చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారికి, తమకు ఓటు వేసే వారికే దళితబంధు, ఇత ర ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి స్సంపల్లిలో దళితబంధు రాలేదని స్థానిక దళితులు ఎమ్మెల్యేను అడిగేందుకు వచ్చారు.
అయితే బీఆర్ ఎస్ నాయకులు అడ్డుపడటంతో ఇరువురికి వా గ్వాదం జరిగింది. అనంతరం జరిగిన సభలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 దళి తబంధు యూనిట్లు వస్తే అందులో 80 విస్సంపల్లి గ్రామానికి మంజూరు చేశామన్నారు. ‘గతంలో ఈ గ్రామం నుంచి ఓట్లు పడలేదు. ఎవరు ఓటు వేస్తారో, వేయరో మాకు తెలుసు. మా పార్టీలో పని చేసే వారికే, మాకు ఓటు వేసే వారికి మాత్రమే దళితబంధు, ప్రభుత్వ పథకాలు ఇస్తాం’అని అనడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment