PAN-Aadhaar Linking Deadline Extended? Income Tax Department Comes Out To Help PAN Holders - Sakshi
Sakshi News home page

ఆధార్‌-ప్యాన్‌ లింక్‌ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన

Published Sat, Jul 1 2023 10:21 AM | Last Updated on Sat, Jul 1 2023 11:32 AM

PAN Aadhaar Linking IncomeTax Department Comes Out To Help PAN Holders - Sakshi

ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్‌కు గడువు నిన్నటి(జూన్‌ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో సమాచారాన్ని పోస్ట్ చేసింది.  అంతేకాదు  మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ  చెక్‌ పెట్టింది. 

ప్యాన్‌-ఆధార్‌లో  లింకింగ్‌లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్‌లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  రసీదు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్‌ చేసుకోవచ్చని సూచించింది.  అయితే ఇ-పే ట్యాక్స్‌లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్‌’ కూడా అదేనట!)

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్‌ను ఆధార్‌ కార్డ్‌తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు  కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement