Chennai: ED To Declare TTV Dhinakaran Bankrupt - Sakshi
Sakshi News home page

టీటీవి దివాలా

Published Sat, Aug 12 2023 9:14 AM | Last Updated on Sat, Aug 12 2023 10:45 AM

Chennai: Ed To Declare Ttv Dhinakaran Bankrupt - Sakshi

సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్‌ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశాడు. మనీలాండరింగ్‌ కేసులో టీటీవీ దినకరన్‌కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు.

అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్‌ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్‌ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్‌ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్‌ విచారణను న్యాయమూర్తుల బెంచ్‌ ముగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement