ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరం
వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలపై షెడ్యూల్డు కులాల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని వయోజన విద్య ఉపసంచాలకులు జి.కృష్ణారావు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ ఎస్సీ వలంటీర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు, ఎస్సీ కార్పొరేషన్ అందించే పథకాలపై అవగాహన కల్పించారు. వయోజన విద్య కింద అందిస్తున్న పథకాలను వివరించారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు వీవీ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డు కులాల వారి కోసం ప్రభుత్వం అనేక రారుుతీలను ప్రకటించిందన్నారు. గతంలో మత్స్యశాఖ నుంచి తీసుకున్న సామగ్రిపై 50 శాతం రారుుతీ ఉండగా ప్రస్తుతం 90 శాతం రారుుతీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల యూనిట్‌కు కేవలం లక్ష రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.
ఎస్సీ మత్స్యకారులకు మూడు చక్రాల వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను యూనిట్లుగా మంజూరుచేస్తామని వెల్లడించారు. ఐస్‌బాక్స్‌లు, సీడ్ ట్రాన్సపోర్టు వాహనాలు, సైకిల్ విత్ నెట్, టు వీలర్ విత్ ఐస్ బాక్స్, ఇన్సులేటెడ్ వెహికల్, మరబోట్లు వంటివి 90 శాతం రారుుతీపై మంజూరుచేస్తామని వివరించారు. ఎస్సీ మత్స్యకారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కేవీ ఆదిత్యలక్ష్మి మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువత కోసం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దానిలో ప్రతి ఎస్సీ నిరుద్యోగి పేరు నమోదు చేసుకోవాలన్నారు.
వీరికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ ట్రైనింగ్, కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జనరల్ ఎంప్లాయ్ మెంట్ స్కిల్స్, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ, హోర్ సర్వీస్, బ్యూటీషియన్, ఫిట్‌నెస్, మాన్యుఫ్యాక్చరింగ్, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం గృహనిర్మాణ, ఉద్యానవన శాఖల ప్రతినిధులు ఆయా శాఖలు అందిస్తున్న పథకాలను తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, వలంటీర్లు, ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.