మీకు పాన్ కార్డు ఉందా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. కేంద్రం ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించి ఒక కొత్త నిబంధనను అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. కేంద్ర పేర్కొన్న గడువు తేదీలోగా మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింకు చేయాల్సి ఉంటుంది. అయితే, గత ఏడాది ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడగించినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు తేదీని పొడగించినట్లు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు.
రూ. 10వేల జరిమానా..!
పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 లోపు ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం.. సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
- ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేసుకొని Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
- ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment