బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తన షోలో ఇటీవల చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీని అభ్యంతకరమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.. ఎవరైనా స్టార్‌ను మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు అతనికి మీరు కనిపించారా? అంటూ కలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి అట్లీ సైతం రిప్లై కూడా ఇచ్చారు. ఎవరినైనా సరే రూపాన్ని చూసి ఓ అంచనాకు రాకండి.. అతని హృదయాన్ని చూసి చెప్పాలంటూ సమాధానమిచ్చారు.
అయితే ఈ షోలో అట్లీని అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కపిల్ శర్మను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లీ కలర్‌పై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అట్లీకి క్షమాపణలు చెప్పాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కపిల్ శర్మ స్పందించారు.
తనపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కపిల్ శర్మ బదులిచ్చారు. డియర్ సర్.. నేను ఈ వీడియోలో అట్లీ లుక్స్ గురించి మాట్లాడినట్లు దయచేసి నాకు వివరించగలరా? దయచేసి సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మీకు ధన్యవాదాలు. అంతే కాదు అబ్బాయిలు మీ నిర్ణయం మీరే తీసుకోండి.. అంతేకానీ గొర్రెలాగా ఎవరో చేసిన ట్వీట్‌ను అనుసరించవద్దు' అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే మరికొందరేమో కపిల్ శర్మ కామెంట్స్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
Dear sir, can you pls explain me where n when I talked about looks in this video ? pls don’t spread hate on social media 🙏 thank you. (guys watch n decide by yourself, don’t follow any body’s tweet like a sheep). https://t.co/PdsxTo8xjg
— Kapil Sharma (@KapilSharmaK9) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment