Dec 31
-
పాన్– ఆధార్ లింకింగ్ గడువు తేదీ డిసెంబర్ 31
న్యూఢిల్లీ: పాన్ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంశానికి గడువు తేదీని ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
డిసెంబర్ 31 రాత్రి పోలీసులంతా రోడ్లపైనే..
సాక్షి, హైదరాబాద్ : ప్రతి ఏడాదిలాగే రాత్రి ఒంటిగంట తరువాత న్యూ ఇయర్ వేడులు జరపకూడదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అన్ని హోటల్స్, పబ్స్ యజమానులకు నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వేడుకలు జరిపే ప్రతిచోటా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టామన్నారు. డిసెంబర్ 31న నగరంలోని ఫ్లైఓవర్లు బంద్ చేయనున్నట్టు అంజని కుమార్ పేర్కొన్నారు. ఆరోజు పోలీసులు అందరూ రోడ్లపైనే డ్యూటీలో ఉంటారని చెప్పారు. మైనర్లు మద్యం సేవించినా, అమ్మినా కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం అయిందన్నారు. సీఎస్ ఆదేశాల మేరకు రాష్టప్రతికి భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలందరికి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను అందంగా జరుపుకోవాలన్నారు. -
ఈ నెల 31న అన్ని ఫ్లైఓవర్లు బంద్
హైదరాబాద్ : నగరంలో ఈ నెల 31వ తేదీన సైబరాబాద్, హైద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. 31న నైట్ సెలెబ్రేషన్స్ రాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామని, మొత్తం 120 టీమ్‌లు బ్రీత్ అనలైజర్లతో సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే స్పీడ్ లిమిట్ తప్పనిసరి అని, అతి వేగంతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు. -
రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 వరకు..
సాక్షి, సిటీబ్యూరో: నయాసాల్ వేడుకల నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం సరికొత్త వ్యూహం రచించింది. డిసెంబర్ 31న రాత్రి డ్రంకన్ డ్రైవింగ్‌కు చెక్‌పెట్టి ప్రమాద రహితంగా చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఆరోజు రాత్రంతా తనిఖీలు చేయనున్నట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ ఏవీ రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఈ తనిఖీలు రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు మాత్రమే సాగుతాయి. అయితే డిసెంబర్ 31న దృష్టిలో పెట్టుకుని డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను ఆదివారం 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దాదాపు ప్రతి వారాంతంలోనూ ఈ తనిఖీలు చేపడుతున్నారు. అయితే సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఠాణాల వారీగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ట్రాఫిక్ టీమ్స్ తనిఖీలు చేస్తాయి. ఆదివారం మాత్రం ఒకే చోట పనిచేసే స్టాటిక్ బృందాలతో పాటు నగర వ్యాప్తంగా సంచరిస్తూ అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు చేయడానికి అనువుగా మొబైల్ టీమ్స్, వాహన చోదకుల్లో కలిసి సంచరిస్తూ, డ్రైవింగ్ చేస్తున్న మందుబాబులను పట్టుకోవడానికి ‘డెకాయ్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద నగర వ్యాప్తంగా 100 బృందాలు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డీసీపీ తెలిపారు. ఇవి ప్రధానంగా నగర శివార్ల నుంచి నగరంలోకి దారితీసే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. ఇప్పటి వరకు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు కేవలం ప్రధాన రహదారులకే పరిమితమయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి మాత్రం గల్లీల పైనా దృష్టి పెడుతున్నామని, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు మోహరిస్తామని రంగనాథ్ తెలిపారు. ఎవరైనా మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతూ చిక్కితే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు తక్షణం వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటారు. సేఫ్ న్యూ ఇయర్ వేడుకలే తమ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ‘‘ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన మందుబాబుల సంఖ్య 2015లో 2,500, 2016లో 7,500గా ఉంది. ఈ ఏడాది అది 9 వేలకు పెరిగినట్టు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఒకరోజు నుంచి 15 రోజుల వరకు జైలుకు వెళ్లిన మందుబాబుల డేటాను ఆధార్ ఆధారంగా నమోదు చేసి డేటాబేస్‌లో పొందుపరుస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తలో జాబ్ వెరిఫికేషన్, వీసా, పాస్‌పోర్ట్ జారీల్లో ఇబ్బందులు ఎదురవుతాయని డీసీపీ రంగనాథ్ తెలిపారు’’ -
‘సన్నీ లియోన్’ షోకు అనుమతి ఇవ్వం
బెంగళూరు: బెంగళూరులో డిసెంబర్ 31న జరిగే కొత్త ఏడాది వేడుకల్లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పాల్గొననున్న ఓ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదికే(కేఆర్వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీ వేడుకపై ఆందోళనల∙నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని నేను అధికారుల్ని ఆదేశించాను. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్ నిర్వాహకులు చేపట్టాలి’ అని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఆధార్ అనుసంధానంపై ఊరట
-
ఆధార్ అనుసంధానంపై ఊరట
న్యూఢిల్లీ: ఆధార్ లింకింగ్ అంశంపై సుప్రీంకోర్టు మరో ఊరట కల్పించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది. ఆధార్‌లింక్‌పై బుధవారం విచారించిన సుప్రీం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఈ విషయంపై వాదనలు వినడానికి అంత తొందర ఏమీలేదని ధర్మాసనం పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్‌ను గడువును పొడిగించాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా బెంచ్, జస్టిస్ అమితావ రాయ్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం ఆధార్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘింఘనపై తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. నవంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ ఉంటుందని ఖాన్విల్కర్ చెప్పారు. కాగా వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వివిధ పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు .కేంద్రం ప్రభుత్వం గతంలోజారీ చేసిన ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్ లింకింగ్ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువు డిసెంబర్ 31వరకు పొడిగించినట్టయింది.