
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను డోర్నకల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు కలిశారు. సత్యవతి రాథోడ్‌కు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత సీనియర్ లీడర్‌గా ఉన్నా.. తనకు మంత్రి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేయగా త్వరలోనే ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని కేటీఆర్ అనునయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment