బెడ్‌ రూమ్ సీన్‌.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్ | Kollywood Actress Vani Bhojan Comments On Bed Room Scene In A Movie | Sakshi
Sakshi News home page

Vani Bhojan: 'అవసరం లేకున్నా ఆ సీన్ చేయమన్నారు'

Nov 11 2023 8:07 AM | Updated on Nov 11 2023 8:53 AM

Kollywood Actress Vani Bhojan Comments On Bed Room Scene In A Movie - Sakshi

టాలీవుడ్‌లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా  2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు.

(ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ)

కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మంచి సక్సెస్‌ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్‌ సిరీస్‌ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్‌ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. 

కాగా.. వాణిభోజన్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్‌రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్‌ చల్‌ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. 

(ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement