం శ్రీ కాంత్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు అమ్మ ప్రసాద్, ద్రోణంరాజు రవికుమార్, పి. పురుషోత్తమ శర్మ, జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు. -
రేపటి నుంచి 'కులగణన'
అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే రోజు రెండు చరిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ని ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కుల గణనకూ నాంది పలుకుతున్నారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా అడుగులు వేస్తున్నారు. బాబా సాహెబ్ ఆశయాలను నెరవేరుస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్‌గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్‌లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్‌లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. -
మన ప్రభుత్వం ప్రజలకు తోడుగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా... వివిధ పథకాల కింద 68,990 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్ల రూపాయలు జమ ...ఇంకా ఇతర అప్డేట్స్
-
TS: రేషన్‌కార్డులిస్తూనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ‘తెల్ల రేషన్‌కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రేషన్‌కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల చెంతకు పాలన ‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్‌లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్‌కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం. వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్ ఇచ్చి డిజిటలైజ్ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు ‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుబందు సీలింగ్‌పై అసెంబ్లీ చర్చ రైతుబంధుపై సీలింగ్ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్ తెలిపారు. తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్‌లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం ‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్మార్ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
నవరత్నాలు పొందిన కుటుంబం
-
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్‌కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
మహా శక్తివంత దేశంగా భారత్
తిరుపతి సిటీ/తిరుమల: ప్రపంచంలో భారత్ మహా శక్తివంతమైన దేశంగా నిలవనుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య, ఆర్థిక సేవలు, పేదలకు పక్కా గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి ప్రధాని మోదీ సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకు లభించే ప్రయోజనాలు, వివిధ సౌకర్యాలను మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి రూ.5 లక్షలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజన, పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్, రైతుల కోసం పీఎం కిసాన్, పీఎం కిసాన్ సమ్మాన్, పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ్ అభియాన్, పేదరిక నిర్మూలన కోసం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన, ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం జన్‌ధన్, పీఎం జన్ఔషధి యోజన, పీఎం స్వామిత్ర, పెన్షన్ యోజన, ముద్ర యోజన, డిజిటల్ ఇండియా, పీఎం ఫజల్ యోజన, విశ్వకర్మ యోజన, ఉపాధి కల్పన కోసం స్టార్టప్ ఇండియా, అంకుర భారత్, స్వదేశీ దర్శన్, ఉడాన్ పథకం వంటి పథకాలను అందిస్తోందన్నారు. ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్ర«థమ ఉద్ధేశమన్నారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ హరిత పాల్గొన్నారు. తిరుమల చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. -
చిన్న నగరాలే కీలకం
న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు. మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్ర లీడ్ బ్యాంక్‌గా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ చెప్పారు. రిటైల్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా రిటైల్ రుణాలకు డిమాండ్ బాగుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల మెగా రిటైల్ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించి పలువురికి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నితేష్ రంజన్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ప్రశ్న: స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో లీడ్ బ్యాంకర్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతోంది? జవాబు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. లీడ్ బ్యాంకర్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిర్దేశించిన వారికి సక్రమంగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. రాష్ట్రంలో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పండుగల సీజన్ కోసం సత్వరం రుణాలను మంజూరు చేసేలా విజయవాడలో మెగా రిటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం. 25 మంది బిల్డర్లు, 12 మంది వాహన డీలర్లు, 7 ఎడ్యుకేషన్కన్సల్టెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టైలర్ మేడ్ రుణ పథకాలను ఆఫర్ చేసి, అక్కడిక్కడే తక్షణం రుణాలు మంజూరు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రశ్న: ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రుణ మార్కెట్‌పై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతుందా? జవాబు: వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న మాట వాస్తవమే. కానీ దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆటో, ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్ వంటి రుణాలకు డిమాండ్ బాగుంది. గతేడాది యూనియన్ బ్యాంక్ రిటైల్ రుణాలు 17.19 శాతం పెరిగి రూ.1,60,595 కోట్లకు చేరాయి. ఈ ఏడాది కూడా రిటైల్ రుణాల్లో 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రశ్న: వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి? జవాబు: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. మరో రెండు మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్న: ఇతర బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందా? జవాబు: ప్రస్తుతం అన్ని బ్యాంకులకంటే తక్కువ రేటుకే రుణాలు అందిస్తున్నాం. అంతేకాకుండా పండుగుల సీజన్ దృష్టిలో పెట్టుకొనిఅన్ని రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాం. విదేశాల్లో విద్య కోసం రుణాలు తీసుకునే వారికి రూ.40 లక్షల వరకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలిస్తున్నాం. ఆన్లైన్, యాప్‌ల ద్వారా క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్రశ్న: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయి? జవాబు: ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం కనిపించడం లేదు. రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పటికే పండుగుల సీజన్ మొదలైంది. ఇది నాలుగో త్రైమాసికం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. -
బీఆర్ఎస్కు ఓటేసే వారికే దళితబంధు, ప్రభుత్వ పథకాలు
చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి, తమకు ఓటు వేసే వారికే దళితబంధు, ఇత ర ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి స్సంపల్లిలో దళితబంధు రాలేదని స్థానిక దళితులు ఎమ్మెల్యేను అడిగేందుకు వచ్చారు. అయితే బీఆర్ ఎస్ నాయకులు అడ్డుపడటంతో ఇరువురికి వా గ్వాదం జరిగింది. అనంతరం జరిగిన సభలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 దళి తబంధు యూనిట్లు వస్తే అందులో 80 విస్సంపల్లి గ్రామానికి మంజూరు చేశామన్నారు. ‘గతంలో ఈ గ్రామం నుంచి ఓట్లు పడలేదు. ఎవరు ఓటు వేస్తారో, వేయరో మాకు తెలుసు. మా పార్టీలో పని చేసే వారికే, మాకు ఓటు వేసే వారికి మాత్రమే దళితబంధు, ప్రభుత్వ పథకాలు ఇస్తాం’అని అనడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
ఎస్బీఐ బ్యాంక్ : ఆధార్ ఉంటే చాలు, ఇక ప్రభుత్వ పథకాల్లో సులభంగా చేరొచ్చు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకాలలో ఆధార్ సాయంతో పేర్ల నమోదుకు వీలు కల్పిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీలు) వద్ద ఈ సేవలకు సంబంధించి సదుపాయాన్ని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రారంభించారు. ఎస్బీఐ కస్టమర్లు సీఎస్పీ వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. అకౌంట్ పాస్‌బుక్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక భద్రత పొందేందుకు ఉన్న అడ్డంకులను ఈ నూతన సదుపాయం తొలగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా పేర్కొన్నారు. -
TS Election 2023: 'లక్ష' సాయానికి అర్హుల జాబితాలో.. కార్పొరేటర్ భర్త పేరు!
పెద్దపల్లి: ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంటతో అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా కుల, చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో శ్రీబీసీబంధుశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చే రూ.లక్ష సాయంతో ఆయా కులవృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది. అయితే క్షేత్రస్థాయిలో తొలివిడత సాయం పంపిణీలో నేతల అనుచరుల కమీషన్లతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. కమీషన్ ఇవ్వనిదే చెక్కు ఇవ్వని పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొందని సాయం పొందినవారే ఆరోపిస్తున్నారు. మలివిడతలోనైనా కమీషన్లు, నేతల సిఫారసులు లేకుండా పూర్తి సాయం అందేలా చూడలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రూ.10వేలు ఇవ్వాల్సిందే.. విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర 14 కులాలు, ఏంబీసీ కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు జూన్ 6నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారులకు తెల్లరేషన్‌కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది నిబంధన. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలకు లోబడి ఉన్న వారిని గుర్తించాలి. ఇలా జిల్లాలో మొత్తం 10,759మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,765 మందిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 8,683 మందిని అర్హులుగా తేల్చారు. అందులో తొలివిడుతలో భాగంగా పెద్దపల్లి, రామగుండంలో 300 మందికి, మంథనిలో 180, ధర్మారంలో 65 మందిని తొలివిడత ఎంపిక చేశారు. అయితే తొలివిడతలోనే తమ అనుచరులకు చోటుకల్పించాలనే ఆలోచనతో నేతలు, వారి అనుచరుల సిఫారసుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే అదునుగా తమ బంధువులు, అనుచరులు, లేదా రూ.10నుంచి 15వేలు కమీషన్ ఇచ్చిన వారికే తొలివిడతలో చోటు కల్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా లేనివారి పేర్ల స్థానంలో ఆర్థికంగా బాగున్న వారి పేర్లతో జాబితా ఉండటంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి వివరణ కోరగా నిబంధనల మేరకే.. మంత్రి ఆమోదంతోనే ఎంపికచేశామని తెలిపారు. దళారులకు డబ్బులు ఇవ్వద్దొని, అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. అభివృద్ది నేను చూసుకుంటా.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ నిత్యం తిరిగే ఓ ఎంపీపీ భర్త ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తులకు అందించే రూ.లక్ష సాయం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. సాయానికి ఎంపికై న ఓ లబ్ధిదారుడు కమీషన్ ఇవ్వకపోవడంతో అతడి చెక్కు పంపిణీ కాకుండా అడ్డుకోవడంతో అతడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెక్కు ఇచ్చాడన్న ఆరోపణలు వస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.లక్ష సాయానికి అర్హుల జాబితాలో ఏకంగా కార్పొరేటర్ భర్త పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో రామగుండం పరిధిలో కొంతమంది కార్పొరేటర్లు వారి బంధువులకే దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈ లక్ష రూపాయల సాయంలోనూ బంధువులు, లేదా కమీషన్ ఇచ్చినవారికే ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. -
Andhra Pradesh: ‘పల్లె’కు కొత్త రూపు!
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని పాతమల్లంపేట పంచాయతీలో 18 గిరిజన కుటుంబాలు మాత్రమే ఉన్న కుగ్రామం చంద్రయ్యపాలెం. ఇక్కడి ప్రజలకు నాలుగేళ్ల క్రితం వరకు పక్కా ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. పేదరికానికి మారుపేరుగా ఉన్న వీరు పగలంతా కాయకష్టం చేయడం, కొద్దిపాటి పొలంలో జీడి మామిడి పంట సాగు చేసుకోవడం, రాత్రయితే గుడిసెల్లో బతుకులీడ్చడం.. ఎన్నో తరాలుగా ఇదే వారి జీవన విధానం. గుడిసెల్లోకి వచ్చే విష సర్పాల బారి నుంచి పిల్లలను పంచకు కట్టిన ఊయల్లోనే ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి ఈ కుగ్రామం పరిస్థితి వైఎస్ జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఆ 18 కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు వివిధ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.91,40,000 వీరి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బుతో గొర్రెలు, మేకలు, పాడె గేదెల పెంపకం చేపట్టి కూలి/ వ్యవసాయానికి అనుబంధంగా ఆదాయం పొందుతున్నారు. వీరి ఇళ్ల వద్దకే రేషన్, 104 ద్వారా వైద్యం అందుతోంది. ► ఈయన పేరు కురచ అప్పారావు. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన ఈయన నాలుగేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.5,85,285 లబ్ధి పొందారు. రైతు భరోసా నుంచి ఇంటి స్థలం వరకు 12 ప్రభుత్వ పథకాలను అందుకున్నారు. ‘ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారు.. అధికారంలోకి రాగానే ఒక్కటీ చేయరు. 2019 ఎన్నికల్లోనూ అలాగే అనుకున్నాను. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు. అందుకు నేనే ఉదాహరణ. మా అబ్బాయికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించాను. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపించారు. ఇంత గొప్ప పాలన ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని సంబరపడుతున్నాడు. ► ఇతను అనకాపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న బుడ్డోడుపాడు గిరిజన గ్రామానికి చెందిన సెగ్గే రాజబాబు. దాదాపు 15 సంవత్సరాలు టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పని చేశారు. పాతమల్లంపేట పంచాయతీ పరిధిలో 42 కుటుంబాలున్న ఈ గ్రామానికి రోడ్డు కోసం దశాబ్దాలపాటు శ్రమించారు. ‘మా గ్రామం చుట్టూ కొండ వాగులే, నడిచే మార్గం ఉండేది కాదు. వర్షాకాలంలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీల్లో వాగులు దాటించే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కోసం స్థానిక టీడీపీ నాయకుడిగా ఎంతో పోరాడాను. ఎమ్మెల్యేకు వినతి ఇస్తే పక్కన పడేసేవారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఎమ్మెల్యేను ఒక్కసారి కలిసి అడగ్గానే హామీ ఇచ్చారు. కానీ రోడ్డు వేయకుండా మా టీడీపీ నాయకులు అడ్డుపడితే పట్టుబట్టి రోడ్డు వేయించారు. మోటారు సైకిలు చూడని మా ఊరికి ఇప్పుడు 104, 108 వాహనాలు నేరుగా వస్తున్నాయి. మా తాత, తండ్రుల కాలంలో ఊరికి రోడ్డు ఉంటే బాగుండు అని ఆశ పడ్డారు. నా తరంలో కూడా రోడ్డు చూస్తానన్న ఆశ పోయిన తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అది సాకారమైంది’ అని తెలిపాడు. ►టీడీపీకి కంచుకోటలాంటి పాతమల్లంపేట పంచాయతీలోని 18 కుటుంబాలున్న చంద్రయ్యపాలెం గిరిజన గ్రామానికి చెందిన రుత్తల పెంటయ్య.. ఇప్పటిదాకా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఈయన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో గొర్రెలను కొనుక్కొని రైతుగా మారాడు. ‘ఎకరం పొలం ఉంది, కొన్ని రోజులే వ్యవసాయ పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లో కూలి చేసుకోవాలి. ఇప్పుడు పాపకు అమ్మ ఒడి ఇస్తున్నారు. అమ్మకు పెన్షన్ వస్తోంది. ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులతో గొర్రెలు పెంచుతూ ఆదాయం పొందుతున్నా. ఇల్లు కూడా మంజూరైంది. సంతోషంగా బతుకుతున్నాం’ అని ఆనందంగా చెబుతున్నాడు. నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా ఉన్న గ్రామాలు నాలుగేళ్లుగా కొత్త మార్పు దిశగా పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. దాదాపు 26 సంక్షేమ పథకాల్లో వ్యక్తిగతంగా ప్రజలు సగటున నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారు. ‘కులం, మతం చూడం, ఏ పార్టీ అని చూడం, అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తాం, ఆ ప్రాతిపదికనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి’ అని సీఎం వైఎస్ జగన్ తరచుగా చెప్పే మాట మారుమూల పల్లెల్లో సాక్షాత్కరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఊళ్లన్నీ మారిపోతున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యమైందో ఆయా ఊళ్లలోని ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారు. 1850 కుటుంబాలకు రూ.22.62 కోట్ల లబ్ధి ఇది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, ఆరి్థక మంత్రిగా పని చేసిన నాయకుడు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలోని ఈ గ్రామం పరిస్థితి నాలుగేళ్ల క్రితం వరకు దయనీయం. మూడు కి.మీ రోడ్డు కోసం పదేళ్లకు పైగా ఎదురుచూపు.. శిథిలమైన ప్రభుత్వ బడులను బాగుచేసే నాథుడే కరవు.. డ్రైనేజీ వ్యవస్థే లేదు.. పథకాల కోసం నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు.. ఏ కొందరికో అరకొర ఇచ్చే పింఛన్లలోనూ కోతలు.. ఇలా సవాలక్ష సమస్యలు. 2019 ఎన్నికల తర్వాత 1850 కుటుంబాలు, 5,010 జనాభా ఉన్న ఈ ఊళ్లో ఎవరూ ఊహించని విధంగా మార్పు మొదలైంది. రూ.కోటి నిధులతో మండల కేంద్రాన్ని కలుపుతూ రోడ్డు వేశారు. శిథిలమైపోయిన ఉన్నత పాఠశాలను నాడు–నేడు రెండో విడతలో పునర్ నిర్మిస్తున్నారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు వచ్చాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇదే ఊళ్లోనే ఇస్తున్నారు. రెండు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ఏర్పాటయ్యాయి. 17 మంది ఉద్యోగులు రోజూ స్థానికంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. 35 మంది వలంటీర్లు ప్రతి ఇంటికీ అందుబాటులో ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఉదయాన్నే 777 మందికి పెన్షన్లు అందిస్తున్నారు. 373 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో రోడ్డు, డ్రైనేజీలు, అంతర్గత సీసీరోడ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మిస్తున్నారు. రెండు ఎంపీపీ స్కూళ్లు, ఒక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా పుస్తకాలు, బ్యాగు వంటి సమస్త వస్తువులు అందుతున్నాయి. దాదాపు 400 మంది తల్లులు అమ్మ ఒడి అందుకుంటున్నారు. మరో 152 మంది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారు. మొత్తంగా గ్రామ ప్రజలు వివిధ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.22,62,25,944 లబ్ధి పొందారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప కనిపించని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా రెండు, మూడు పర్యాయాలు గ్రామానికి వచ్చి బాగోగులు కనుక్కుంటున్నారు. ‘ప్రభుత్వం అంటే రేషన్ కార్డులు ఇవ్వడం, రోడ్లు వేయడం మాత్రమే చేస్తుందనుకున్నాం. ఇలా ఇన్ని మంచి పనులు చేయొచ్చని నాలుగేళ్లుగా సీఎం నిరూపించారు’ అని గ్రామస్తులు కితాబిస్తున్నారు. మరో ప్రపంచాన్ని చూస్తున్న బుడ్డోడుపాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాత మల్లంపేట పంచాయతీ చుట్టూ 14 చిన్న చిన్న వాడలున్నాయి. ఇందులో బుడ్డోడుపాడు ఒకటి. 42 గిరిజన కుటుంబాలున్న ఈ వాడకు 70 ఏళ్లుగా రోడ్డు మార్గం లేదు. ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే దాదాపు 12 కి.మీ మేర వాగులు, వంకలు, డొంకలు దాటి రావాలి. జబ్బు చేస్తే డోలీలో తరలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. సైకిల్ తప్ప ఇతర ద్విచక్ర వాహనాన్నే చూడని ప్రజలు, పండించిన పంటను సైతం మంచి ధరకు అమ్ముకోలేని దుస్థితి. కనీసం పిల్లలను చదివించుకుందామన్నా రోజూ ఇద్దరు మనుషులు పిల్లలకు రక్షణగా ఉండి వాగులు దాటించి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాల్సిన స్థితి. వర్షం వస్తే పొంగుతున్న వాగులు దాటలేక ఎక్కడో చోట తలదాచుకోవాల్సిన పరిస్థితులు. వాడంతా టీడీపీకి అనుకూలమే. కానీ ఏరోజూ ఏ నాయకుడూ ఇటు ౖవైపు కన్నెత్తి చూసేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ఈ వాడకు మంచి రోజులు వచ్చాయి. ‘టీడీపీ సానుభూతిపరులమన్న మాటేగాని గత టీడీపీ ప్రభుత్వంలో మేం పొందిన మేలు లేదు, మా కష్టాలు విన్న నాయకులూ లేరు. మమ్మల్ని మనుషులుగా గుర్తించింది మాత్రం జగన్ ప్రభుత్వమే’ అని 60 ఏళ్ల సెగ్గే రాజబాబు ఆవేదన వెలుబుచ్చాడు. ఇప్పుడు స్థానికంగా ఉండే వలంటీర్ ప్రతినెలా 21 మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. 18 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. గతంలో చదువు కోసం పిల్లలను 9 కి.మీ దూరంలోని వేరే ఊరికి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడే ఐదవ తరగతి వరకు పాఠశాల ఏర్పాటైంది. 22 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఏడుగురు విద్యార్థులు పై చదువుల కోసం వేరే ఊళ్లకు వెళ్లి వస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో 1,87,7000 జమ అయింది. ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.1.52 కోట్ల మేర ఇక్కడ అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ వాడకే నేరుగా వాహనాలు వస్తుండడంతో పండించిన జీడిమామిడి పంటను స్థానికంగా అమ్ముకున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక నర్సీపట్నం ఎమ్మెల్యే మూడుసార్లు గ్రామానికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో మా పెద్దలు ఎప్పుడూ ఎమ్మెల్యే ఎలా ఉంటారో చూడలేదు. సచివాలయాలు వచ్చాక అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి. ఎన్నో దశాబ్దాల కల అయిన రోడ్డు కూడా జగనన్న ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీ. – తూబిరి రాజబాబు, మాజీ వైస్ సర్పంచ్, బుడ్డోడుపాడు నాలుగేళ్లలో రూ.4 లక్షల సాయం మా ఇంట్లో ఇద్దరికి వికలాంగుల పెన్షన్ వస్తోంది. వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం కూడా ఇచ్చారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే విశాఖపట్నం ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చారు. వలంటీర్లు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏమన్నా సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. ఇప్పటి దాకా వివిధ పథకాల ద్వారా మాకు రూ.4,05,500 వచ్చింది. – చింతకాయల మంగాయమ్మ, అల్లిపూడి గ్రామం ఇంత మంచి పాలన చూడలేం మా పెద్దబ్బాయికి మూడేళ్లు వసతి దీవెన వచ్చింది. చిన్నబ్బాయికి నాలుగేళ్లు జగనన్న అమ్మ ఒడి కూడా తీసుకున్నాం. ఏడు ప్రభుత్వ పథకాల ద్వారా నాకు రూ.2,51,250 నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగోలేని మాలాంటి కుటుంబాలు బతికేదే కూలి పనుల పైన. భర్త చనిపోయిన నాకు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి వద్దే బడ్డీ కొట్టు పెట్టుకున్నా. జగనన్న వల్ల అందరం చక్కగా బతుకుతున్నాం – వడ్డి సత్యవతి, అల్లిపూడి గ్రామం నా బిడ్డ ఇంజనీర్ అవుతోంది.. మా బాబు చదువుకునేటప్పుడు ఇన్ని ప్రభుత్వ పథకాలు లేవు. ఎలాంటి సాయం కూడా అందలేదు. మా పాప మాత్రం ప్రభుత్వ పథకాలతోనే ఇంజినీరింగ్ చదువుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు కొద్దిపాటి పొలానికి రైతు భరోసా వచ్చింది. మా ఆయనకు వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పటి దాకా మా కుటుంబానికి రూ.3,75,089 సాయం అందింది. – చింతకాయల నాగరత్నం, అల్లిపూడి పిల్లల చదువు కష్టాలు తీరాయి మా పెద్దబ్బాయి చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా చిన్నబ్బాయికి అమ్మ ఒడి వస్తోంది. మాకు రైతు భరోసా, చేయూతతో పాటు పెద్ద వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఏడాదికి అన్ని పథకాల రూపేణా రూ.70 వేలకు పైనే సాయం అందింది. గతంలో ఊరు దాటి బయటకు వెళ్లాలంటే బతుకుపై ఆశ వదులుకునేవారం. ఇప్పుడు చక్కటి రోడ్డు వేయడంతో ఏ సమయంలోనైనా బయటి ప్రాంతానికి నిర్భయంగా వెళ్లగలుగుతున్నాం. – బోయిన చినతల్లి, వెంకటేశ్వర్లు దంపతులు, బుడ్డోడుపాడు -
జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరాటం..!!
వరంగల్: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు. మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు. మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున.. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్ లేదా ప్లస్ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు. వారంలో పంపిణీకి సిద్ధం జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు. రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దళారులను నమ్మొద్దు.. రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -
గూడేనికి కొత్త గుర్తింపు
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి. వేర్వేరు కమిషన్ల ఏర్పాటు.. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్‌గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను 2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ పనితీరులో మైలు రాళ్లు.. ► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్ ఆరా తీస్తోంది. ► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది. ► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్ఓఎఫ్ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్సింగ్ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. –వడిత్యా శంకర్ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నీటి తిప్పలు తీర్చారు గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. –ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. –టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. –గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి బాక్స్‌లో హైలెట్ చేయగలరు ► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 ► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్ కార్డులిచ్చారు. ► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు. ► ఆధార్ కార్డులు రావడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు. -
అభాగ్యులకు అండగా..
సాక్షి, నెట్వర్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమస్యకు పరిష్కారం ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్‌కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయ్యింది. దీంతో ఆమె పింఛన్ ఆగిపోయింది. ‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్ మెహరున్నీసా, వలంటీర్లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్‌కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్‌కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్‌ను తొలగించారు. ఆ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నిరక్షరాస్యులకు ఎంతో మేలు ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్ ఇతని పేరు శర్మాస్ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డు పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్ ఇంటికి వచ్చినపుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్.. సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా -
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపు ఏళ్లు గడుస్తున్నా కదలని ఫైళ్లు
వికారాబాద్: జిల్లాలోని అనేక మంది అర్హులకు ఆహార భద్రత కరువైంది. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత ఒకేసారి కొత్త కార్డులు జారీచేసింది. ఈ సమయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో మిగిలిన వారంతా రేషన్‌తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా కార్డుల్లో కొత్త పేర్లను చేర్చే విషయంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఆహార భద్రతపథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు ఆరు వేలకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఆయా కుటుంబాల్లో పెళ్లిళ్లు, ప్రసవాలు జరిగి సభ్యులసంఖ్య పెరిగింది. మృతి చెందిన వారి పేర్లను కార్డుల్లోంచి తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా వచ్చిన వారి వివరాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. 35,000 పెండింగ్ ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాను ఆన్లైన్లో పెట్టింది. కానీ వీరికి కార్డులు జారీ చేయకుండా ఏడాదికి సరిపడే కూపన్లు అందజేసింది. ఆతర్వాత బయోమెట్రిక్ విధానంలో బియ్యం సరఫరా చేస్తోంది. కానీ కొత్తగా ఆయా కుటుంబాల్లోకి వచ్చిన వారిని చేర్చడంపై మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉన్నారు. వీరందరూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకోని వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటికీ మోక్షం కలిగితే జిల్లాకు మరో 210 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరగనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై రాష్ట్ర సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నష్టపోతున్నారు. 2,41,622 కార్డులు జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరలదుకాణాలు, 2,41,622 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 2,14,853 ఎఫ్ఎస్సీ, 26,730 అంత్యోద య, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో లబ్ధిదారులందరికీ సబ్సిడీపై చక్కర పంపిణీ చేయగా ప్రస్తుతం అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేశాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. – రాజేశ్వర్, డీఎస్ఓ -
23 నుంచి ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా, పటిష్టంగా అమలు చేసేందుకు దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు. జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్కమ్, మ్యారేజీ, డెత్ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి. సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి. గ్రామాలకు రెండు బృందాలు మండల స్ధాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక బృందంగా, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఈవో కలసి రెండో టీమ్‌గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. వార్డులకు మున్సిపల్ బృందాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్‌గా ఉంటారు. జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. సేవల్లో ఉన్నత ప్రమాణాలు.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్ధంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. 99.35 శాతం వినతులు పరిష్కారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్‌వోడీలతో పాటు రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది. సీఎంవో, సచివాలయం, విభాగాధిపతుల దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది. తిరస్కరిస్తే ఇంటికెళ్లి వివరించాలి ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి. ఈమేరకు ఎస్‌వోపీలో మార్పులు తేవాలి. రిజెక్ట్ చేసిన గ్రీవెన్స్‌ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి. గడప గడపకూ పనులకు నిధుల కొరత లేదు గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం. ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు ఈ డబ్బులు మంజూరు చేయాలి. వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి. ఆగస్టు 1న అర్హులకు పథకాలు జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్ఓడీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి. -
ఫ్యాక్ట్ చెక్ : తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తు తరానికి పెట్టుబడి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద సంక్షేమ కేలండర్ ప్రకారం విద్యా సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పేదింటి పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అంగన్వాడీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్‌తోపాటు విదేశాల్లో చదువుకునేందుకూ ఈ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థినీ ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 45 నెలల్లో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.57,642.36 కోట్లు ఖర్చుచేసింది. ఉన్నత సంకల్పంతో అమలుచేస్తున్న పథకాలతో వచ్చిన మార్పులు, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పచ్చ గంతలు కట్టుకున్న ‘ఈనాడు’ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. సంక్షేమ కేలండర్ ప్రకారమే నిధులు విడుదల విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఫీజుల ఒత్తిడి లేకుండా ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తోంది. అక్టోబరు–నవంబర్–డిసెంబరు–2022 త్రైమాసికానికి 9,86,092 మంది విద్యార్థులకు రూ.684.52 కోట్లను మార్చి 19న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి మే 24న రూ.702.99 కోట్లు అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ముందుగా నిర్దేశించిన సంక్షేమ కేలండర్ ప్రకారమే, క్రమం తప్పకుండా ఇలా నిధులు విడుదల చేస్తున్నా.. వాస్తవాలను కప్పిపుచ్చి పచ్చ పత్రిక రోత రాతలు రాస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న 9,55,662 మంది పిల్లలకు ‘వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను ఏప్రిల్ 26న జమచేసింది. అయినప్పటికీ ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘జగనన్నా ఇదేనా విద్యా దీవెన’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనం వండి వార్చింది. అప్పట్లో అరకొర చెల్లింపులు.. అనేక కొర్రీలు గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు కాలేజీ స్థాయిని బట్టి రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం రూ.35 వేలకే పరిమితం చేసి, అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పైగా ఏళ్ల తరబడి బకాయిలు. అప్పట్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆవేదను కనీసం పట్టించుకోని ఈనాడు.. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నా బురద జల్లుతోంది. చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు (2017–18, 2018–19) రూ.1,778 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అలాగే, విద్యార్థుల వసతి కోసం అనేక కొర్రీలూ పెట్టింది. కుల ప్రాతిపదికన, కోర్సుల ప్రాతిపదికన రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే తక్కువ మందికి ఇచ్చింది. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లల్లో ఈబీసీ, కాపు విద్యార్థులకు చోటులేకుండా చేసింది. అంతేకాక.. బాబు జమానాలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలని నిబంధన పెట్టి ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. ఇవేవీ ఆ పచ్చ పత్రికకు పట్టవు. ఈ నాలుగేళ్లలో విద్య, వసతి దీవెనకు రూ.14,210 కోట్లు.. కానీ, ప్రసుత్త ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు చేరువ చేసింది. ఏ విద్యార్థి చదువూ ఆగిపోరాదని ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా సగటున రూ.3,311 కోట్లు చొప్పున రూ.9,934 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ‘జగనన్న వసతి దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకైతే రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు చొప్పున ఏడాదిలో రెండుసార్లు తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా విద్యార్థులకు రూ.4,275.76 కోట్లు చెల్లించింది కూడా. అంటే ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 2019–20 నుంచి 2022–23 వరకు (మే 24న విద్యా దీవెన కింద చెల్లించే రూ.702.99తో కలిపి) సుమారు రూ.14,210 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసింది. ఇదేదీ ‘ఈనాడు’కు కనిపించదు. విద్యార్థులకు అండగా ‘1902’ టోల్‌ఫ్రీ నంబర్.. ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎవరైనా యాజమాన్యలు వినకపోతే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయమే (సీఎంఓ) నేరుగా కాలేజీలతో మాట్లాడుతోంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారు వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. కానీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిధులు చెల్లించిందంటూ ఈనాడు నిరాధార ఆరోపణులు చేయడం సిగ్గుచేటు.