ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ! | Salman Khan team denies tie Up with The Great Indian Kapil Show | Sakshi
Sakshi News home page

Salman Khan: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో.. ఆరోపణలపై స్పందించిన సల్మాన్ టీమ్!

Nov 14 2024 1:47 PM | Updated on Nov 14 2024 2:55 PM

Salman Khan team denies tie Up with The Great Indian Kapil Show

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను  దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.

అన్ని అవాస్తవాలే...

అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్‌కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్‌కేటీవీకి లీగల్‌ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు.

కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉ‍న్నారు. ఇందులో  రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement