ఓ యువతితో సహజీవనం చేస్తూ మరో యవతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మదనపల్లె (చిత్తూరు) : ఓ యువతితో సహజీవనం చేస్తూ మరో యవతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన ఓ యవతితో అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్ నాయక్ సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు తెలియకుండా మరో యవతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడికి కోసం గాలింపు చేపట్టారు.