Backlash
-
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు? ఏ ఊరుకు వెళ్లినా ఇదే కథ!
-
ఎమ్మెల్యే సాబ్! ఏం చేశావో జర జెప్పు?
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ తప్పడం లేదు. కురివి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండాను తట్టినా ఎమ్మెల్యే ను గిరిజనులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బాలుతండాకు చేరుకున్న ఎమ్మెల్యే ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మా గ్రామానికి ఏం చేశావో చెప్పాలని తండవాసులు నిలదీశారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కారులను ప్రక్కకు నెట్టేయడంతో గ్రామస్థులు పోలీసులపైకి తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ మౌనంగా పోలీస్ బందోబస్తు మధ్య ముందుకు వెళ్ళిపోయారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళ్ళినా విపక్షాల తోపాటు స్వపక్షానికి చెందిన వారు నిలదీసి అడ్డుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తుంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలే ఆందోళనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!) -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత.. తీవ్ర విమర్శలు
వైరల్: సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్‌ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. ఉక్రెయిన్-రష్యా సైనికులు కౌగిలించుకున్నట్లు ఓ కుడ్యచిత్రంను(మ్యూరాల్) మెల్బోర్న్(ఆస్ట్రేలియా)నగరంలో ప్రదర్శించారు. పీటర సీటన్ అనే ఆర్టిస్ట్.. ఇరు దేశాల మధ్య శాంతియుత ప్రయత్నాలను ప్రతిబింబించేలా ఒకరాత్రంతా కష్టపడి దానిని వేశాడు. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఉక్రెయిన్ రాయబారి వసైల్ మైరోష్నిచెంకో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్ర వాస్తవికతను వక్రీకరించే ప్రయత్నమంటూ మండిపడ్డారాయన. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశమే. అది గీసిన ఆర్టిస్ట్‌కు బహుశా రష్యా ఆక్రమణ గురించి ఏమాత్రం అవగాహన లేకపోయి ఉండొచ్చు. రష్యాను శాంతికాముక దేశంగా చిత్రీకరించే యత్నం చేయడం దుర్మార్గం. వేలమందిని బలిగొన్న ఈ మారణహోమంపై ఇలాంటి చిత్రం.. కలలో కూడా ఈ ఊహ సరికాదు. ఉక్రెయిన్ కమ్యూనిటీ సంప్రదించకుండా దానిని ప్రదర్శించడం విచారకరం అంటూ ట్విటర్లో షేర్ చేశారాయన. వీలైనంత త్వరగా దానిని తొలగించాలని డిమాండ్ చేశారాయన. మరోవైపు ప్రముఖ సోషియాలజిస్ట్ ఓల్గా బోయ్చక్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు. నిందితుడిని-బాధితుడిని ఒకేలా చూపించే ప్రయత్నం సరికాదని, దీని వెనుక ఏదైనా గూఢపుఠాణి ఉండొచన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ ఆర్ట్‌వర్క్‌కు పాజిటివ్ కామెంట్లు, లైకులు దక్కినప్పటికీ.. విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో దానిని తొలగించారు సీటన్. అంతేకాదు.. దీనిని నెగెటివ్‌గా తీసుకుంటారని తాను అనుకోలేదని చెబుతూ.. క్షమాపణలు తెలియజేశారు. ఇదీ చదవండి: కత్తి దూసిన ఉన్మాదం.. పదిమంది దారుణహత్య -
బుసకొట్టిన జాతి విద్వేషం
బఫెలో/షికాగో(యూఎస్): అమెరికాలో జాతి విద్వేషం మరోసారి బుసలు కొట్టింది. నల్లజాతి ప్రజలే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేతజాతి యువకుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది బలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. బఫెలో నగరంలోని టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో శనివారం ఈ దారుణం జరిగింది. ఇది జాతి విద్వేషపూరిత హింసాత్మక తీవ్రవాదమేనని పోలీసు అధికారులు అన్నారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్లో ప్రధానంగా నల్ల జాతీయులు షాపింగ్ చేస్తుంటారు. ఇందులో పనిచేసే వారంతా నల్లజాతి కార్మికులే. సైనిక దుస్తులు, తూటా కవచం, హెల్మెట్ కెమెరా ధరించి వచ్చిన యువకుడు మార్కెట్ బయట హఠాత్తుగా రైఫిల్‌తో నలుగురిపై కాల్పులు జరిపాడు. లోపలికి వెళ్లి కనిపించినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎదురు కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డునూ కాల్చేశాడు. ఇదంతా ‘ట్విచ్’ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమైంది! పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నల్ల జాతీయులపై, ఇద్దరు శ్వేత జాతీయులపై కాల్పులు జరిపాడని చెప్పారు. అతడిని న్యూయార్క్‌లోని కాంక్లిన్‌కు చెందిన పేటన్ గెన్డ్రాన్గా గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. శ్వేతజాతి అహంకారంతో అమాయకులను బలితీసుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ చెప్పారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. షికాగో కాల్పుల్లో బాలుడి మృతి అమెరికాలో షికాగోలోనూ దారుణం జరిగింది. మిలీనియం పార్కులో శనివారం దుండగుడి కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇద్దరు అనుమానితులను పట్టుకుని రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు!
రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. అసలేం జరిగింది? శుక్రవారం మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు. అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్ అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. కివీస్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు ఈ నెల 11న ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్ పదవి చేపట్టిన రమీజ్ రాజా న్యూజిలాండ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్లో ప్రకటించారు. మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ వచ్చే నెల పాక్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. -
జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన రెండు ప్రకటనలను ఆగస్టు 26న విడుదల చేసింది. దీంతో ఈ యాడ్స్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగింది. జొమాటో డెలివరీ కార్మికుల పట్ల ఇంత అన్యాయమా అంటూ నెటిజన్లు జొమాటోపై విరుచుకుపడ్డారు. దీంతో జొమాటో స్పందించింది. ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అంటూ ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టింది. తమ తాజా ప్రకటనలను దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకున్నారం టూ జొమాటో ఒక ప్రకటన విడులల చేసింది. తమ ఉద్యోగులను హీరోలుగా నిలబెట్టడంతోపాటు, డెలివరీ భాగస్వాములతో గౌరవంగా మాట్లాడటం, డెలివరీ ఉద్యోగి గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రతి కస్టర్ తమకొక స్టార్ అని పునరుద్ఘాటించడమే ముఖ్య ఉద్దేశమని అని కంపెనీ తెలిపింది. బాలీవుడ్ స్టార్లు హృతికి రోషన్, కత్రినా కైఫ్‌తో యాడ్స్ వివాదానికి సంబంధించిన ప్రకటనలను పరిశీలిస్తే..హృతిక్ రోషన్ నటించిన జోమాటో యాడ్‌లో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు జొమాటోబాయ్ కస్టమర్( హృతిక్) డోర్‌బెల్ బెల్ మోగిస్తాడు. హృతిక్ రోషన్‌ను చేసిన అతను ఆశ్చర్యపోతాడు. ఇంతలో బాలీవుడ్ స్టార్ అతడిని సెల్ఫీ కోసం వేచి ఉండమంటాడు. దీనికి డెలివరీ బాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కానీ ఇంతలోనే ఫోన్ రింగ్ అవుతుంది. తరువాతి డెలివరీ చేయాల్సిన మరో ఆర్డర్‌కు సంబంధించి కాల్ అది. దీంతో రోషన్‌తో సెల్ఫీ ఛాన్స్ వదులుకొని, మరో ఆర్డర్ డెలివరీకి బయలుదేరతాడు సంతోషంగా. "హృతిక్ రోషన్ హో, యా ఆప్, అప్నేలియే హర్ కస్టమర్ హై స్టార్ (హృతిక్ రోషన్ అయినా,మీరైనా, ప్రతీ కస్టమర్ జోమాటోకి స్టార్) అంటూ యాడ్ ముగుస్తుంది.(Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి) కత్రినా కైఫ్ నటించిన యాడ్‌లో కూడా ఇలాంటి సందేశమే ఉంటుంది. బర్త్‌డే కేక్ డెలివరీ ఇచ్చిన బాయ్‌ని కేక్ తిందువు ఉండమని అభ్యర్థిస్తుంది కత్రినా. ఇంతలో మరొక ఫుడ్ ఆర్డర్ కోసం నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడే జొమాటోకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల పట్ల ఇంత అన్యాయమా, ఇలాంటి ఆనందాలనువారికి దూరం చేస్తారా అంటూ నెటిజన్లు మండి పడ్డారు. డెలివరీ బాయ్‌లకు నిమిషం వ్యవధి కూడా ఇవ్వరా అంటూమరికొంతమంది విమర్శించారు. అంతేకాదు వారికి సరియైన వేతనాలు చెల్లించడం కంటే కంపెనీ సెలబ్రిటీలతో ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జొమాటో స్పందించింది. చాలామంది తమ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించారని, అయితే కొంతమందికి మాత్రమే నచ్చలేదని తెలిపింది. ఇవి ఆరు నెలల క్రితం తయారు చేసినవని వివరించింది. అలాగే తమ డెలివరీ పార్టనర్ల చెల్లింపులపై త్వరలోనే ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురిస్తామని తెలిపింది. తమ డెలివరీ పార్టనర్ నెట్ ప్రమోటర్ స్కోర్ 10నుంచి 28 శాతానికి పెరిగిందని ఇది ఇంకా పెరుగుతూనే ఉందని జొమాటో పేర్కొంది. (taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు) The other side of the story... pic.twitter.com/hNRj6TpK1X — zomato (@zomato) August 30, 2021 -
మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు
రోజులు గడుస్తున్న కొద్దీ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నీచ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటి వరకు ఆడవారికే భద్రత కరువుతుందనుకుంటున్న నేటీ కాలంలో జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓ మేకపై, కామంతో కళ్లు ముసుకుపోయిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానవీయ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఒకారా జిల్లాలోని ఓ కార్మికుడు ఇంటి ముందు ఉన్న కాంపౌండ్‌లోని మేకను అపహరించిన అయిదుగురు వ్యక్తులు దానిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత మేకను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోవడం స్థానికుల కంటపడింది. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారింది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ.. ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్తానీ నటి మథిర.. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. జంతువులకు కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు పేల్చారు. మరొకరు...‘నగ్న జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా? ఇప్పుడు మన అందమైన ప్రధాని... మేకలను కూడా పూర్తి దుస్తులు ధరించాలని అడుగుతాడు. ఎందుకంటే చుట్టుపక్కల వారిని చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు.. అమాయకులైన పురుషులు రోబోలు కాదు కదా’. అంటూ చురకలంటించారు. కాగా గత నెలలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మహిళల దుస్తులపై తీవ్రంగా కామెంట్ చేశారు. ఆడవారు పూర్తిగా వస్త్రాలు ధరించాలని, వారి వేషధారణ ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉండకూడదని వ్యాఖ్యానించారు. మహిళల పొట్టి బట్టలు చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు మగవారేం రోబోలు కాదు అంటూ పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దూమారమే రేగింది. -
జెఫ్ బెజోస్‌కు ఊహించని ఎదురు దెబ్బ!
సాక్షి,న్యూఢిల్లీ: రోదసీ యాత్ర పూర్తి చేసుకుని ఫుల్ ఖుషీగా ఉన్న ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన స్పేస్ టూర్ విజయవంతమైనందుకు అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు బెజోస్. ఇందులో ఇబ్బంది ఏముంది అంటారా? ఇక్కడే ఉంది ట్విస్ట్. ప్రపంచ బిలియనీర్‌గా ఉన్నా బెజోస్ పన్నులు చెల్లించకుండా..ప్రజల సొమ్ముతో టూర్‌కు వెళ్లొచ్చావు అన్నట్టుగా రాజకీయ ప్రముఖులు, నెటిజన్ల నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమెజాన్ సంస్థ బ్లూ ఆరిజిన్ ఆధ్వర్యంలో రాకెట్ నిర్మాణం, అంతరిక్ష ప్రయాణం దీని ఖర్చంతా మీరే చెల్లించారంటూ స్వయంగా బెజోసే వెల్లడించడంతో ఆయనకు దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చింది. ప్రతి అమెజాన్ ఉద్యోగికి, ప్రతి అమెజాన్ కస్టమర్‌కూ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరే వీటన్నింటికీ చెల్లించారు" అని బెజోస్ తన టూర్ ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. సీరియస్లీ.. మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. తక్కువ జీతాలు, దారుణమైన, అమానవీయ ఆఫీసు వాతావరణం, కరోనా మహమ్మారి సమయంలో కూడా డెలివరీ డ్రైవర్లకు ఆరోగ్య బీమా లేకుండా అమెజాన్ ఉద్యోగులే ఇదంతా భరించారంటూ అమెరికా చట్టసభ ప్రతినిధి లెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారంటూ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ట్వీట్ చేశారు. కానీ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్పడం మాత్రం మరచిపోయాంటూ మండిపడ్డారు. మరోవైపు కెనడాలోని న్యూడెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా బెజోస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 11 నిమిషాల్లో బెజోస్ యాత్ర ముగిసింది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ప్రతి 11 నిమిషాలకు (16 లక్షల డాలర్లు) మిలియన్ల డాలర్లు మూటగట్టుకుని మరింత కుబేరుడిగా అవతరించాడని వ్యాఖ్యానించారు. అమెజాన్‌పై ఎలాంటి పన్నులు లేకుండా అనుమతించిన ప్రధాని జస్టిన్ ట్రూడో చలవే ఇదంతా అని ట్వీట్ చేశారు. కాగా బిలియనీర్ బెజోస్పై అమెరికాలో పన్ను ఎగవేత ఆరోపణలు అమెజాన్ ఉద్యోగులకు తగిన జీతాలు చెల్లించకపోడం, ప్రమాదకరమైన పని పరిస్థితులు, భోజన, వాష్‌రూం విరామాలను కూడా తీసుకోనీయకుండా వేధింపులకు పాల్పడుతోందంటూ చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జెఫ్ బెజోస్ మంగళవారం 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. Yes, Amazon workers did pay for this - with lower wages, union busting, a frenzied and inhumane workplace, and delivery drivers not having health insurance during a pandemic. And Amazon customers are paying for it with Amazon abusing their market power to hurt small business. https://t.co/7qMgpe8u0M — Alexandria Ocasio-Cortez (@AOC) July 20, 2021 Yes, Amazon workers did pay for this - with lower wages, union busting, a frenzied and inhumane workplace, and delivery drivers not having health insurance during a pandemic. And Amazon customers are paying for it with Amazon abusing their market power to hurt small business. https://t.co/7qMgpe8u0M — Alexandria Ocasio-Cortez (@AOC) July 20, 2021 Jeff Bezos's space flight lasted 11 minutes During the pandemic, every 11 minutes, he got about 1.6 million dollars richer All while, Justin Trudeau allowed Amazon to pay $0 in taxes It's time the ultra-rich pay their fair sharehttps://t.co/uhILFSSfxw — Jagmeet Singh (@theJagmeetSingh) July 20, 2021 -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
రెహమాన్‌కి కోపమొచ్చింది
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి కోపమొచ్చింది. దానికి కారణం ఓ రీమిక్స్ పాట. ‘ఢిల్లీ6’ సినిమా కోసం ‘‘మసక్కలీ మసక్కలీ..’ అనే పాటను రెహమాన్ కంపోజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ పాట బ్లాక్ బస్టర్. సినిమా క్రేజ్‌ని రెండింతలు చేసిన పాట అది. తాజాగా ‘మసక్కలీ 2.0’ అంటూ ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బగ్చి రీమిక్స్ చేశారు. ‘నాకు రీమిక్స్ పాటల సంçస్కృతి నచ్చదు’ అని పలు సందర్భాల్లో రెహమాన్ చెప్పారు. తాజాగా ఈ ‘మసక్కలీ 2.0’ ఆయన్ను అసహనానికి గురి చేసినట్టుంది. అందుకే తన ట్వీటర్లో ‘ఒరిజినల్ పాటల్నే ఎంజాయ్ చేయండి’ అని ట్వీట్ చేశారు. అలాగే ‘ఎన్నో నిద్ర లేని రాత్రులు పాటల్ని రాస్తూ, నచ్చకపోతే మళ్లీ రాసి, సుమారు 200 మంది సంగీత కళాకారులు 365 రోజులు గొప్ప సంగీతాన్ని అందించాలని కృషి చేస్తేనే తరాలు నిలబడే పాట పుడుతుంది’ అని చిన్న లేఖ కూడా జత చేశారు. అది మాత్రమే కాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కోపాన్ని నియంత్రించుకునేవారే నిజమైన మనిషి’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు. సాధారణంగా చాలా సౌమ్యంగా ఉండే రెహమాన్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారంటే ఆయన ఎంత అప్ సెట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. -
హిందీపై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది. శనివారం విడుదలయిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని ప్రతిపాదించారు.దీనిపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను సోమవారం విడుదల చేసింది.‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. హిందీయేతర ప్రాంతాల్లో హిందీని తప్పనిసరి భాషగా బోధించాలని ఇంతకు ముందు ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిని తమిళనాడులోని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఐదు దశాబ్దాలుగా ద్విభాషా సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం పేరుతో తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే సహించబోమని డీఎంకే నేత స్టాలిన్ హెచ్చరించారు. బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే కూడా ఈ ప్రతిపాదనను తొలగించాలని డిమాండు చేసింది. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది విధానం రూపొందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పినా వ్యతిరేకత ఆగలేదు. దాంతో ఆ ప్రతిపాదనను తొలగించి కొత్త ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. హిందీ నిబంధనను తొలగించడం పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీ అధినేత కరుణానిధి సజీవంగానే ఉన్నారనడానికి కేంద్రం సవరణే నిదర్శనమన్నారు. కరుణానిధి 95వ జయంతి సందర్భంగా స్టాలిన్ పార్టీ జిల్లా కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం ప్రతిపాదనను తిరస్కరిస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది. జాతీయ విద్యా విధానం ముసాయిదా నుంచి హిందీ తప్పనిసరి నిబంధనను తొలగించడం పట్ల కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ఫలానా భాష వల్ల తనకు లాభముందని అనుకుంటే ఆ భాష నేర్చుకోవచ్చని అంతేకాని వారిపై బలవంతంగా ఏ భాషనూ రుద్దరాదని హైదరాబాద్‌లో అన్నారు. గతంలో త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు, దానికెదురైన వ్యతిరేకతలను ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిన హిందీ భాషను ప్రచారం చేస్తున్న దక్షిణ హిందీ ప్రచార సభను మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. బలవంతంపు హిందీ భాష ప్రతిపాదనను తొలగించడం పట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతోషం వ్యక్తం చేశారు.‘ త్రిభాషా సిద్ధాంతం అవసరం లేదు. మాకు కన్నడ, ఇంగ్లీషు ఉన్నాయి. అవి చాలు. కన్నడకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’అని మైసూరులో అన్నారు. -
పాక్‌లో ఇమ్రాన్‌కు షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికలు ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ ఇచ్చాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి పార్లమెంట్లో తన బలాన్ని‡ పెంచుకుంది. జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ ఐదు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఇమ్రాన్ గెలుపొందిన నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. లాహోర్, బన్ను స్థానాల్లో పీటీఐకి ఓటమి ఎదురైంది. పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎన్ఏ–124 లాహోర్ స్థానంలో పీటీఐ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. పీఎంఎల్–నవాజ్, పీటీఐలు చెరో నాలుగు జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయని పాక్ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. -
వీగిపోయిన అమెరికా వలస బిల్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఓటింగ్‌కు ముందు ట్రంప్ ఇరు పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు ఓటమిపాలైందని డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్ షూల్టె అన్నారు. చట్టబద్ధంగా వలసొచ్చే వారికి తాజా బిల్లు ప్రతికూలంగా మారిందని, వలస కుటుంబాలు, వారి పిల్లల నిర్బంధాన్ని సమర్థించేలా ఉందన్నారు. -
బీజేపీ దూకుడుకు బ్రేక్?
న్యూఢిల్లీ: కర్ణాటకలో మూడు రోజులకే బీజేపీ సర్కారు పతనమవడం 2019 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా మారనుందా? ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు నెలకొంటుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి మంచి పట్టున్న ప్రాంతాలే కాకుండా, దేశంలోని ఇతర భాగాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలన్న మోదీ ఆలోచనకు కర్ణాటక రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి బలం ఉండగా ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ అంతంత మాత్రంగా ఉంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారం దక్కించుకోలేక పోయిందనీ, 2019లో మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నికవ్వకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టే అవకాశాలను ఇది మరింత ఎక్కువ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమైనందుకు నేను గర్విస్తున్నాను. ఈ దేశంలో అహంకారానికి ఓ హద్దుంటుంది. బీజేపీ, ఆరెస్సెస్‌లు ఈ ఓటమి నుంచైనా ఆ విషయాన్ని గ్రహిస్తాయని అనుకుంటున్నా’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అత్యధిక స్థానాలను బీజేపీ దక్కించుకున్నా అధికారం చేపట్టలేకపోవడం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందనీ, కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా బీజేపీ దూకుడుకు బ్రేక్ పడినట్లేనని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. -
కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు
సియోల్ : దక్షిణ కొరియా స్కేటర్లపై అభిమానులు భగ్గుమంటున్నారు. సెమీ-ఫైనల్ క్వాలిఫైయింగ్ రేసులో ఓడిపోయి వింటర్ ఒలంపిక్స్ నుంచి టీమ్ నిష్క్రమించింది. అయితే వారు ఓటమి గురించి ఆటగాళ్లపై మండిపడటం లేదు. టీమ్ సభ్యురాలైన నో సెయాన్-యెయాంగ్పై మిగతా సభ్యులు లైవ్‌లోనే విమర్శలు చేసినందుకు... సోమవారం 500 మీటర్ల క్వాలిఫైయింగ్ రేసులో కిమ్ బో-రెమ్ నేతృత్వంలో బృందం పాల్గొంది. అయితే రేసులో కిమ్, మరో ప్లేయర్ పార్క్ జీ-వూ లు దూసుకుపోగా.. నో సెయాన్ మాత్రం వెనకబడిపోయింది. చివరకు రేసులో సౌత్ కొరియా టీమ్ ఓటమి పాలైంది. దీనిని జీర్ణించుకోలేక నో సెయాన్ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే టీమ్ సభ్యులు మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. కిమ్, పార్క్‌లు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ‘మేం మా ఆట సరిగ్గానే ఆడాం. కానీ, నో సెయాన్ విఫలమైంది. చాలా చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఆమె మూలంగానే ఓటమి చెందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై చూసిన దక్షిణ కొరియా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపొటములు సహజమని.. అంత మాత్రానికి తోటి క్రీడాకారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని వారంటున్నారు. అంతేకాదు కిమ్, పార్క్‌లను తక్షణమే నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్‌ను రూపొందించారు. దానిని అధ్యక్ష కార్యాలయ అధికారిక సైట్‌కు పొందుపరచగా... దీనిపై ఇప్పటిదాకా దాదాపు 2,50,000 మంది సంతకాలు చేశారు. అయితే వారిద్దరిపై నిషేధం విధించే అంశంపై మాత్రం దక్షిణ కొరియా క్రీడా శాఖ, ఒలంపిక్స్ కమిటీ స్పందించలేదు. -
లండన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
-
అగ్రనేతలే లక్ష్యంగా..
- పోలీసుల మెరుపుదాడి - తప్పించుకున్న మావోయిస్టులు - నడింవీథి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు గూడెంకొత్తవీధి: మన్యంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ అగ్రనేతలు లక్ష్యంగా పోలీసులు జరిపిన మెరుపుదాడిలో మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఏజెన్సీలోని జీకేవీధి మండలం సిరిబాల అటవీ ప్రాంతంలో రెండు మూడు రోజులుగా గిరిజనులతో సమావేశమవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెడ పట్టాయి. నడింవీధి అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి గాలిస్తున్న పోలీసులకు సమావేశం ముగించుకొని వస్తున్న దళసభ్యులు తారస పడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. చీకటిగా ఉండటంతో మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇరువర్గాల ఎదురుకాల్పుల్లో భారీ నష్టం జరిగిందనే ప్రచారం సాగింది. సంఘటన ప్రదేశం మారుమూల ప్రాంతం కావడం, రాత్రి సమయంతో పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.పోలీసులు శనివారం ఉదయం ఆ ప్రాంతంలో గాలించగా దళసభ్యులకు సంబంధించిన సామగ్రి దొరికింది. 303 తుపాకీ, 3 కిట్‌బ్యాగులు, 2 మందుపాత్రలు, 12 రౌండ్ల తూటాలు, మావోయిస్టుల దుస్తులు, కత్తులు, మందుపాత్రకు ఉపయోగించే వైరు బండిల్, తొడుగులు, మాత్రలు, విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. తప్పిన ముప్పు..: మావోయిస్టులకు పెను ముప్పు తప్పింది. రాత్రిపూట కాల్పులతో తప్పించుకున్నారు. మన్యంలో బాక్సైట్ ఉద్యమం ఉధృతం చేసే క్రమంలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనేపథ్యంలో గత నెల 26న ఒడిశా జాంబాయ్ వద్ద కూంబింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ బలగాలపై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లోకి వారు మకాం మార్చినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు గ్రామాల్లో గిరిజనులతో దళసభ్యులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు లేఖలతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాక్సైట్ ఉద్యమం ఉధృతికి సన్నాహాలు ముమ్మరం చేశారు. ఒకే ప్రాంతంలో రెండు మూడు రోజులుగా ఉంటూ గిరిజనులతో భారీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దళసభ్యులతోపాటు, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు భావించిన పోలీసులు తమదైన శైలిలో శుక్రవారం రాత్రి గాలింపు ముమ్మరం చేశారు. పక్కా సమాచారంతోనే గాలింపు జీకేవీధి/చింతపల్లిరూరల్: ఏజెన్సీలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతోనే గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. శనివారం జీకేవీధి, చింతపల్లి పోలీసు స్టేషన్లను సందర్శించారు. అనంతరం పోలీసు అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత నెల 26న ఒడిశాలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి అనంతరం దళసభ్యులు బృందాలు గాలికొండ ఏరియావైపు వచ్చినట్టు సమాచారం ఉందన్నారు. దీంతో గాలింపు చేపట్టామన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. అంతకు ముందు జీకేవీధి నుంచి ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశానికి బైక్‌పై వెళ్లారు. సంఘటన చోటు చేసుకున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనలో మావోయిస్టులకు గట్టిదెబ్బ తగిలేదని, చీకటి కావడంతో తమ బలగాల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్టుఎస్పీ తెలిపారు. ఈ సంఘటనలో ఒకరిద్దరు దళసభ్యులకు గాయాలయినట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు వదిలి వెళ్లిన సామాగ్రిని పరిశీలించారు. ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా స్థానిక సీఐ,ఎస్పీ ఆ ప్రాంతంలో పర్యటించడం పలువురిని ఆశ్ఛర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఏఎస్పీ సత్య ఏసుబాబు, సీఐ వెంకటరావు, స్థానిక సీఐ రుద్రశేఖర్, ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.