ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయూలి
కలెక్టర్ నీతూ ప్రసాద్
ముకరంపుర : ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రం నంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో క్లోరినేషన్, హరితహారం, ఆరోగ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, కల్యాణలక్ష్మి, ఆసరా పథకాలతోపాటు జిల్లా, మండలాల విభజన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేరుుంచాలన్నారు. సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం మెరుగుపర్చాలనానరు. జిల్లాలో 76శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా వాటిని పూర్తి చేయూలన్నారు. గ్రామాల్లో చేపట్టిన హరితహారం, ఈజీఎస్, ఐఎస్‌ఎల్‌పై ప్రత్యేకాధికారులు సమీక్షించాలని సూచించారు.
వీటిలో గ్రామస్తులను భాగస్వాములను చేయూలని చెప్పారు. ఇందుకోసం గ్రామ, మండలస్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, చెరువులు, పాఠశాలలు, కుంటలు, రహదారులకిరువైపులా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మండలాల విభజనకు గల కారణాలు, ఇతర అంశాలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారం నివేదికలను మ్యాపులతో సహా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, డ్వామా పీడీ గణేశ్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.