bankrupt
-
సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ కమెడియన్.. దివాళా తీయాల్సి వచ్చింది!
సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అంతలా ఫేమస్ అయ్యారు కమెడియన్ కపిల్ శర్మ. ది కపిల్ శర్మ షో ద్వారా బాలీవుడ్ మరింత ఫేమస్ అయ్యాడు. ఇటీవలే జ్విగాటో సినిమాతో ప్రేక్షకులను అలరించిన కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తకర విషయాలు పంచుకున్నారు.గతంలో తాను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయని కపిల్ శర్మ తెలిపారు. ఫిరంగి, సన్ ఆఫ్ మన్జీత్ సింగ్ చిత్రాలు ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలతో నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తన భార్య సహకారంతోనే మళ్లీ తిరిగి కోలుకున్నట్లు కపిల్ శర్మ తెలిపారు.కాగా.. ఫిరంగి చిత్రంలో కపిల్ శర్మతో పాటు ఇషితా దత్తా, మోనికా గిల్ నటించారు. ఈ సినిమాకు రాజీవ్ దర్శకత్వం వహించారు. 2017లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పంజాబీలో తెరకెక్కించిన సన్ ఆఫ్ మంజీత్ సింగ్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రానికి విక్రమ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. అంతకుముందు 2015లో తెరకెక్కిన కిస్ కిస్కో ప్యార్ కరోతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. -
గో ఫస్ట్ కోసం స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలయ్యాయి. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ బిడ్ వేశారు. స్పైస్‌జెట్ వ్యయాలు తగ్గించుకునేందుకు, నిధుల సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అజయ్ సింగ్.. గో ఫస్ట్ కోసం పోటీ పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యక్తిగత హోదాలో బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. మరోవైపు, షార్జాకి చెందిన స్కై వన్ ఎఫ్జెడ్ఈ తాము కూడా బిడ్ వేసినట్లు వెల్లడించింది. -
బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్‌హామ్ కౌన్సిల్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్‌లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
చాట్‌జీపీటీపై సంచలన రిపోర్ట్.. త్వరలో దివాలా తీయడం ఖాయం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం చాట్ జీపీటీ (ChatGPT) రూపకర్త, సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ (OpenAI) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని, 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని ‘అనలైటిక్స్ ఇండియా మ్యాగజైన్’ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం... తన ఏఐ సర్వీసుల్లో ఒకటైన చాట్‌జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ కంపెనీకి రోజుకు 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.80 కోట్లు) ఖర్చవుతోంది. దీంతో ఆ కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీపీటీ-3.5, జీపీటీ-4తో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ సతమతవుతోంది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రారంభించిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా అవతరించింది. ప్రారంభ దశల్లో రికార్డు స్థాయిలో యూజర్ల ప్రవాహం వచ్చినా.. ఇటీవల కొన్ని నెలులుగా యూజర్ల సంఖ్యలో క్రమంగా క్షీణతను చూస్తోంది. జులై చివరి నాటికి చాట్ జీపీటీ యూజర్ బేస్ మరింత పడిపోయిందని ‘సిమిలర్ వెబ్’ డేటా చెబుతోంది. 2023 జూన్‌తో పోల్చితే జులై నెలలో యూజర్ బేస్ 12 శాతం తగ్గిందని, 1.7 బిలియన్ల నుంచి 1.5 బిలియన్లకు పడిపోయిందని పేర్కొంది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది! కంపెనీ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్)లు కూడా వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. అనేక కంపెనీలు గతంలో తమ ఉద్యోగులను చాట్ జీపీటీని ఉపయోగించకుండా కట్టడి చేసినట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ ఏపీఐలకు యాక్సెస్ పొందడం ప్రారంభించిన కంపెనీలు.. విభిన్న వర్క్‌ఫ్లోల కోసం వారి సొంత ఏఐ చాట్బాట్లను రూపొందించేందుకు వీలు కల్పిస్తున్నట్లు నివేదిక వివరించింది. ఓపెన్ ఏఐ సంస్థ ఇంకా లాభాల్లోకి రాలేదని నివేదిక చెబుతోంది. గత మే నెలలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి దాని నష్టాలు 540 మిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ఓపెన్ ఏఐ కంపెనీ కొంతలోకొంత నెట్టుకొస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ 2023 సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో అది ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావించింది. కానీ నష్టాలు మాత్రమే పెరుగుతున్నందున లాభాలు అసాధ్యంగా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
టీటీవి దివాలా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో టీటీవీ దినకరన్‌కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్ విచారణను న్యాయమూర్తుల బెంచ్ ముగించింది. -
దివాళా అంచున అమెరికా ఆర్ధిక వ్యవస్థ
-
‘కాంగ్రెస్ దివాలా.. అందుకే మాకు వద్దు అనుకుంటే వారికి ముద్దయ్యారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో విమర్శల జోరు పెంచాయి అధికార, ప్రతిపక్షాలు. మంగళవారం బాగల్కోట్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని, ఆ పార్టీకి నాయకులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ రెబల్ నాయకులపై ఆధారపడిందని సెటర్లు వేశారు. ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను పక్కనపెట్టింది బీజేపీ. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈనేపథ్యంలోనే అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈసారి 150 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..? -
లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. దివాళా తీసిన పాకిస్తాన్..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దివాళా అంచుల్లోకి పాకిస్తాన్ వెళ్లిందని అంతా అనుకుంటున్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి, పీఎంఎల్-ఎన్ నేత ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని కుండబద్దలుకొట్టారు. పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదన్నారు. ఇక పాక్ ప్రజలు తమకాళ్లపై తామే నిలబడాలని పిలుపునిచ్చారు. సియాల్కోట్లో ఓ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రజలు అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఇప్పుడు దివాళా తీసిన దేశంలో నివసిస్తున్నాం. ఇక సొంతంగా మనకాళ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆసిఫ్ అన్నారు. Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state - Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK — Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023 దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత పీటీఐ ప్రభుత్వమే కారణమని ఖవాజా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్‌కు తిరిగితీసుకొచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మార్చారని కూడా ఖవాజా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖవాజా ఆరోపణలను ప్రతిపక్ష పీటీఐ పార్టీ తిప్పికొట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశాన్ని దివాళా తీయించిందని ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో పాకిస్తాన్‌కు 6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 2022లో వరదల తర్వాత మరో 1.1 బిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. కానీ దేశంలో రాజకీయ గందరగోళం మధ్య ఆర్థిక ఏకీకరణపై పాకిస్తాన్ మరింత పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబర్‌లో చెల్లింపులను నిలిపివేసింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్ -
Sakshi Cartoon 22-09-2022
ఇక మన పని స్టార్ట్ చేద్దాం! బ్యాంకులో రుణం తీసుకొని నువ్వు లండన్ వెళ్లు.. నేను అమెరికా వెళ్తా.. నువ్వేమో సింగపూర్.. అతను దుబాయ్! -
అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!
న్యూఢిల్లీ: బిర్లా టైర్స్ లిమిటెడ్‌పై దివాలా చర్యలను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా బెంచ్ ఆదేశించింది. బీకే బిర్లా గ్రూప్ సంస్థ– బిర్లా టైర్స్ రుణదాత, మల్టీ–బిజినెస్ కెమికల్స్ సంస్థ ఎస్ఆర్ఎఫ్ దాఖలు చేసిన కేసులో బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనల ప్రకారం, బోర్డు ను సస్పెండ్ చేసి, మారటోరియం విధించిన ట్రి బ్యునల్, కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి సీక్ అబ్దుల్ సలామ్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ)గా నియమించింది. టైర్ కార్డ్ ఫ్యాబ్రిక్ సరఫరాలకు సంబంధించి 2021 జూలై 8వ తేదీ నాటికి బిర్లా టైర్స్ తనకు రూ. 15.84 కోట్లు చెల్లించాలని ఎస్ఆర్ఎఫ్ దివాలా పిటిషన్లో పేర్కొంది. ఇందులో రూ. 10.06 కోట్ల అసలుకాగా, 5.78 కోట్లు వడ్డీ. రుణ డిఫాల్ట్‌కు సంబంధించి ఎస్ఆర్ఎఫ్ సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐబీసీ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బిర్లా టైర్స్ చాలా ఆషామాషీగా తీసుకుని, వాయిదాలు తీసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోందని ట్రిబ్యునల్ సభ్యులు (టెక్నికల్) హరీష్ చందర్ మరో సభ్యులు (జుడీషియల్) సూరి రోహిత్ కపూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్ఆర్ఎఫ్ పిటిషన్‌పై బిర్లా టైర్స్‌కు ఎన్సీఎల్టీ 2021 అక్టోబర్ 20న నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రిప్లై ఇవ్వడానికి మూడు ద ఫాలు బిర్లా టైర్స్ వాయిదాలు తీసుకోవడం గమనార్హం. చదవండి: ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్ -
జీ లెర్న్‌పై యస్ బ్యాంక్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: జీ లెర్న్‌పై దివాలా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి ఫిర్యాదు చేసింది. మొత్తం రూ. 468 కోట్ల చెల్లింపుల్లో విఫలమైనందున కంపెనీపై చర్యలు తీసుకోవలసిందిగా యస్ బ్యాంక్ ఆరోపించినట్లు జీ లెర్న్ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ నుంచి నోటీసు అందుకున్నట్లు వెల్లడించింది. నిజానిజాలను ధ్రువపరచుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ జీ లెర్న్ ఎడ్యుకేషన్ విభాగంలో సేవలందించే సంగతి తెలిసిందే. చదవండి: నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు.. -
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
లండన్ కోర్టు సంచలన తీర్పు: మాల్యాకు భారీ షాక్!
లండన్: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. మాల్యా అప్పగింత కేసును సోమవారం విచారించిన లండన్ హైకోర్టు విజయ్ మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో గతకొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం లభించినట్టైంది. అయితే దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి బ్రిగ్స్ నిరాకరించారు. ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పునిచ్చిన లండన్ హైకోర్టు తాజాగా మాల్యా దివాలా తీసినట్టుగా ప్రకటించడం గమనార్హం. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మంజూరు చేసిన 9వేల కోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు 13 భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఆయనపై ఆరోపణలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
కోట్ల ఖర్చుతో కూతురి పెళ్లి, ఇప్పుడు దివాళా..
సాక్షి, న్యూఢిల్లీ: ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. లక్ష్మి మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను లండన్ హైకోర్టు దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. లక్ష్మి మిట్టల్, ఆయన తండ్రి, భార్య, కొడుకు, బావ మరిది కలిసి వివిధ బ్యాంకులకు 2.5 బిలియన్ డాలర్లు బాకీ పడ్డారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన సోదరుడు లక్ష్మి మిట్టల్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు. స్టీల్ మాగ్నెట్ ఆర్సెలర్ మిట్టల్, యూకేకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2013 లో, ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె శ్రీష్టి వివాహానికి ఏకంగా 50 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టి వివాహం చేసి వార్తల్లో నిలిచారు. కోర్టు దివాళాగా ప్రకటించిన అనంతరం మిట్టల్ మాట్లాడుతూ, తనకంటూ ప్రత్యేకంగా వ్యక్తిగత ఆదాయం ఏమి లేదని తెలిపారు. తన భార్య ఆర్థికంగా తనకు తాను సంపాదించుకుంటుందని, ఆమె ఆదాయానికి సంబంధించిన వివరాలు తెలియవని చెప్పారు. తన వ్యక్తిగత వ్యయం నెలకు సుమారు 2,000 పౌండ్ల నుంచి 3,000 పౌండ్ల వరకు అవుతుందని, ఆ భారాన్ని తన భార్య, కుటుంబ సభ్యులు భరిస్తున్నారని వెల్లడించారు. ఇక తన దివాళాకు సంబంధించి చట్టపరమైన ఖర్చులను థర్డ్ పార్టీ భరిస్తుందని ప్రకటించారు. ప్రమోద్ పతనానికి కారణం బోస్నియన్‌కు చెందిన గ్లోబల్ ఇస్పాట్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) అనే బొగ్గు కంపెనీకి హామీ ఇచ్చారు. ఆ సంస్థ 166 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో ఆ సంస్థకు అప్పు ఇచ్చిన మార్గెట్ కంపెనీ ప్రమోద్ మిట్టల్‌ను అప్పు కట్టాల్సిందిగా కోరింది. దానిని చెల్లించడంలో ఆయన విఫలమయ్యాడు. మరోవైపు భారతదేశంలో కూడా రూ. 2,200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కూడా ప్రమోద్ మిట్టల్ విచారణను ఎదుర్కొంటున్నారు. చదవండి: బడా పారిశ్రామికవేత్త వంద కోట్ల విరాళం -
విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్ : లిక్కర్ కింగ్, ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు భారీ ఉపశమనం లభించింది. మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ కోర్టు తోసి పుచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. 114.5 కోట్ల పౌండ్ల రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టాడని, బకాయిల వసూలు నిమిత్తం మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలని ఎస్బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం అభ్యర్థించింది. దీన్ని విచారించిన జస్టిస్ మైకేల్ బ్రిగ్స్ భారత సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లతో పాటు, కర్నాటక హైకోర్టులో మాల్యా పెట్టుకున్న చెల్లింపు ప్రతిపాదన తేలేవరకు మాల్యాకు సమయం ఇవ్వాలని తీర్పు చెప్పారు. బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లించే వరకు సమయం ఇవ్వాలంటూ దివాలా ఉత్తర్వులిచ్చేందుకు తిరస్కరించారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వ్యాప్తి అనిశ్చితి కారంగా తేదీని నిర్ణయించడం కష్టమని పేర్కొన్న కోర్టు తరువాతి విచారణను జూన్ 1, 2020 నాటికి వాయిదా వేసింది. కాగా భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి మాల్యా లండన్ కు పారిపోయారు. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై యుకె హైకోర్టు తీర్పు పెండింగ్‌లో ఉంది. మరోవైపు అప్పులను వంద శాతం చెల్లిస్తానని అనుమతి ఇవ్వాలంటూ పలుసార్లు బ్యాంకులకు విజ్ఙప్తి చేసిన మాల్యా, కరోనా సంక్షోభంలోనైనా తన అభ్యర్థనను మన్నించాలంటూ ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట -
పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా
న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్.కె. తిజరీవాలా పేర్కొన్నారు. -
కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా: షబ్బీర్ అలీ
విలువైన ప్రభుత్వ భూములను కేసిఆర్ సర్కార్ అమ్మకానికి పెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కన్జర్వేటివ్ జోన్, గ్రీన్ బెల్టులోని భూముల్లో నిర్మాణాలకు అనుమతులిస్తూ.... జారీ చేసిన 25 జీవోను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. విభజనతో తెలంగాణకు పది వేల కోట్లు మిగులు బడ్జెట్ దక్కినప్పటికీ.... కేసిర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రం దివాళా తీస్తోందని ఎద్దేవా చేశారు. సీఎల్పీ ప్రాంగణంలో మాట్లాడిన షబ్బీర్...కేసీఆర్ పాలనా తీరుపై విమర్శలు సంధించారు.