
పాన్ కార్డుదారులకు అలర్ట్. గతంలో మార్చి 31 వరకు ఉన్న ఆధార్-పాన్ లింకు గడువును కేంద్రం కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 30 వరకు పొడగించింది. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. గతంలో మాదిరి ఈసారి పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులు, ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి.
పాన్ ప్రధానంగా ఎక్కడ అవసరం?
- మోటార్ వేహికల్ లేదా టూ వీలర్ కాకుండా ఏదైనా వేహికల్ ని అమ్మలన్న లేదా కొనాలన్న ఆధార్ తప్పనిసరి.
- బ్యాంకింగ్ కంపెనీ/సహకార బ్యాంకులో ఖాతా తెరవడం.
- క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి.
- డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీల కస్టోడియన్ లేదా డీమ్యాట్ ఖాతాతెరవడం కోసం పాన్ తప్పనిసరి.
- ఒక హోటల్ లేదా రెస్టారెంట్ లో రూ.50,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లించాలంటే.
- ఏ విదేశీ దేశానికైనా సంబంధించి రూ.50,000 మించి నగదు రూపంలో చెల్లించాలంటే.
- డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి ఒక కంపెనీ లేదా సంస్థకు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయడానికి రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే.
- బ్యాంకు డ్రాఫ్ట్ లు, పే ఆర్డర్లు లేదా బ్యాంకింగ్ కంపెనీ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి బ్యాంకర్ చెక్కుల కొనుగోలు కొరకు ఏదైనా ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తానికి నగదు రూపంలో చెల్లించడం కోసం ఆధార్ తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment