
బాలీవుడ్‌లో ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌లోనూ ఈ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.
(ఇది చదవండి :వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా? )
మహిళతో సహజీవనం.. వేధింపులు
అయితే తనతో సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని తీర్థానంద రావు ఆరోపిస్తున్నారు. తన డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వల్ల రూ.4 లక్షల అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే ఆమెనే బాధ్యత వహించాలన్నారు.
ఆమె వల్లే అప్పులు చేశా
ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. 'తేడాది అక్టోబర్ నుంచి తాను ఓ మహిళతో తాను లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఇప్పటికే నాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక ఉన్న కారణమేంటో తెలియదు. ఆమె తనను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తోంది. తన నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె నాకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెబుతోంది. ఆమె వల్ల లక్షల రూపాయలు అప్పు చేశా.' అని అన్నారు. అయితే ఆ తర్వాత లైవ్ వీడియోను డిలీట్ చేసినట్లు సమాచారం.
- కె.తారకరామ కుమార్
(ఇది చదవండి : పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment