ఆధార్‌ అనుసంధానంపై ఊరట | 'Deadline for linking Aadhaar with government schemes is now Dec 31' | Sakshi
Sakshi News home page

ఆధార్‌ అనుసంధానంపై ఊరట

Published Wed, Aug 30 2017 12:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆధార్‌ అనుసంధానంపై ఊరట - Sakshi

ఆధార్‌ అనుసంధానంపై ఊరట

న్యూఢిల్లీ: ఆధార్‌ లింకింగ్‌ అంశంపై  సుప్రీంకోర్టు మరో ఊరట  కల్పించింది.   వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది.  ఆధార్‌లింక్‌పై  బుధవారం విచారించిన సుప్రీం  ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్‌ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని  ధర్మాసనం  ప్రకటించింది. తదుపరి  విచారణను  నవంబరుకు వాయిదా  వేసింది.  ఈ విషయంపై  వాదనలు వినడానికి  అంత  తొందర ఏమీలేదని  ధర్మాసనం పేర్కొంది.

వివిధ  సంక్షేమ పథకాలకు  ఆధార్‌ లింకింగ్‌ను గడువును పొడిగించాలని  సుప్రీం   కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె.  వేణుగోపాల్ మరో మూడు నెలలపాటు  ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు.  చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా బెంచ్, జస్టిస్ అమితావ రాయ్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం ఆధార్‌ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘింఘనపై తదుపరి విచారణ చేపట్టనున్నట్టు  వెల్లడించింది.  నవంబర్ మొదటి వారంలో తదుపరి విచారణ ఉంటుందని ఖాన్విల్కర్   చెప్పారు.

కాగా  వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్ తప్పనిసరి చేస్తూ  ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వివిధ పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్  బెంచ్‌ ముందు తమ వాదనలు వినిపించారు .కేంద్రం ప్రభుత్వం  గతంలోజారీ చేసిన ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్‌ లింకింగ్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది.  అయితే  తాజా  నిర్ణయం ప్రకారం ఈ  గడువు  డిసెంబర్‌ 31వరకు   పొడిగించినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement