Vani Bhojan
-
‘మిరల్’ మూవీ రివ్యూ
టైటిల్: మిరల్నటీనటులు: భరత్, వాణి భోజన్, కే.ఎస్ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులునిర్మాణ సంస్థ: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీనిర్మాత: సీహెచ్ సతీష్ దర్శకుడు: ఎం శక్తివేల్సంగీతం: ప్రసాద్ ఎస్ఎన్సినిమాటోగ్రఫీ:సురేష్ బాలాఎడిటర్: కలైవానన్ ఆర్ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో భరత్. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళ్లో 2022లోనే విడుదలై మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత అదేపేరుతో తెలుగులో విడుదల చేశారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(మే 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సివిల్ ఇంజనీరింగ్ హరి(భరత్), రమ(వాణి భోజన్)లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలంలో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడు ఆనంద్ ఫ్యామిలీని కూడా అక్కడకు రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? రమ కలలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హరి ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?హారర్, సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెట్టే విధంగా ఉంటేనే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మిరల్ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. సస్పెన్స్ పేరుతో అసలు కథను దాచి.. అనవసరపు సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగదీశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లను రాసుకున్నాడు కానీ.. అసలు కథని ఆ సీన్లకి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సెకండాఫ్‌లో అసలు మ్యాటర్ రివీల్ అయిన తర్వాత కథపై ఆసక్తిపెరుగుతంది. ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం.. ఆ తర్వాత మారిపోతుంది. ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాల కథనం సాగుతుంది. అయితే ఈ సస్పెన్స్, థ్రిల్లర్‌కి హారర్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం.. దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్ అనిపించదు. చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యారు. కొన్ని సీన్లకు సరైన ముగింపే ఉండదు. ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్. కొన్ని సన్నివేశాల్లో అక్కడ జరుగుతున్న దానికి.. చెప్పే డైలాగ్స్‌కి సంబంధమే ఉండడు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హరి పాత్రలో భరత్ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుత కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమగా వాణి భోజన్ చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా నటించిన కేఎస్ రవికుమార్.. తనకున్న నటనానుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
రాజకీయాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్న బ్యూటీ..
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిన నటీమణుల్లో వాణి భోజన్ ఒకరు. ఆకర్షణీయమైన అందం, అలరించే అభినయం ఉన్న ఈమె ఓ మై కడవులే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే నటిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత లాకప్, రామే ఆండాలుమ్ రావణనే ఆండాళుమ్, పాయుమ్ అని నీ వెనక్కు చిత్రాలతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సీరీస్‌లోనూ నటించారు. ప్రస్తుతం ఆర్యన్, క్యాసినో, పగైవనుక్కూ అరుళ్ వాయ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందాల ఆరబోతల్లో ముందుండే వాణి భోజన్ రాజకీయాలపై తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇటీవల హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాణిభోజన్ తన ఎక్స్ మీడియాలో నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ చాలాకాలంగా తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. సెంగళం అనే వెబ్‌సీరీస్‌లో తాను రాజకీయ నాయకురాలి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే తనకు రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు వాణి భోజన్. చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ పవిత్ర -
బెడ్ రూమ్ సీన్.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్
టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా 2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు. (ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా.. వాణిభోజన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) -
మూవీ టైటిల్ 'చట్నీ- సాంబార్'.. హీరోగా ప్రముఖ కమెడియన్!
కోలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్ యోగిబాబు ఓ వైపు హాస్య పాత్రలో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన మావీరన్ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి చట్నీ సాంబార్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి వాణి భోజన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నితిన్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. యోగి బాబు ఇప్పటికే ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన బొమ్మై చిత్రం గత నెల 16వ తేదీన విడుదల కాగా.. మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ సంస్థతో కలిసి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. దీనికి అజేష్ సంగీతాన్ని.. ప్రసన్నకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు రాధా మోహన్ చిత్రాలు అంటేనే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. కాగా ఈ చిత్రం టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో ఇందులో వినోదానికి కొదవ ఉండదు అనిపిస్తుంది. దీంతో ఈ చట్నీ సాంబార్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
ఆమెతో నాకు పోటీ కాదు.. అసూయ కూడా లేదు: వాణి
ప్రస్తుతం హీరోయిన్లు అభినయం కంటే అందం, అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుని ఉన్నారనే వాదన ఉంది. ఇకపోతే అదృష్టం వారి చేతిలో ఉండదు కాబట్టి అందాలారబోత పైనే దృష్టి పెడుతున్నారు. నటి వాణి భోజన్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. తాజాగా భరత్‌తో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం 'లవ్'. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరించి వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్ల దృష్టి అంతా ఆమె పైనే పడింది. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్ ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని.. ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పింది. అదే విధంగా నటుడు అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. కాగా చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఒక్క చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఎలాంటి సినీ నేపధ్యం లేని తాను నటిగా ఇంత దూరం పయనించడం సాధనే అని పేర్కొంది. ఇకపై కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటిస్తాననీ, ఇప్పటి వరకు తన జర్నీ సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ మాదిరి గానే బుల్లితెర నుంచి వచ్చిన నటి ప్రియా భవానీ శంకర్‌ను మీకు పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదని చెప్పింది. ఆమె చాలా చిత్రాల్లో నటిస్తున్నారని, పెద్ద నటులతో జత కడుతున్నారని, ఒక స్నేహితురాలిగా తనకు సంతోషమేనని చెప్పింది. అంతే ఆమెతో తనకు పోటీ కానీ, అసూయ లేవని స్పష్టం చేసింది. నా దారిలో నేను వెళుతున్నట్లు ఇందులో ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదని వాణి భోజన్ తెలిపింది. కాగా.. టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో పరిచయమైంది కోలీవుడ్ భామ. భరత్, వాణీ భోజన్ జంటగా నటిస్తోన్న లవ్ చిత్రం మలయాళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
ఆ హీరోతో లివింగ్ టుగెదర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం వెబ్ సీరీస్ క్వీన్‌గా వెలిగిపోతున్న నటి వాణిభోజన్. టీవీ యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియళ్లలో నటించింది. దీంతో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఓ మై కడవులే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడిని ఆ తర్వాత పలు అవకాశాలు వరించాయి. నటుడు విక్రమ్‌కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. కారణం ఆమె పాత్రను పూర్తిగాఎడిటింగ్ పార్ట్‌కే పరిమితం చేశారు చిత్ర వర్గాలు. అదేవిధంగా వాణి భోజన్ నటించిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వాణి దృష్టి వెబ్‌సీరీస్‌పై పడింది. అలా తమిళ్ రాకర్స్ ట్రిపిల్స్ ఇరు ధృవం 2, తాజాగా సెంగళం వెబ్ సీరీస్‌లో నటించింది. కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ టు గెదర్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జైతో లివింగ్ టుగెదర్‌లో ఉన్నట్టు ప్రచారం హోరెత్తింది. ఈమె కాల్షీట్స్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునేవారని, ఇతరులెవరూ ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదు అనే ప్రచారం జరిగింది. దీని వల్లే వాణిభోజన్కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని వాణి భోజన్ ఇప్పుడు ఖండిస్తూ ఉంది. దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ తాను, నటుడు జయ్ ట్రిపిల్స్ వెబ్‌సీరీస్‌లో నటించామని, అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది. జైతో రిలేషన్ షిప్ అన్నా బాధపడను కానీ లివింగ్ టుగెదర్‌లో ఉన్నాననడమే బాధిస్తుందని పేర్కొంది. తాను కష్టపడి బ్యాంకులోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివశించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లీవింగ్ టుగెదర్‌లో ఉంటున్నానని రాయడం చీప్‌గా ఉందని వాణి భోజన్ ఆవేదనను వ్యక్తం చేసింది. -
అదేం పని.. జూమ్ చేసి వీడియోలు తీస్తున్నారు: నటి ఫైర్
మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన నటి వాణిభోజన్. ఓ మై కడవులే చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సీరీస్‌లతో బిజీగా ఉంది. ఈమె తాజాగా నటించిన వెబ్‌సీరీస్ సెంగలం. నటుడు కలైయరసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో వాణిభోజన్ రాజకీయ నాయకురాలుగా నటించింది. ఎస్సార్ ప్రభాకర్ దర్శకత్వంలో 9 ఎపిసోడ్స్‌గా రూపొందిన దీన్ని అభి అండ్ అభి పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇది ఇప్పుడు జీ5 చానల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాణి భోజన్ మాట్లాడుతూ ఇంతకుముందు ఎప్పుడు నటించనటువంటి పాత్రను ఇందులో నటించినట్లు చెప్పింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ పాత్ర తనకు చాలా కొత్తగా అనిపించిందని పేర్కొంది. కాగా ఈ అమ్మడిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నా మరికొందరు మాత్రం పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన వాణి భోజన్ నువ్వు సినిమాల్లో నటించడానికి ఎందుకు వచ్చావు? అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ తన చెవి వరకు కూడా వచ్చాయని చెప్పింది. అలాంటి కామెంట్స్ చూసి మొదట్లో చాలా భయపడ్డానని, ముఖ్యంగా అలాంటివి తన తల్లితండ్రులు చదువుతారని అని భావించేదాన్ని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చీర సరి చేసుకున్నా జూమ్ చేసి వీడియోలు తీసి కామెంట్స్ చేస్తున్నారని యూట్యూబ్‌పై మండిపడింది. అలాంటి వాటిని పట్టించుకుంటే సంతోషంగానే ఉండలేమని చెప్పింది. తాను సినిమాలో చాలా అప్ అండ్ డౌన్న్ చూశానని, నటించిన ఒక్కోచిత్రం వీడియో సమయంలో అది హిట్టో ఫ్లాపో సంతోషం కలుగుతుందని చెప్పింది. తను మాత్రం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నానని అది తనను ఎక్కడకు తీసుకెళ్లి నిలబెడుతుందో తెలియదని వాణి భోజన్ పేర్కొంది. -
‘లవ్’లో పోటీపడి నటించాం
లవ్ చిత్రంలో తాను, నటి వాణిభోజన్ పోటీ పడి నటించినట్లు హీరో భరత్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 50వ చిత్రం లవ్. నటి వాణి భోజన్ నాయకిగా నటిస్తున్న ఇందులో వివేక్ ప్రసన్న, రాధాదేవి, బిగ్‌బాస్ డేనియల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైలో చిత్ర టీజర్‌ను ఆవిష్కరించింది. వాణి భోజన్ మాట్లాడుతూ ఇంతకు ముందు భరత్ సరసన మిరల్ చిత్రంలో నటించానని, మళ్లీ ఇప్పుడు లవ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర లభించిందని చెప్పారు. నటుడు భరత్ మాట్లాడుతూ ఇది తన సొంత సంస్థ లాంటిదన్నారు. హీరోయిన్‌ది కూడా ప్రధాన్యత కలిగిన పాత్ర అని తెలిపారు. ఇంతకుముందే మిరల్ చిత్రంలో వాణి భోజన్తో కలిసి నటించానన్నారు. మళ్లీ అదే కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఎలా భావిస్తారో అన్న సందేహం కలిగిందన్నారు. ఆమెకు తన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో ఇద్దరూ పోటీపడి నటించినట్లు చెప్పారు. ఇది యుక్త వయసులో పెళ్లి చేసుకున్న యువతీ యువకులందరూ రిలేట్ చేసుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. లవ్ తన 50వ చిత్రం కావడం సంతోషంగా ఉందన్నారు. -
ఆ హీరోతో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
టీవీ యాంకర్ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్. మధ్యలో టీవీ సీరియల్లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఓ మై కడవలే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత లాకప్, రామే ఆండాలుమ్ రావణనే ఆండాలుమ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. కాగా మహాన్ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం 10 చిత్రాలకు పైగా చేస్తూ బిజీగా ఉన్న వాణిభోజన్ ఇటీవల హీరో జయ్‌తో సహజీవనం చేస్తున్నట్లు, ఆమె నటించే చిత్రాల కథలను కూడా ఆయనే విని ఎంపిక చేస్తున్నట్లు, దర్శక నిర్మాతలు వాణిభోజన్‌ను కలిసి కథల చెప్పే అవకాశం కూడా లేకపోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కాగా ఇలాంటి ప్రచారంపై ఈమె కాస్త ఆలస్యంగా స్పందించింది. అలాంటి వార్తలు తన వరకు వచ్చాయని, అయితే అవన్నీ వదంతులేనని కొట్టి పారేసింది. వాణిభోజన్ నటుడు భరత్‌కు జంటగా నటించిన మిరల్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను డబ్బు కోసమో లేక దర్శక నిర్మాతల కోసమో చిత్రాల్లో నటించడం లేదని చెప్పింది. అలాగే కథలను తానే విని నచ్చిన వాటినే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపింది. మిరల్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయంలో ఎలాంటి ప్లాను లేదని చెప్పింది. కథ, తన పాత్ర ఇంప్రెస్ చేసిందని అందుకే అంగీకరించినట్లు తెలిపింది. అంతేకాని తొందరపడి చిత్రాలను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే హిందీ చిత్రం గంగుభాయ్ వంటి కథా చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి వాణిభోజన్ పేర్కొంది.