పాన్ కార్డు పొందాలంటే ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జత చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ఐచ్ఛికంగానే ఉపయోగించాలని గతంలోనే తాము సూచించినప్పటికీ, తప్పనిసరి చేయడంపై జస్టిస్ ఏకే శిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.