ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్‌ సప్లై మంత్రి మరోలా? | AP Assembly: YSRCP MLC Botsa Slams Ap Govt Over Super Six | Sakshi
Sakshi News home page

ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్‌ సప్లై మంత్రి మరోలా?

Published Mon, Nov 18 2024 2:13 PM | Last Updated on Mon, Nov 18 2024 3:18 PM

AP Assembly: YSRCP MLC Botsa Slams Ap Govt Over Super Six

సాక్షి, అమరావతి:  ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ  సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.

‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు.  

ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్‌ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది.  ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.

చేతిలో అధికారం ఉందని విద్యుత్‌ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం.  తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు?  ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు.

 నేరస్తుల్లో భయం పోయింది
నేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్

	దీపం-2 పథకంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement