MLA Redya Naik Shocking Comments Over BRS Party Leaders - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో ఇంటి దొంగలు.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్‌

Published Thu, Apr 6 2023 10:33 AM | Last Updated on Thu, Apr 6 2023 11:06 AM

MLA Redya Naik Shocking Comments Over BRS Party Leaders - Sakshi

కురవి: ‘బీఆర్‌ఎస్‌లో ఇంటి దొంగలున్నారు.. బీఆర్‌ఎస్‌ పేరు చెప్పి లక్షలు లక్షలు సంపాదించుకుంటూ నాయకులనిపించుకుంటున్నారు.. రేపు ఎట్లయినా రెడ్యానాయక్‌ను ఓడించాలని ప్రయత్నం చేస్తరు..’అంటూ డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఘాటుగా విమర్శించారు. 

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం మండల బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్‌ కవిత అధ్యక్షతన జరిగింది. సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా రెడ్యానాయక్‌ మాట్లాడుతూ తనను ఓడించాలని ఎంతోమంది మహామహులు తిరిగి ప్రచారం చేశారని చెప్పారు. మరి కొందరైతే ఆ గర్భశత్రువులేనని.. తనను చూస్తే వాళ్లకు నిద్రపట్టదని.. ఎప్పుడు చస్తాడా? పోతాడా.. అనుకుంటున్నారని పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement