Redya Naik
-
బీఆర్ఎస్కు ఓటేసే వారికే దళితబంధు, ప్రభుత్వ పథకాలు
చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి, తమకు ఓటు వేసే వారికే దళితబంధు, ఇత ర ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి స్సంపల్లిలో దళితబంధు రాలేదని స్థానిక దళితులు ఎమ్మెల్యేను అడిగేందుకు వచ్చారు. అయితే బీఆర్ ఎస్ నాయకులు అడ్డుపడటంతో ఇరువురికి వా గ్వాదం జరిగింది. అనంతరం జరిగిన సభలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 దళి తబంధు యూనిట్లు వస్తే అందులో 80 విస్సంపల్లి గ్రామానికి మంజూరు చేశామన్నారు. ‘గతంలో ఈ గ్రామం నుంచి ఓట్లు పడలేదు. ఎవరు ఓటు వేస్తారో, వేయరో మాకు తెలుసు. మా పార్టీలో పని చేసే వారికే, మాకు ఓటు వేసే వారికి మాత్రమే దళితబంధు, ప్రభుత్వ పథకాలు ఇస్తాం’అని అనడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గ గత చరిత్ర ఇదే..మరి ఇప్పుడు..?
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గం డోర్నకల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో గిరిజన నేత డి.ఎస్.రెడ్యా నాయక్ ఆరోసారి విజయం సాదించారు. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ సీటుగా ఉన్నప్పుడు ఈయన నాలుగు సార్లు గెలవడం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో రెడ్యానాయక్ కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారిపోయారు. తదుపరి 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి రామచంద్రునాయక్ పై 17511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెడ్యా నాయక్‌కు 88307 ఓట్లు రాగా, రామచంద్రు నాయక్‌కు 70926ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.రవీందర్‌కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రెడ్యానాయక్ 2009లో ఓడిపోయినా, 2014లో తన పాత ప్రత్యర్ధి సత్యవతి రాధోడ్‌ను 23531ఓట్ల తేడాతో ఓడిరచారు. 2014లో తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ప్రభజంనం వీచినా ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. 2009లో టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించిన సత్యవతి 2014లో టిఆర్ఎస్లోకి వెళ్లి పోటీచేసి ఓటమిచెందారు. ఆ తర్వాత కాలంలో ఆమె ఎమ్మెల్సీ అయి 2018 ఎన్నికల తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1957లో ఏర్పడిన డోర్నకల్ నియోజకవర్గంలో 13సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిస్తే, ఒకసారి టిడిపి గెలిచింది. ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది. డోర్నకల్‌లో 1972లో నూకల రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా నెగ్గగా, ఆయన అకాల మరణం తర్వాత 1974లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్. సురేంద్రరెడ్డి ఏకగ్రీవంగా గెలవడం మరో విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తర్వాత రామసహాయం సురేంద్రరెడ్డి మరో నాలుగుసార్లు, తదనంతరం రెడ్యా నాయక్ మరో ఆరుసార్లు గెలిచారు. నూకల గతంలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. నూకల కొంతకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన సభలో తెలంగాణ యున్కెటెడ్ ఫ్రంట్ ఏర్పడిన శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వున్నారు. రెడ్యానాయక్ 2004లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. సురేంద్రరెడ్డి మహబూబాబాద్ నుంచి ఒకసారి, వరంగల్లు నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. డోర్నకల్‌లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజికవర్గం ఎన్నిక కాగా,నాలుగుసార్లు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు గిరిజన నేత ఎన్నికవడం విశేషం. డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు? ఏ ఊరుకు వెళ్లినా ఇదే కథ!
-
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు?
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తప్పడం లేదు. కురివి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాను తట్టినా ఎమ్మెల్యే ను గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాలుతండాకు చేరుకున్న ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మా గ్రామానికి ఏం చేశావో చెప్పాలని తండవాసులు నిలదీశారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కారులను ప్రక్కకు నెట్టేయడంతో గ్రామస్థులు పోలీసులపైకి తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మౌనంగా పోలీస్ బందోబస్తు మధ్య ముందుకు వెళ్ళిపోయారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళ్ళినా విపక్షాల తోపాటు స్వపక్షానికి చెందిన వారు నిలదీసి అడ్డుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలే ఆందోళనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!) -
మంత్రి సత్యవతి Vs రెడ్యానాయక్.. డోర్నకల్ బీఆర్ఎస్లో తన్నులాట!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజ కవర్గంలో రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వర్గీయులు దుర్భాలాడుకుంటూ తన్నులాడుకున్నారు. పరస్పరం బాహాబాహీకి దిగారు. రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు రెడ్యానాయక్ బుధవారం ఉదయం కురవి మండలం బంగ్యా తండాకు చేరుకున్నారు. మా ఊరికి ఏం అభివృద్ధి చేశావంటూ తండాకు చెందిన మంత్రి సత్యవతి వర్గీయుడైన మాజీ సర్పంచ్ హచ్చా నాయక్ అనుచరులు ఎమ్మెల్యే ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనం ముందు భాగంలో టైర్ల కింద పడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే తండాలో ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లారు. సభ వద్ద హచ్చానాయక్ తమ్ముడు కిషన్‌నాయక్ రభస చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు సింగ్యానాయక్, ఇతర వర్గీయులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రతిగా మంత్రి సత్యవతి వర్గీయులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అంగీలు చిరిగిపోయినా ఎవ్వరూ తగ్గలేదు. చివరికి పోలీసులు వారించినా వినలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండానుంచి బయటకు వెళ్తుండగా కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
బీఆర్ఎస్లో ఇంటి దొంగలు.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
కురవి: ‘బీఆర్ఎస్లో ఇంటి దొంగలున్నారు.. బీఆర్ఎస్ పేరు చెప్పి లక్షలు లక్షలు సంపాదించుకుంటూ నాయకులనిపించుకుంటున్నారు.. రేపు ఎట్లయినా రెడ్యానాయక్‌ను ఓడించాలని ప్రయత్నం చేస్తరు..’అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఘాటుగా విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అధ్యక్షతన జరిగింది. సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్ వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ తనను ఓడించాలని ఎంతోమంది మహామహులు తిరిగి ప్రచారం చేశారని చెప్పారు. మరి కొందరైతే ఆ గర్భశత్రువులేనని.. తనను చూస్తే వాళ్లకు నిద్రపట్టదని.. ఎప్పుడు చస్తాడా? పోతాడా.. అనుకుంటున్నారని పేర్కొన్నారు. -
నిరూపించకుంటే రేవంత్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటాడా?
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను...లేకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 10 చెప్పు దెబ్బ లు తింటాడా’’అని మాజీ మంత్రి రెడ్యా నాయక్ సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ అని టీపీసీసీ పదవిని డబ్బులతో కొనుగోలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తమకు సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. తాను, తన కూతురు ఎటువంటి భూముల కోసం పార్టీ మారలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనే కారణంతోనే బీఆర్ఎస్లో చేరామన్నారు. గతంలో కొంత భూమికొని తర్వాత అమ్మేశామన్నారు. ఇదే భూమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు. -
Telangana: మానుకోటలో మహిళా నేతల కోల్డ్‌వార్
వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ, గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. కాని ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడుస్తోందట. ఈ ఇద్దరి మధ్యా తలెత్తిన ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. చానా క్లోజ్.. అయినా డిఫరెన్సెస్ మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. అందరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోందట. బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గతంగా ఇద్దరి మధ్యా యుద్ధమే జరుగుతోందని టాక్. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ కవిత భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇద్దరు మహిళా నేతలు ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట. నాయక్ వర్సెస్ రాథోడ్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పలుమార్లు రెడ్యానాయక్ పై ఓటమి పాలయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ లో చేరగా ప్రత్యర్థిగా ఉన్న రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్ లో చేరడంతో సత్యవతి రాథోడ్ కు స్థానం లేకుండా పోయింది. 2018లో ఎమ్మెల్యే టిక్కెట్ రెడ్యానాయక్‌కే ఇచ్చి, సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు గులాబీ దళపతి. చిరకాల ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ ఇద్దరికీ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. నిరంతర ఇరు కుటుంబాలు రాజకీయంగా పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న విభేదాలు కవితకు తలనొప్పిగా మారాయి. మానుకోట గులాబీకి రెండు ముళ్లు ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలే అని చెబుతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీ చేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపి కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ తో కవితకు విభేదాలు ఏర్పడ్డాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్ కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. మానుకోటలో అధికారపార్టీలో నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును నిశితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మంత్రి Vs సిట్టింగ్ ఎమ్మెల్యే: మూడు దశాబ్దాల రాజకీయ వైరం!
వాళ్లిద్దరూ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులు. ప్రస్తుతం గులాబీ గూటి నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సమయం దొరికినప్పుడల్లా మంత్రిపై ఆ ఎమ్మెల్యే సెటైర్లు వేస్తుండడం కలకలం రేపుతోంది. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన డోర్నకల్‌లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలో ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. వారిలో ఒకరు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే, మరొకరు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకరి తర్వాత మరొకరు గులాబీ గూటికి చేరి అధికారాన్ని అనుభవిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అక్షరాల నిరూపిస్తున్నారు. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరుగగా ఆరుసార్లు రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు 1989, 2009, 2014లో సత్యవతి రాథోడ్‌తో రెడ్యానాయక్ తలపడ్డారు. ఒక్కసారి మాత్రమే 2009లో సత్యవతి చేతిలో రెడ్యానాయక్ ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో టీఆర్ఎస్లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యానాయక్ జయకేతనం ఎగురవేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్యానాయక్ పోటీ చేసి గెలుపొందగా-- టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్లో బెర్త్ ఇచ్చారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించినా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికివారు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగనుండడంతో... ఇప్పటినుంచే భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెడ్యానాయక్ పనిచేయగా-- ప్రస్తుతం టీఎస్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ అదే శాఖతో టు స్త్రీ శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యానాయక్ సందర్భోచితంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం కలకలం రేపుతోంది. పైగా తనను మంత్రి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో తెలియడం లేదంటూ మరిపెడలో వ్యంగ్యస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరగడంతో రెడ్యానాయక్ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అందుకు ఆమె సుముఖంగా లేనట్లు అనుచరులు చెబుతున్నారు. మూడుసార్లు డోర్నకల్ నుంచి పోటీచేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి రాథోడ్ నాలుగోసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారట. దాంతో డోర్నకల్ రాజకీయం రసకందాయంగా మారింది. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా.. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా రేపుతోంది. -
సీనియర్‌ను.. అయినా ప్రాధాన్యత లేదు: రెడ్యా నాయక్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు కలిశారు. సత్యవతి రాథోడ్‌కు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత సీనియర్ లీడర్‌గా ఉన్నా.. తనకు మంత్రి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేయగా త్వరలోనే ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని కేటీఆర్ అనునయించినట్లు తెలిసింది. -
ఎన్టీఆర్, అనుష్క అంటే ఇష్టం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేనే కాదు.. మంత్రిగా కూడా పనిచేశారు ధరంసోత్ రెడ్యానాయక్. ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎన్టీఆర్ నటించిన ప్రతీ సినిమా.. అదీ విడుదలైన రోజునే చూడడం అలవాటు.. అయితే, రాజకీయాల్లో వచ్చాక సినిమాలు చూసే తీరిక దొరకడం లేదు.. చివరగా బాహుబలి చూశారు.. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి గంటల తరబడి కబడ్డీ ఆడే ఆయన ఇప్పుడు ప్రో కబడ్డీ చూస్తూ ఆ సరదా తీర్చుకుంటున్నారు.. నాటు కోడి, చేపల కూర ఉంటే చాలు అన్నం కొంచెం ఎక్కువగానే తినే ఆయన ఇప్పుడు కొంచెం తగ్గించారు.. ఇలాంటి ఎన్నో విషయాలను రెడ్యానాయక్ ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌లో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘నాకు సీనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఇష్టం. ఆయన సినిమా రిలీజ్ అయిన రోజే చూసేవాడిని. ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులవుతోంది.. చివరగా బాహుబలి సినిమా చూశా.. అందులో అనుష్క నటన నచ్చింది.. నాకు అన్నింటి కంటే కబడ్డీ ఇష్టమైన ఆట.. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని.. డోర్నకల్ నియోజకవర్గంలోని భూములకు రెండు పంటలకు నీరు అందించాక ఇక్కడి రైతుల ముఖంలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం..’ సాక్షి, మహబూబాబాద్: ఇంట్లో సందడే సందడి మాది పెద్ద కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్లతో ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరైన ఉగ్గంపల్లిలోనే 8వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తరువాత 9, 10వ తరగతి హన్మకొండలో విద్యనభ్యసించా. అనంతరం ఇంటర్ మహబూబాబాద్‌లో చదివాను. వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో డీగ్రీ బీఏ పూర్తి చేశాను. కాలేజీ రోజుల్లో సినిమాలు బాగా చూసేవాడిని. ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఎన్టీఆర్ నటించిన ప్రతీ సినిమా.. అదీ విడుదలైన రోజు చూడాల్సిందే. చిరంజీవి సినిమాలంటే కూడా ఇష్టం. టీవీలో చిరంజీవి సినిమా వస్తే ఇప్పటికీ తప్పకుండా చూస్తా. ఇప్పుడు బాగా బిజీ కావటంతో పాటు చూడదగిన సినిమాలు రాకపోవడంతో బాగా తగ్గించా. చివరగా బాహుబలి సినిమాను భార్యాపిల్లలతో కలిసి చూశా ఆ సినిమాలో అనుష్క నటన నచ్చింది. చిన్నప్పుడు సెలువులు వచ్చాయంటే బావుల్లో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం కేటాయించటోడిని. కబడ్డీ ఆట అంటే ఇష్టం. స్కూళ్లో, కాలేజీలో మంచి ఆటగాడిగా గుర్తింపు వచ్చింది. టీవీలో ప్రో కబడ్డీ మ్యాచ్‌లు వస్తే ఇష్టంగా చూస్తా. చికెన్ వండేది.. గతంలో నాన్ వెజ్ బాగా తీసుకునేవాడిని. ఇప్పుడు కొం చెం తగ్గించాను. అప్పుడు ఇప్పుడైనా నాటు కోడి కూర, చేపల కూర అంటే మహా ఇష్టం. అన్నంలో ఇవి ఉంటే ఒక ముద్ద ఎక్కువే తింటా. హాస్టల్లో పుడ్ లీడర్‌గా ఎ న్నికై, అక్కడి విద్యార్ధులకు మంచి అన్నం పెట్టించేవాడి ని. కాలేజీ రోజుల్లో చికెన్ వంట చేసేవాడిని. కురవి వీరభద్ర స్వామి భక్తుడిని. మా ఇంట్లో ఏ శుభ కార్యం మొదలు పెట్టినా కురవి వీరన్నను దర్శించుకోవాల్సిందే. రాజకీయ ప్రస్థానం మా తాత అప్పట్లో 20 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసిండు. దీంతో మండల సమితిలకు నన్ను వెంట బెట్టుకుని తీసుకుని పోయేవాడు. తద్వారా నాకు తెలియకుండానే రాజకీయాలంటే ఇష్టం ఏర్పడింది. మొదటగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు డైరెక్టర్‌గా పనిచేయటంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉగ్గంపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక సమితి ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసినా. అనంతరం ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాను. నిజాయితీగా బతకాలని... బకరి రుణం ఉంచుకోరాదని.. ఇతరులకు మేలు చేయకపోయినా చెడు చేయొద్దని మా తాత చెప్పేవారు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన దాన్ని మరవలేదు. అందుకే కావొచ్చు ఈ నియోజకవర్గ ప్రజలు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆరు సార్లు గెలిపించారు. అమ్మ ఆశీర్వాదమే బలం మేం నలుగురు అన్నదమ్ములం. ఇద్దరు చెల్లెళ్లు. నన్ను అమ్మ ఎక్కువగా ప్రేమతో చూసేది. నా ఎదుగుదల వెనుక అమ్మ శ్రమ ఎంతో ఉంది. ఆమె భౌతికంగా లేకున్నా ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. నేను ఈ వయస్సులోనూ ఆరోగ్యంగా, బలంగా ఉన్నానంటే ఆ రోజుల్లో అమ్మ చేసిన రొట్టెల బలమే. ఆ రోజుల్లో బియ్యం బువ్వ ఎక్కడిది? పిండి దంచి రొట్టెలు చేసి పెడితే అవి పట్టుకుని కాలేజీకి పోయి చదువుకున్నాం. చదువుకునే రోజుల్లో ఎంతో ఇబ్బందులు పడ్డాం. కానీ అవే నాకు ఈరోజు పాఠాలుగా, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే శక్తిని ఇచ్చాయి. కష్టాలు వస్తే భయపడవద్దు... వాటిని ధైర్యంగా ఎదుర్కొన్ని నిలబడాలి. వ్యవసాయంపై మక్కువ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే మక్కువ. రాజకీయాల్లో బిజీ కావడంతో వ్యవసాయం స్వతహాగా చేయలేకపోతున్నా.. కానీ సమయం దొరికితే కూలీలతో పనులు చేయిస్తా. నా భార్య మంగమ్మ వ్యవసాయ పనులు దగ్గరుండి చూసుకుంటుంది. తను ఇప్పటికి కూడా వ్యవసాయ పనులు చేస్తుంది. భార్య సహకారం మరవలేనిది నా భార్య మంగమ్మ సహకారంతోనే నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నా. రాజకీయాల్లో బిజీ కావటంతో పిల్లల చదువులు, వారి బాగోగులు, ఇంటిపనులు, వ్యవసాయ పనులు, ఇంటికి వచ్చిన కార్యకర్తల మంచీ, చెడు అన్నీ ఆమె చూసుకుంటోంది. దీంతో నా పని తేలికైంది. బిడ్డలకు అదే చెబుతా.. ప్రజలకు సేవ చేయాలన్నది నా ఫిలాసఫీ. మొదటి నుం చి నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నా. నా పిల్లలకైనా, కార్యకర్తలకైనా ఇదే చెబుతాను. మనల్ని నమ్మిన వారి కోసం పనిచేయటంలో ఉన్న సంతృప్తి మరేదాని లోనూ ఉండదని నేను నమ్ముతా.. ఆచరిస్తా. వైఎస్సార్ మృతితో మా కుటుంబ సభ్యుడిని కోల్పోయా నేను జనరల్ సీటులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపొందా. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అండతో మంత్రిన య్యా, ఇక నా కూతురు ఎమ్మెల్యేగా గెలుపొందింది. వైఎస్సార్ అకాల మరణం అప్పట్లో నన్ను చాలా బాధించింది. మా ఇంట్లో కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు అనిపించింది. సార్ నన్ను తన ఇంటిలో కుటుంబసభ్యుడిలాగా చూసేవారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన రోజు నేను చాలా బాధపడ్డా. ఆ రోజే నా జీవితంలో చీకటి రోజుగా భావిస్తా. కానీ ప్రజలు నా సేవలను గుర్తించి తిరిగి మళ్లీ 2014లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేయటంతో పాటు, సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో విజన్ ఉన్న నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గమే కాదు.. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలిసిన నాయకుడు. అందుకే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాను. కేసీఆర్ మా బిడ్డ కవితను తన బిడ్డగా భావించి ఎంపీగా అవకాశం కల్పించారు. ఈ టర్మ్‌తో నాకు 70 ఏళ్లు నిండనున్నాయి. కేసీఆర్ ఆశీస్సులతో నా కొడుకు రవిచంద్రను ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది. డోర్నకల్ నియోజకవర్గ రైతాంగానికి రెండు పంటల సాగు నీరు అందించి వారి ముఖంలో ఆనందం చూడటమే నా జీవితాశయం. -
‘ఆధారాలు చూపిస్తే ఉత్తమ్‌కే రాసిస్తా’
హైదరాబాద్: పార్టీ మారినందుకు నజరానాగా హఫీజ్‌పేట్‌లో తమకు భూమి ఇచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనడం అవాస్తవమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు రెడ్యానాయక్ అన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరామనే దుగ్ధతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉత్తమ్ కంటే సీనియర్ అయిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. 2006 జనవరిలో సర్వే నెం.80లో భూమి కొన్నామని, 2008లో విక్రయించామని, అవి పూర్తిగా ప్రైవేటు భూములని, అప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నానని వివరించారు. తాను టీఆర్ఎస్లో చేరాక ఒక్క సెంటు భూమి కొన్నానని ఆధారాలు చూపిస్తే అది ఉత్తమ్‌కే రాసిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కారులో నగదు దొరికినా ఉత్తమ్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, అవన్నీ న్యాయంగా సంపాదించినవేనా అని ప్రశ్నించారు. ఉత్తమ్‌కు విజ్ఞత ఉంటే తనకు, తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలోని గిరిజనులు క్షమించరన్నారు. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. అందులో ఆకట్టుకునే నాయకుడే లేడంటూ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని రెడ్యా చెప్పారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రెడ్యానాయక్
-
గిరిజనులకూ మూడెకరాలు
కేసీఆర్ ప్రకటన లంబాడీ యువతులకూ కల్యాణ లక్ష్మి టీఆర్ఎస్లోకి రెడ్యానాయక్, కవిత సాక్షి, హైదరాబాద్: భూమిలేని లంబాడీ, గిరిజన వ్యవసాయాధారిత కుటుంబాలకు కూడా మూడెకరాల భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దళిత, మైనారిటీ యువతులకు ఇచ్చినట్లుగానే.. గిరిజన, లంబాడీ యువతుల వివాహాల కోసమూ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో గిరిజనుల అభివృద్ధికోసం కృషి చేస్తున్నదని.. వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని వెల్లడించారు. దళిత, మైనారిటీ యువతులకు అందజేస్తున్న విధంగా గిరిజన, లంబాడీ యువతులకు కూడా కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చారు. రెడ్యానాయక్ వంటి సీనియర్ నాయకుడు టీఆర్ఎస్లో చేరడాన్ని చిల్లరమల్లర రాజకీయ చేరికగా చూడలేమని.. తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలనే రెడ్యానాయక్ చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా రాజకీయ విభేదాలేమైనా ఉంటే వాటిని మరిచిపోయి ముందుకు పోదామని.. సీనియర్ నాయకుడిగా అన్నివర్గాలను కలుపుకొని పోవాలని రెడ్యానాయక్‌కు సూచించారు. రాజకీయాల్లో ఎవరూ అభద్రతకు గురికావొద్దని, ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉంటాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కిషన్‌రావు, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి నేడు రెడ్యా నాయక్, కవిత
*కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం *వందలాది వాహనాల్లో హైదరాబాద్‌కు.. డోర్నకల్/మరిపెడ/మహబూబాబాద్ : కాంగ్రెస్‌కు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తమ అనుచరగణంతో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. డోర్నకల్ స్థానం నుండి కాంగ్రెస్ తరఫున ఆరు సార్లు పోటీ చేసి... ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రెడ్యానాయక్ గత నెల 30న తన కూతురుతో కలిసి హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు స్వయంగా ప్రకటించారు. అనంతరం మూడు రోజులుగా రెడ్యా, కవిత తమ తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో విస్తృత చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం నాలుగు మండలాల నుంచి ప్రజాప్రతినిథులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిపెడకు చేరుకుని... అక్కడి నుండి రెడ్యానాయక్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెలంగాణ భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన కూతురు కవితతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్బంగా రెడ్యా మాట్లాడుతూ మంగళవారం కేసీఆర్ సమక్షంలో తనతో పాటు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మం డల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల నుంచి నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 54 మంది ఎంపీటీసీ సభ్యులు, 35 మంది సర్పంచ్‌లు, ఆరుగురు సొసైటీ చైర్మన్లు, కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్, నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధన కోస మే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు రెడ్యానాయక్ తెలి పారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ జెండా కింద పనిచేస్తానన్నారు. 100 వాహనాల్లో వేలాది మందితో కలిసి చేరుతున్నట్లు తెలిపారు. రెడ్యా రాక సంచలనం.. ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కాంగ్రెస్‌ను వీడీ టీఆర్ఎస్లోకి చేరడం జిల్లాలోనే ఒక సంచలనమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్రావు అభిప్రాయపడ్డారు. రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్, నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య మరిపెడకు వచ్చారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతుండగా పెద్దలు తనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలకడం ఆనందంగా ఉందని రెడ్యా అన్నారు. సమావేశంలో నూకల నరేష్‌రెడ్డి, గుడిపుడి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్యా, యాదయ్య, కవితలకు షోకాజ్ నోటీస్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవితలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. గతంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుపై మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఇచ్చిన వివరణపై టీపీసీసీ సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై శుక్రవారం గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం కానుంది. -
హత్య చేశారు...ఆపై కాల్చేశారు
తుర్కపల్లి :ఆస్తి తగాదాలో... ఆర్థిక లావాదేవీలో కారణం ఏదో తెలియదు గానీ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి...ఆపై కాల్చేశారు. వివరాల్లోకి వెళితే...నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వీఆర్వో ఫిర్యాదు మేరకు బుధవారం పంచనామా నిర్వహించారు. అయి తే మృతదేహం పక్కనే దొరికిన సెల్ఫోన్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగా మృ తుడి వివరాలు తెలిశాయి. కేతావత్ రెడ్యానాయక్(32) సెక్యూరిటీ గార్డుగా నాచారం ఇండస్ట్రీయల్ ఏరియాలో పనిచేస్తున్నాడు. ఇతడిది బీబీనగర్ మండలం జంపల్లితండా. భార్య విజయలక్షి్ష్మతో కలిసి ఐదు సంవత్సరాలుగా నాచారంలో నివసిస్తున్నాడు. మృతుడి సోదరుడు జాహంగీర్ (38) మూసాపేటలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్లి.. చెల్లికి పెళ్లి సంబంధం చూడాలని జహ ంగీర్ మే 26వ తేదీన తమ్ముడు రెడ్యానాయక్‌ను వెంటబెట్టుకుని కారులో వెళ్లాడు. మల్లాపూర్ నుంచి తుర్కపల్లికి చేరుకున్నారు. భార్య విజయలక్ష్మి రాత్రి 7:30 గంటలకు రెడ్యాకు ఫోన్ చేయగా, వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నుంచి రెడ్యానాయక్ ఫోన్ పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చిన విజయలక్షి్ష్మ బావ జాహంగీర్‌కు ఫోన్ చేసింది. ఆయనా లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు ఉదయం విజయలక్షి తన బంధువులతో కలిసి బావ జహంగీర్ ఇంటికి వెళ్లి తన భర్త ఆచూకీ కోసం నిలదీసింది. ‘నాకు తెలియదు.....నావెంట రాలేదు 7 సంవత్సరాల నుంచి నాకు నా తమ్ముడికి మాటలు లేవంటూ’’ జహంగీర్ చెప్పాడు. దీంతో విజయలక్ష్మి నాచారం పోలీసులను ఆశ్రయించింది. వెంకటాపూర్ వద్ద లభ్యమైన శవం వద్ద ఉన్న సెల్‌ఫోన్ వివరాల ఆధారంగా నాచారం పోలీసులతో కలిసి ఆమె ఇక్కడకు వచ్చింది. శవం మెడలో ఉన్న ఆంజనేయస్వామి దండ, చేతికున్న తాడు, బట్టల ఆధారంగా మృతుడు తన భర్తేనని భార్య విజయలక్ష్మి గుర్తించింది. హత్య చేసి 40 రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి ఉంది, ఒక కాలు శవం నుంచి ఉండిపోయి ఉంది. చుట్టూ బీరుసీసాలు, మద్యం బాటిళ్లు ఉన్నాయి. కేసును నాచారం సీఐ అశోక్‌కుమార్, తుర్కపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి విచారిస్తున్నారు. ఆస్తికోసమే అంతమొందించాడు : మృతుడి భార్య రెడ్యానాయక్, జహంగీర్‌కు జంపల్లి గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జహంగీర్‌కు గ్రామం లో అప్పులు ఎక్కువ కావడంతో ఆ భూమిని విక్రయించాలని తమ్ముడితో ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యం లోనే తన భర్తను జహంగీర్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఉంటాడని మృతుడి భార్య విజయలక్ష్మి ఆరోపించింది.