ప్రస్తుతం వెబ్ సీరీస్ క్వీన్‌గా వెలిగిపోతున్న నటి వాణిభోజన్. టీవీ యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియళ్లలో నటించింది. దీంతో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఓ మై కడవులే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడిని ఆ తర్వాత పలు అవకాశాలు వరించాయి. నటుడు విక్రమ్‌కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. కారణం ఆమె పాత్రను పూర్తిగాఎడిటింగ్ పార్ట్‌కే పరిమితం చేశారు చిత్ర వర్గాలు.
అదేవిధంగా వాణి భోజన్ నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వాణి దృష్టి వెబ్‌సీరీస్‌పై పడింది. అలా తమిళ్ రాకర్స్ ట్రిపిల్స్ ఇరు ధృవం 2, తాజాగా సెంగళం వెబ్ సీరీస్‌లో నటించింది.
కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ టు గెదర్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జైతో లివింగ్ టుగెదర్‌లో ఉన్నట్టు ప్రచారం హోరెత్తింది. ఈమె కాల్‌షీట్స్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునేవారని, ఇతరులెవరూ ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదు అనే ప్రచారం జరిగింది. దీని వల్లే వాణిభోజన్‌కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని వాణి భోజన్ ఇప్పుడు ఖండిస్తూ ఉంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ తాను, నటుడు జయ్ ట్రిపిల్స్ వెబ్‌సీరీస్‌లో నటించామని, అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జైతో రిలేషన్ షిప్ అన్నా బాధపడను కానీ లివింగ్ టుగెదర్‌లో ఉన్నాననడమే బాధిస్తుందని పేర్కొంది. తాను కష్టపడి బ్యాంకులోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివశించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లీవింగ్ టుగెదర్‌లో ఉంటున్నానని రాయడం చీప్‌గా ఉందని వాణి భోజన్ ఆవేదనను వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment