ఆధార్ లింకింగ్ అంశంపై సుప్రీంకోర్టు మరో ఊరట కల్పించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది. ఆధార్‌లింక్‌పై బుధవారం విచారించిన సుప్రీం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఈ విషయంపై వాదనలు వినడానికి అంత తొందర ఏమీలేదని ధర్మాసనం పేర్కొంది.