living relationship
-
రాజ్‌తరుణ్‌పై ఆధారాలతో మరో ఫిర్యాదు చేస్తా
మణికొండ: సినీ హీరో రాజ్‌తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్‌తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు. నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది. -
వివాహితతో సహజీవనం చేస్తూ చిత్రహింసలు
బంజారాహిల్స్: ఓ వివాహితతో సహజీవనం చేస్తూ ఆమెను అడ్డుగా పెట్టుకుని పలువురిని బెదిరించి కేసులు పెట్టించి డబ్బు దండుకునేందుకు యతి్నంచడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితున్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కిరణ్ కుమార్(34)పై పలువురిని బెదిరించిన ఘటనలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి. శ్రీ కృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్న కిరణ్ కుమార్ సమీపంలో ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక వివాహితతో రెండు సంవత్సరాక్రితం పరిచయం పెంచుకున్నాడు. నిన్ను, నీ పిల్లల బాగోగులు చూసుకుంటానంటూ చెప్పాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవల పక్కింట్లో నివసిస్తున్న ఓ యువకుడితో ఆమె మాట్లాడుతుండగా చూసిన కిరణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమెతో ఫిర్యాదు చేయించి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పించాడు. సదరు యువకుడిని బ్లాక్‌మొయిల్ చేశాడు. ఇలాంటి అబద్ధాలు ఎందుకంటూ ఆమె కిరణ్ కుమార్‌ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాద్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్ కుమార్ ఈ నెల 17న తన గదిలో తాళ్లతో ఆమెను మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. కడుపులో తన్నాడు. ఆమె విలవిలాడుతుండగానే అలాగే వదిలేసి పారిపోయాడు. కట్లు విప్పుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గతంలో కూడా జైలుకు వెళ్లొచి్చనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టులో ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్ షాక్‌తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్‌లోనే జడ్జి ఛాంబర్లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు(31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్లో ఆరోపించాడాయన. దీంతో.. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్‌కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే.. సదరు యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. -
శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!
బాలీవుడ్లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్బుక్ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. (ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? ) మహిళతో సహజీవనం.. వేధింపులు అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు. ఆమె వల్లే అప్పులు చేశా ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం. - కె.తారకరామ కుమార్ (ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) -
నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే!
అన్యోన్యంగా ఉంటే.. పెళ్లి నూరేళ్ల పంట! లేదంటే.. రోజూ ఒక తంటా! మాటా మాటా పెరిగితే... విడాకుల మంట! చిత్రంగా..వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే భారతావనిలోనూ..సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని విడాకులు ఇప్పుడు క్షణాల మాటగా మారిపోయాయి. ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోయాయి. అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కన్పిస్తోంది. ఈ మూడు అంశాల వల్లే.. వైవాహిక వ్యవస్థ్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలేమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం. రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండటం. ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో మార్పులు వస్తుండటం.. పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణనూ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం. ఏ రకమైన కుటుంబం కావాలన్న దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పలు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూద్దాం. చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లిళ్లు.. అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి. 1920లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య 12 మంది దాకా ఉంటే, ఇది క్రమేపీ తగ్గుతూ 2018 నాటికి కేవలం ఏడుకు చేరుకోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో ఆరుకు, ఆ్రస్టేలియాలో 5.2కు, లండన్‌లో 4.6కు, ఇటలీలో మరింత తక్కువగా అంటే 3.2కు చేరుకుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి. చైనా, రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. వయసు మీరుతున్నా... ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అంటారు పెద్దోళ్లు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అస్సలు లేదు. దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు, పదిహేడేళ్లకే పెళ్లిళ్లు జరిగిపోయి.. పిల్లల్ని కూడా కనేవారు. కానీ ఇప్పుడు? పాతికేళ్ల తరువాతే పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నారు. చదువుసంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి.. నాలుగు రాళ్లు వెనకేసుకున్న తరువాత కానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టరాదని అనుకుంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా ధనిక దేశాల్లో.. మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్వీడన్‌ను ఉదాహరణగా తీసుకుంటే 1990లలో సగటు పెళ్లీడు (మహిళలు) 28 ఏళ్లు కాగా.. 2017 నాటికి ఇది 34కు చేరింది. అయితే బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రం దశాబ్దాలుగా పెళ్లీడు అనేది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. నైజర్‌లో 17 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లి చేసేస్తున్నారు. భారత్‌లో పెళ్లీడు 1992లో 19.20 ఏళ్లుగా ఉండేది. 2015 నాటికి ఇది 21.40కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల్లో హెచ్చు తగ్గులు ఒకప్పుడు విడాకులంటే నలుగురిలో చర్చనీయాంశం. ఇప్పుడు పక్కింటిలోనూ పట్టించుకునే పరిస్థితి లేదు. అంత సాధారణమైపోయింది. దీన్ని బట్టి ప్రపంచం మొత్తమ్మీద విడాకులు పెరిగిపోయాయన్న అంచనాకు వస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విషయం అంత స్పష్టంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వివరాల లోతులకు వెళ్లిన కొద్దీ పరిస్థితుల్లో చాలా తేడాలు కనిపిస్తాయి. అమెరికాలో 1950 ప్రాంతంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు విడాకుల శాతం 2.6గా ఉంటే యునైటెడ్ కింగ్డమ్లో కేవలం 0.70గా ఉండింది. 1980 నాటికి అమెరికాలో ఈ సంఖ్య రెట్టింపు కాగా ఆ తరువాత కాలంలో మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2018 నాటి లెక్కలు పరిశీలిస్తే విడాకుల సంఖ్య 2.90గా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్లాంటి దేశాల్లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య ఒక దశ వరకూ గణనీయంగా పెరిగి ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. టర్కీ, ఐర్లాండ్, మెక్సికోలలో మాత్రం ఇప్పటికీ పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలామంది ఎక్కువ కాలం కలిసి ఉన్న తరువాతే విడిపోతుండటం. అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ విడాకులు ఏ దేశంలో ఎక్కువ.. ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు, సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ.. భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట.. ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ(1%) అని. ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నాం, ఇరాన్ వంటివి ఉన్నాయి. అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్, మాల్దీవులు, లక్సెంబర్గ్, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి. కారణాలివే.. అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన కమ్యూనికేషన్ లేక పోవడం, వాగ్వాదాలు, ఘర్షణలు, ఊబకాయం, వాస్తవికత లోపించిన అంచనాలు, సాన్నిహిత్యం లేకపోవడం, అసమాన్యత, హింస, అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు ఉన్న సార్వజనీన కారణాలు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే అంతే.. ఒక్కసారి కమిట్ అయితే.. జీవితాంతం కలిసుండాల్సి వచ్చే దేశాలు రెండే రెండు. ఒకటి వాటికన్ సిటీ. రెండోది ఫిలిప్పీన్స్. ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అస్సలు అవకాశమే లేదు. కాకపోతే ఫిలిప్పీన్స్‌లో ముస్లింలు షరియా చట్టం కింద విడాకులు పొందే అవకాశముంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కూ విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ 2000లో రికార్డు సృష్టించింది. తరువాతి కాలంలో ఇప్పటివరకు సుమారు 30 దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు. పెళ్లికి.. పిల్లలకు సంబంధం లేదు! వైవాహిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న అతిపెద్ద ట్రెండ్ పెళ్లికి, సంతానం కలిగి ఉండటానికి మధ్య సంబంధం లేకపోవడం. అంటే.. పిల్లల్ని కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతోందన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ధోరణి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌పెంట్ (ఓఈసీడీ) దేశాల్లో గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. సుమారు 38 దేశాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో పెళ్లి కాకుండా... లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్లు లేదా పెంచుకుంటున్న వారి శాతం 1960లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది. కోస్టారికాలో సుమారు 70 శాతం మంది పిల్లల జననానికి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ఇది మెక్సికోలో 65 శాతంగా, డెన్మార్క్‌లో 52 శాతంగా ఉంది. నెదర్లాండ్స్ (48), స్లొవేకియా (38), జర్మనీ (35) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాల్లో చిట్టచివరన ఉన్నది కొరియా (1.9 శాతం). అమెరికాలోని న్యూయార్క్, మిసిసిపీ రాష్ట్రాల్లో భార్య లేదా భర్త అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని నిరూపించగలిగితే ‘ఏలియనేషన్’ ఆఫ్ అఫెక్షన్ కింద నష్టపరిహారం కోరుతూ కేసులేయవచ్చు. అల్యూటియాన్ దీవుల్లో పురుషులకు భార్యంటే మొహం మొత్తితే.. వస్తు మార్పిడి మాదిరిగా ఆహారం లేదా దుస్తుల కోసం వదిలించుకోవచ్చు! కెనడాకు పశ్చిమంగా... జపాన్‌కు తూర్పు దిక్కున ఉంటాయీ ద్వీపాలు. 99 ఏళ్ల వయసులో విడాకులు! 99 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న వ్యక్తిగా 2011లో ఓ ఇటాలియన్ రికార్డు సృష్టించాడు. అరవై ఏళ్ల వైవాహిక జీవితం తరువాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖలు ఈయన కంటపడ్డాయి. అంతే 96 ఏళ్ల భార్యతో తెగతెంపులు చేసేసుకున్నాడు. 1934లో జరిగిన వీరి పెళ్లి.. 2011లో పెటాకులైంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
ఆ హీరోతో లివింగ్ టుగెదర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం వెబ్ సీరీస్ క్వీన్‌గా వెలిగిపోతున్న నటి వాణిభోజన్. టీవీ యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియళ్లలో నటించింది. దీంతో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఓ మై కడవులే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడిని ఆ తర్వాత పలు అవకాశాలు వరించాయి. నటుడు విక్రమ్‌కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. కారణం ఆమె పాత్రను పూర్తిగాఎడిటింగ్ పార్ట్‌కే పరిమితం చేశారు చిత్ర వర్గాలు. అదేవిధంగా వాణి భోజన్ నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వాణి దృష్టి వెబ్‌సీరీస్‌పై పడింది. అలా తమిళ్ రాకర్స్ ట్రిపిల్స్ ఇరు ధృవం 2, తాజాగా సెంగళం వెబ్ సీరీస్‌లో నటించింది. కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ టు గెదర్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జైతో లివింగ్ టుగెదర్‌లో ఉన్నట్టు ప్రచారం హోరెత్తింది. ఈమె కాల్షీట్స్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునేవారని, ఇతరులెవరూ ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదు అనే ప్రచారం జరిగింది. దీని వల్లే వాణిభోజన్కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని వాణి భోజన్ ఇప్పుడు ఖండిస్తూ ఉంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ తాను, నటుడు జయ్ ట్రిపిల్స్ వెబ్‌సీరీస్‌లో నటించామని, అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జైతో రిలేషన్ షిప్ అన్నా బాధపడను కానీ లివింగ్ టుగెదర్‌లో ఉన్నాననడమే బాధిస్తుందని పేర్కొంది. తాను కష్టపడి బ్యాంకులోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివశించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లీవింగ్ టుగెదర్‌లో ఉంటున్నానని రాయడం చీప్‌గా ఉందని వాణి భోజన్ ఆవేదనను వ్యక్తం చేసింది. -
సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన
న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్ కొట్టేశారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్షిప్లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. అయితే.. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపు నుంచి లివింగ్ రిలేషన్‌షిప్‌లపై రిజిస్ట్రేషన్, గైడ్‌లైన్స్‌ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది. ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్! -
Living Relations: పెళ్లి ఊసెత్తితే చాలు!
డేటింగ్ మన కల్చర్‌లో భాగం కాదని మొత్తుకునే నోళ్లు ఒకవైపు.. భాగస్వాముల్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ వాదించే నోళ్లు మరోవైపు. దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న ప్రియురాళ్ల హత్యోందతాలపై పోటాపోటీగా చర్చించుకుంటున్నాయి. ఎక్కడో పుట్టి.. పీకల లోతు ప్రేమలో మునిగిపోయి.. చివరకు పెళ్లి ఊసెత్తితే చాలు ప్రాణం తీసేంత గాఢతను సంతరించుకున్నాయి ఆ లవ్ క్రైమ్ కహానీలు. Shraddha Walkar Case.. శ్రద్ధా వాకర్ ఉదంతం ప్రేయసి శరీరాన్ని రంపంతో ముప్ఫై ఐదు ముక్కలు చేసి.. వాటిని ఫ్రిడ్జ్‌లో భద్రంగా కుక్కేసి.. వీలు దొరికినప్పుడల్లా దూరంగా పడేసి వచ్చినంత ప్రేమ అఫ్తాబ్ అమీన్ పూనావాలాది. 2022 మే 18వ తేదీన జరిగిన ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన ఈ దారుణం.. కొన్ని నెలలు(నవంబర్‌లో) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని కోరిన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను అడ్డుతొలగించుకోవాలనే ప్రయత్నంలో.. తన శాడిజాన్ని ప్రదర్శించాడు 28 ఏళ్ల అఫ్తాబ్. ఆ చర్య ఎంత పైశాచికంగా ఉందో.. అతని మాటల్లోనే చెప్తుంటే పోలీసులు నివ్వెరపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతం.. 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌తో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. పైగా లవ్ జిహాద్ కోణం కూడా తెర మీదకు వచ్చి.. రాజకీయ పరమైన దుమారానికి కూడా కారణమైంది. 2019లో డేటింగ్ ద్వారా శ్రద్ధా వాకర్, అఫ్తాబ్‌లు పరిచయం అయ్యారు. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఇంట్లోవాళ్లకు వాళ్లు స్నేహితులిగా పరిచయం. ఒక్కటి అవుతామంటే శ్రద్ధా పేరెంట్స్ ఒప్పుకోలేదు. కోపంతో అతని చెంతకే చేరింది. కానీ, టైం ఒకేలా నడవలేదు. ఇంటి ఖర్చులు, ఇతర కారణాలతో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. శ్రద్ధా ఉండగానే మరో యువతితో(యువతులతో) అఫ్తాబ్ చనువుగా మెదులుతూ వచ్చాడు. ఇది ఈ సంచలన కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు. ఇక రెండోది.. Nikki Yadav Case నిక్కీ యాదవ్ ఉదంతం అమ్మానాన్నలకు దూరంగా కోచింగ్ కోసం దేశ రాజధానిలో అడుగుపెట్టిన నిక్కీకి.. సాహిల్ గెహ్లాట్ పరిచయం.. స్నేహం ధైర్యాన్ని అందించింది. ఆ స్నేహమే తర్వాత ప్రేమైంది. ఇద్దరూ ఒకే కాలేజ్. కలిసి బతకాలని గ్రేటర్ నోయిడాలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు. కానీ, ప్రియుడిపై పెంచుకున్న గుడ్డి నమ్మకం చివరికి ఆమె ఉసురు తీసింది. భారీగా కట్నం వస్తుందనే ఆశతో(తల్లిదండ్రుల ఒత్తిడి అనే కారణం కూడా) నిక్కీని వదిలించుకోవాలని సాహిల్ నిర్ణయించుకున్నాడు. హడావిడిగా ఒక్కరోజు గ్యాప్‌లోనే ఓ యువతితో నిశ్చితార్థం, వివాహానికి రెడీ అయ్యాడు సాహిల్. విషయం నిక్కీకి చేరింది. తాను ఉండగానే మరో యువతితో వివాహానికి సిద్ధపడిన ప్రియుడి మోసాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. సరిగ్గా పెళ్లినాడే తన పరిస్థితి ఏంటని? నిలదీసింది. ప్రియురాలి కోపాన్ని తట్టుకోలేక ఫోన్ డేటా కేబుల్‌ను మెడకు బిగించి హత్య చేశాడు. ఆపై కారులో శవంతోనే 40 కిలోమీటర్లు చక్కర్లు కొట్టాడు. చివరకు నజాఫ్‌గఢ్‌లోని తన సొంత ధాబాలోని ఫ్రిడ్జ్‌లో ఆమె శవాన్ని భద్రపరిచాడు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రిబవరి 9-10వ తేదీల నడుమ ఈ ఘటన జరగ్గా.. ప్రేమకు సూచికైన ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడో ఉదంతం.. Megha Case మేఘ ఉదంతం మూడేళ్ల ప్రేమ.. ఆరు నెలల సహజీవనం.. నెలరోజులుగా భార్యభర్తలమని చెప్పుకుని ఒకే ఇంట్లో కాపురం!. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చేరువలో చోటుచేసుకుంది ఈ దారుణం. ప్రియుడు ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్న ఆమె భరించింది. అతని కోసమే తాను పని చేస్తూ.. ఇల్లు అద్దెకు తీసుకుని పోషిస్తూ వచ్చింది మేఘ. ఎందుకంటే.. హార్ధిక్ షా అంటే ఆమెకు అంత గాఢమైన ప్రేమ. వీలైనంత త్వరగా మూడు ముళ్లతో అతనితో దాంపత్యమనే కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కనింది. కానీ, ఆ మూర్ఖుడు పెళ్లి ఊసు ఎత్తేసరికి భరించలేకపోయాడు. శారీరక సంబంధంతో ఇలాగే కలిసి ఉందామంటూ తరచూ కూతలు కూశాడు. ఆమె భరించలేక గొడవ పడుతూ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీన మరోసారి గొడవ జరిగింది. కోపం తట్టుకోలేక.. ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ప్రియురాలి శవాన్ని బెడ్ కింద ఉండే బాక్స్‌లో భద్రపరిచాడు. ఆ బేవార్స్ ఆలోచన అక్కడితోనే ఆగిపోలేదు. ఇంట్లోని సామాన్లను అమ్మేసుకుని.. ఆ డబ్బుతో ఊరి నుంచి ఊడాయించే యత్నం చేశాడు. పనిలో పనిగా.. కర్ణాటకలో ఉండే మేఘ పిన్నికి ఫోన్ చేసి.. తాను మేఘాను హత్యచేసినట్లు.. ఆత్మహత్యచేసుకోనున్నట్లు చెప్పాడు. ఆమె వెంటనే తెలిసినవాళ్ల సాయంతో పాల్ఘడ్ జిల్లా (మహారాష్ట్ర) పోలీసులను అప్రమత్తం చేయించింది. ఇంటి తలుపు పగులగొట్టిన పోలీసులకు బెడ్ బాక్స్‌లో మేఘా మృతదేహం లభించింది. అలాగే పక్కా ప్లాన్‌తో పారిపోవాలని యత్నించిన హార్థిక్‌ను మధ్యప్రదేశ్ నాగ్డా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరగా.. తాజాగా వెలుగుచూసిన మరో ఉదంతం. మహారాష్ట్ర థానే జిల్లా నేవీ ముంబైలో జరిగింది. కాకపోతే ఇది కాస్త ముదురు కహానీ. అతనికి 40.. ఆమెకు 35. ఆల్రెడీ వివాహం అయిన ఆమె, మరో వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. భర్త నుంచి విడిపోయి.. ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. కానీ, ప్రియుడు ఆమెను శారీరక సుఖం తీర్చే బొమ్మగా భావించాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. చున్నీని మెడకు బిగించి ఉరేసి చంపాడు. నిందితుడి పేరు రాజ్‌కుమార్ బాబురామ్ పాల్. బాధితురాలు వివాహం చేసుకుందాం అనే సరికి ఆమెను చంపి.. శవాన్ని పొదల్లో పడేశాడు. భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆరేళ్లుగా నక్కి.. ఆఖరికి చిక్కి
సాక్షి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసులో ఆరేళ్లుగా పరారీలో ఉన్న రాజమహేంద్రవరం సుబ్బారావునగర్‌కు చెందిన తొండపు నాగప్రసాద్(ప్రసాద్)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రామన్నపాలేనికి చెందిన పేరుబోయిన శివభవాని (మృతురాలు) 2008లో మొదటిభర్త చనిపోవడంతో కుమార్తెను తీసుకుని బతుకుతెరువు నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, రోగులకు సేవలందిస్తూ వారిచ్చే డబ్బులతో తన కుమార్తెతో కలసి జీవిస్తుండేది. శివభవానికి కార్ డ్రైవర్ తొండపు నాగప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. నాగప్రసాద్ భార్యకు ఓ ప్రమాదంలో మతిస్థిమితం పోయింది. దీంతో 2014 నుంచి శివభవాని, తన కుమార్తెతో కలసి నాగప్రసాద్ ఇంట్లోనే కాపురం ఉన్నారు. అనంతరం ఆ ఇల్లు అమ్మేయడంతో పక్కనే ఉన్న సంజీవయ్యనగర్‌లో అద్దెకు వెళ్లారు. 2017 మార్చి 2న శివభవాని ఇంట్లో మృతిచెంది ఉంది. మృతురాలి తల్లి పేరుబోయిన కొవ్వాడమ్మ, బంధువులు వచ్చి చూడగా శివభవాని పీకకోసి ఉంది. ముందురోజు తమకు గొడవ జరగడంతో ఆమె పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నాగప్రసాద్ అందరినీ నమ్మించాడు. దీంతో బంధువులు శివభవాని మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. అంత్యక్రియలు పూర్తయిన రెండు వారాల తరువాత మృతురాలి సోదరుడు వెంకటేష్‌కు నాగప్రసాద్ ఫోన్ చేసి మీచెల్లి తనకు తానుగా పీక కోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, తరచూ డబ్బులు కోసం వేధిస్తుందని అందుకే తానే చంపేశానని తెలిపాడు. దీంతో ఈ విషయమై 21 రోజుల అనంతరం మృతురాలి తల్లి కొవ్వాడమ్మ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఇన్స్పెక్టర్ సీహెచ్ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాగప్రసాద్ పరారీలో ఉండగా, ప్రస్తుత త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు, సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్స్ బీఎంవీవీ భానుమూర్తి, జె.సుబ్బారావు, క్రైమ్ కానిస్టేబుళ్లు కె.వెంకటేశ్వరరావు, బి.విజయకుమార్‌లను సెంట్రల్ జోన్ డీఎస్పీ జేవీ సంతోష్ అభినందించారు. (చదవండి: సీఎం జగన్ మాటిచ్చారు.. నెరవేర్చారు’) -
సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం.. వివాహిత..
సాక్షి, అన్నమయ్య(మదనపల్లె): సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం పట్టణంలో జరిగింది. స్థానిక తొట్లివీధిలో ఉంటున్న మహబూబ్‌బాషా కుమార్తె షాహీనా(30)కు కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఏడాదిక్రితం కదిరికి చెందిన అమీన్ ఆమెకు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కదిరిలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఈక్రమంలో అమీన్ తల్లిదండ్రులకు విషయం తెలియడం, షాహీనాను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె అక్కడి నుంచి మదనపల్లెలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం ఫినాయిల్ తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: (బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..) -
ఢిల్లీలో దారుణ ఘటన.. యువతిని 35ముక్కలుగా..
-
షాకింగ్: సహజీవనం, ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి..
ఒక జంట ఇంట్లోంచి పారిపోయి సహజీవనం చేశారు. పెళ్లి ప్రస్తావన వచ్చేటప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది. ఆ గొడవ కాస్త దారుణమైన హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అఫ్తాబ్ అమీన్ పూనావల్ల అనే యువకుడు 26 ఏళ్ల శ్రద్ధా అనే అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు. శ్రద్ధా ముంబైలోని ఒక మల్టీనేషనల్ కంపెనీ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అక్కడే పూనావల్లతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇద్దరూ డేటింగ్ చేసుకునేంత వరకు వచ్చింది. వీళ్లిద్దరి వ్యవహారం శ్రద్ధ వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీంతో వారు ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ప్లాట్‌కి మకాం మార్చి అక్కడే కలిసి ఉంటున్నారు. ఐతే గత కొద్దిరోజులుగా ఆమె నుంచి కుటుంబసభ్యులకు కాల్స్ రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రద్ధా తండ్రి వికాశ్ మదన్ ఢిల్లీ వచ్చి ఆమె గురించి వాకాబు చేస్తూ...ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పోలీసులుకు తన కూతురు కనిపించడం లేదంటూ పూనావల్లపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం ప్రారంభించారు. పోలీసులు పూనావల్ల కోసం తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో పూనావ్లల...తనని శ్రద్ధ తరచూ పెళ్లిచేసుకోమని పోరు పెడుతున్నట్లు తెలిపాడు. పెళ్లి విషయమై ఇద్దరు గొడవపడినట్లు తెలిపాడు. ఐతే ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో తాను కోపంతో శ్రద్ధా గొంతుకోసి హతమార్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఒక ఫ్రిజ్ కొనుక్కుని మరీ భద్రపర్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ముక్కలను పడేసేందుకు రోజు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోపడేసి వచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...) -
పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలతో సహజీవనం
సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్‌గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్–2 విద్యార్థిని ప్రేమించాడు. అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే! -
భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్
కాకినాడ క్రైం: సహజీవనం చేసిన వ్యక్తి పలు దఫాలుగా రూ.1.5 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పేర్కొంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన హీనా ఖాతున్ భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. పాయరోటీ బండి పెట్టి జీవనం సాగిస్తోంది. దుమ్ములపేటలో నివాసం ఉంటున్న విజయభాస్కర్ 18 నెలల క్రితం ఆమెకు పరిచయమయ్యాడు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో ఆ పరిచయం వారి సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ అవసరాల కోసం పలు దఫాలుగా ఖాతున్ రూ.1.5 లక్షలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నుంచి విజయ భాస్కర్ తనకు కనిపించకుండా పరారయ్యాడని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్!
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది. నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది. దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం. -
సహజీవనం చేసి.. రేప్ కేసులు పెడితే ఎలా?
న్యూఢిల్లీ: తమంతట తాముగా ఇష్టపూర్వక సహజీవనం చేసి.. అవి బెడిసి కొట్టడం, విభేధాల కారణంగా అత్యాచారం ఫిర్యాదులు చేయడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ద్విసభ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి.. తనంతట తానే ఇష్టపూర్వకంగా అవతలి వ్యక్తితో సహజీవనం చేసింది. పైగా 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అతనితో బంధంలోకి అడుగు పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లైంగికంగా లోబర్చుకున్నాడని, దాడికి పాల్పడ్డాడని చెబుతోంది. ఇష్టపూర్వకంగానే ఆమె అతనితో బంధం కొనసాగించినట్లు ఒప్పుకుంది. కాబట్టి.. అత్యాచారం కింద ఐపీసీ 376(2)(n) ప్రకారం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం కాదు అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఇలాంటి కేసులు చాలానే న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. పూర్తి ఇష్టంతోనే పరస్పర అంగీకారంతోనే వాళ్లు కలిసి ఉంటున్నారు. వివాహంతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటున్నారు. తీరా గొడవలు జరిగితే చాలూ.. ఇలా అత్యాచారం, లైంగిక దాడులంటూ న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సరైన పద్ధతి కాదు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు మాత్రం యథాతథంగా కొనసాగాలని సుప్రీం బెంచ్, రాజస్థాన్ పోలీసులకు సూచించింది. -
ప్రేమించి పెళ్లి చేసుకుని.. మరో వివాహితతో సహజీవనం
వారిద్దరూ వివాహితులే. ఇద్దరికీ కుటుంబాలున్నాయి. అతను వీఆర్ఓగా పనిచేస్తుండగా...ఆమె సచివాలయ ఉద్యోగి. కానీ ఇద్దరూ ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ... రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. సహచరులను, సంతానాన్ని శోకంలో ముంచారు. అనైతికమని తెలిసీ అదే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఫలితంగా సచివాలయ ఉద్యోగికి తాళికట్టిన భర్త... వీఆర్‌ఓతో జీవితం పంచుకున్న భార్య మమత జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. సాక్షి, పుట్టపర్తి: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక... మరో వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. అడ్డుతప్పించుకునేందుకు భార్యను వేధిస్తున్నాడు. అయినప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండేలా చూడాలంటూ ఆ మహిళ పోలీసులను, అధికారులను వేడుకుంటోంది. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ప్రేమ పెళ్లి...పిల్లలు పుట్టాక లొల్లి.. కొత్తచెరువు మండలం కొడపగానపల్లికి చెందిన ఒంటికొండ రామ్మోహన్ వీఆర్ఓగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామానికే చెందిన మమతను ప్రేమించి 2015 ఫిబ్రవరి 13న బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి యస్మిత, యక్షిత సంతానం. వీరి సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో రామ్మోహన్ దారి తప్పాడు. 2021 సెప్టెంబరు నుంచి భార్యకు దూరంగా ఉంటున్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న మరో వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: (వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..) ఆ మహిళ భర్త సంబంధీకులు గొడవకు దిగినా... రామ్మోహన్ తీరులో మార్పు రాలేదు. పైగాతన భార్య, పిల్లలను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విడాకులకు అంగీకరించాలని భార్య మమతపై ఒత్తిడి తేగా, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో 2022 మార్చి 2న కొత్త చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు.. ఆమెకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయారు. కనీసం రామ్మోహన్‌ను స్టేషన్‌కు కూడా పిలిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 11న మమత మరోసారి ‘స్పందన’లో తన గోడు వెళ్లబోసుకుని న్యాయం కోసం ఎదురుచూస్తోంది. నా భర్త దగ్గరకు చేర్చండి నా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారరాదు. మాకు బతుకు తెరువు కావాలి. నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి అతని దగ్గరకు చేర్చండి. నా భర్తతో సహజీవనం చేస్తున్న వివాహిత భర్తకూ న్యాయం చేయండి. ఆ ఇద్దరి సంతోషం కోసం రెండు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు పోలీసు స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాలు తిరిగాను. ఎవరూ న్యాయం చేయలేదు. నాకు విడాకులు అవసరం లేదు. నా భర్తతో కలిసి జీవించాలని ఉంది. – మమత -
సహజీవనం చేసి.. తల్లిని చేశాడు.. ఆస్తిలో భాగం కావాలి.. తర్వాత ఏం జరిగిందంటే?
గోరంట్ల(శ్రీసత్యసాయి జిల్లా): మహిళను మోసగించిన ఓ వ్యక్తిపై మండల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారాయుడు తెలిపిన మేరకు.. గోరంట్లకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్ గతేడాది మేలో మృతి చెందారు. ఈయన మరణించిన కొన్నిరోజులకే.. తనతో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడంటూ మండలంలోని కరావులపల్లికి చెందిన సంధ్యాబాయి ప్రభాకర్ భార్య రుక్మిణీదేవితో వచ్చి వాపోయింది. చదవండి: బాలుడు పాడుపని.. ఇంటర్ బాలికను ఇంటికి తీసుకెళ్లి.. ఆస్తిలో తనకూ భాగం కావాలని వాగ్వాదానికి దిగి ప్రభాకర్‌కు చెందిన ఒక ఇంట్లో దిగింది. ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి ఖాళీ చేయిస్తానని అయితే, తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని గోరంట్లకు చెందిన గాండ్ల జగన్ చెప్పడంతో రుక్మిణీదేవి ఆ మేరకు డబ్బు అందజేసింది. ఎన్నిరోజులైనా సమస్యను పరిష్కరించకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని గాండ్ల జగన్‌ను మంగళవారం రుక్మిణీ దేవి నిలదీసింది. ఆయన బెదిరింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు జగన్‌పై ఐపీసీ 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
యువతితో రౌడీషీటర్ సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ చివరికి..
పాయకాపురం(విజయవాడ రూరల్): వాంబేకాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25) మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వాంబేకాలనీ హెచ్ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న శంకర్ ట్యాటూస్ వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరిరువురి మధ్య గొడవ జరిగింది. చదవండి: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్ దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటకు వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకొని చున్నీతో ఫ్యాన్‌రాడ్ కు ఉరివేసుకొన్నాడు. అర్ధరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపుతీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతుని తమ్ముడు రామకృష్ణకు ఫోనులో సమాచారం అందజేసింది. అతను కిటికీలో నుంచి చూడగా శంకర్ ఉరివేసుకొన్నట్టు గమనించి పగులకొట్టి లోపలికి వెళ్లాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..
సాక్షి, హైదరాబాద్(భాగ్యనగర్ కాలనీ): తనతో సహజీవనం చేసి..కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతోందని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెల్పిన వివరాల మేరకు ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో ఆమె మూడేళ్లు సహజీవనం చేసింది. కొద్దిరోజులుగా మనస్పర్థలు రావడంతో వీరు విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మిపై కోపం పెంచుకున్న వెంకటేశ్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రకాష్ నగర్‌లోని ఆమె నివాసానికి వచ్చి గొడవపడ్డాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకట్ లక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో వెంకటేశ్ సైతం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం) -
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్‌చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్‌చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..)