![BRS MLA Redya Naik Faces Backlash Villages Protest To Go Back - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/18/Naik2.jpg.webp?itok=qy5ZjboA)
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తప్పడం లేదు. కురివి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాను తట్టినా ఎమ్మెల్యే ను గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాలుతండాకు చేరుకున్న ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు.
మా గ్రామానికి ఏం చేశావో చెప్పాలని తండవాసులు నిలదీశారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కారులను ప్రక్కకు నెట్టేయడంతో గ్రామస్థులు పోలీసులపైకి తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మౌనంగా పోలీస్ బందోబస్తు మధ్య ముందుకు వెళ్ళిపోయారు.
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళ్ళినా విపక్షాల తోపాటు స్వపక్షానికి చెందిన వారు నిలదీసి అడ్డుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలే ఆందోళనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
(బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!)
Comments
Please login to add a commentAdd a comment