పాన్‌– ఆధార్‌ లింకింగ్‌ గడువు తేదీ డిసెంబర్‌ 31 | Dec 31 last date to link PAN-Aadhaar Link | Sakshi
Sakshi News home page

పాన్‌– ఆధార్‌ లింకింగ్‌ గడువు తేదీ డిసెంబర్‌ 31

Published Mon, Dec 16 2019 2:23 AM | Last Updated on Mon, Dec 16 2019 2:23 AM

Dec 31 last date to link PAN-Aadhaar Link - Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్‌ కార్డును పొంది ఉండి, ఆధార్‌ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్‌ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్‌లోని అంశానికి గడువు తేదీని ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30గా ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement