సహజీవన జంట కిరాతకం | Nepali living relationship couple Arrest in Karnataka | Sakshi
Sakshi News home page

సహజీవన జంట కిరాతకం

Published Tue, Dec 17 2024 7:35 AM | Last Updated on Tue, Dec 17 2024 1:56 PM

Nepali living relationship couple Arrest in Karnataka

 పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేశారు  

నేపాలీ యువతీ యువకుడు అరెస్టు  

దొడ్డబళ్లాపురం: పుట్టిన బిడ్డను శ్రద్ధగా పోషిస్తారు. కానీ ఈ కిరాతక జంట ఏమాత్రం కనికరం లేకుండా పురిట్లోనే చంపేసింది. ఇటీవల రామనగర పట్టణంలోని దయానంద సాగర్‌ ఆస్పత్రిలోని టాయిలెట్‌ కమోడ్‌లో నవజాత శిశువు మృతదేహం లభించిన కేసు తీవ్ర సంచలనం కలిగించడం తెలిసిందే. ఇది నేపాల్‌ జంట నిర్వాకమని పోలీసులు తేల్చారు. వారిని అరెస్టు చేశారు. నిందితులు అమృత కుమారి (21), సురేంద్ర మెహ్రా (22).  

ఆస్పత్రికి వచ్చి..  
వివరాలు.. గత నెల 24న ఆస్పత్రిలోని టాయిలెట్‌ కమోడ్‌లో ఏదో అడ్డం పడిందని సిబ్బంది చెప్పడంతో పారిశుధ్య కార్మికులు యంత్రాలతో శుభ్రం చేశారు. ఈ సమయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం బయటకు వచ్చింది. దీంతో విచారణ చేపట్టగా గుట్టు రట్టయింది. అమృత, సురేంద్రలు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ, సహ జీవనం సాగిస్తున్నారు. 

అమృత గర్భం దాల్చగా కడుపునొప్పిగా ఉందంటూ  ఆ రోజున ఆస్పత్రికి వచ్చింది. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా శిశువును కమోడ్లో వేసి ఫ్లష్‌ చేసింది. తరువాత ఇద్దరూ వెళ్లిపోయారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

#MenToo: మరో భార్యా బాధితుడి బలవన్మరణం


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement