సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ కమెడియన్.. దివాళా తీయాల్సి వచ్చింది! | Kapil Sharma Reveals He Went Bankrupt After Producing 2 Movies | Sakshi

Kapil Sharma: ఆ రెండు సినిమాలతో జీరోకు పడిపోయా: కపిల్ శర్మ

Oct 25 2024 1:59 PM | Updated on Oct 25 2024 2:30 PM

Kapil Sharma Reveals He Went Bankrupt After Producing 2 Movies

సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ ‍కమెడియన్ ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతలా ఫేమస్ అయ్యారు కమెడియన్ కపిల్ శర్మ. ది కపిల్ శర్మ షో ద్వారా బాలీవుడ్‌ మరింత ఫేమస్ అయ్యాడు. ఇటీవలే జ్విగాటో సినిమాతో ప్రేక్షకులను ‍అలరించిన కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తకర విషయాలు పంచుకున్నారు.

గతంలో తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయని కపిల్ శర్మ తెలిపారు. ఫిరంగి, సన్‌ ఆఫ్‌ మన్‌జీత్‌ సింగ్‌ చిత్రాలు ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన భార్య సహకారంతోనే మళ్లీ తిరిగి కోలుకున్నట్లు కపిల్ శర్మ తెలిపారు.

కాగా..  ఫిరంగి చిత్రంలో కపిల్ శర్మతో పాటు ఇషితా దత్తా, మోనికా గిల్ నటించారు. ఈ సినిమాకు రాజీవ్ దర్శకత్వం వహించారు. 2017లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పంజాబీలో తెరకెక్కించిన సన్ ఆఫ్ మంజీత్ సింగ్  మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రానికి విక్రమ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. అంతకుముందు 2015లో తెరకెక్కిన కిస్‌ కిస్కో ప్యార్‌ కరోతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement