తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్‌గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్‌గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది.
నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది.
ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది.
దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్‌నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment