తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్తుందా?: కవిత | Mlc Kavitha Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్తుందా?: కవిత

Published Thu, Jan 30 2025 8:24 PM | Last Updated on Thu, Jan 30 2025 9:09 PM

Mlc Kavitha Comments On Revanth Reddy

సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయని.. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది?. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత ప్రశ్నించారు.

‘‘కాంగ్రెస్‌ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దీదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు’’ అని కవిత దుయ్యబట్టారు.

‘‘కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్లకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలించలేరు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందా? ఎప్పుడు పోతుందా? అన్నది తెలియని దుస్థి తి ఏర్పడింది. చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

..కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి?. తెలంగాణను ఆంధ్రతో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర. కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారు. కేసీఆర్ హయాంలో నేరుగా లబ్దీదారులకే కోట్లాది రూపాయలు వెళ్లాయి

..కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. బీఆర్ఎస్‌ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చేశామని చెప్పడమే తప్పా ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ్యతకు గురికావడం బాధాకరం. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement