bedroom
-
పిల్లల స్వేచ్ఛను హరించొద్దు..!
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అది శృతి మించేలా చెయ్యొద్దు. తల్లిదండ్రుల బాధ్యత వారికి భారంగా మారి స్వేచ్ఛను హరించేలా చేయకూడదు. పేరెంట్స్ ప్రవర్తనకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి తెచ్చుకుని దోషులుగా మిగిలిపోవద్దు. చైనాలో అలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు తప్పుదారి పట్టకూడదని తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చేసిన పని ఆ అమ్మాయిని పోలీసులను ఆశ్రయించే పరిస్థితికి దారితీసింది.అసలేం జరిగిందంటే..?.. 20 ఏళ్ల చైనా యువతి తన పేరెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కంట్రోల్ చేయాలనే ధోరణి తారాస్థాయికి చేరిపోయిందని భరించలేనంటూ కన్నీళ్లు పెట్లుకుంది. అందువల్ల తనకు సాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. సదరు బాధితురాలిని లీ అనే అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. తన తల్లిదండ్రులు తన పట్ల మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని గత నెల జూలై 26నే గుర్తించానని అంటోంది. తన తప్పు చేసిన ప్రతిసారి తనఫోన్ నేలకేసి కొట్టి దారుణంగా తిట్టేవారిని చెప్పింది. అస్సలు ఇంత చిన్న పాటి తప్పలు కూడా వాళ్ల ఎలా కనిపెడుతున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత తనకు తెలిసిందని.. తన బెడ్రూంలో స్పై కెమెరాను అమర్చి తన ప్రతి కదలికలను గమనిస్తున్నారని తెలిపింది. తన పేరెంట్స్ కంట్రోల్ పేరుతో తన స్వేచ్ఛను హరిస్తున్నారని, పైగా ఇది పీక్ స్థాయికి చేరిపోయిందంటూ వేదనగా చెప్పుకొచ్చింది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిచనట్లు పేర్కొంది. అంతేగాదు బతకడం కోసం పార్ట్ టైం జాబ్‌లు కూడా వెతుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఐతే ఇంట్లో తను కనిపించకపోవడంతో తన పేరెంట్స్ ఎక్కడ మిస్సింగ్ కేసు పెడతారన్న భయంతో ముందుగానే పోలీసులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోవాలనుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యింది. ఆమె గాథ విని పోలీసు అధికారి జాంగ్ చువాన్బిన్ లీని ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే లీ పట్ల తల్లిందండ్రుల ప్రవర్తన సరైనది కాదని, సంరక్షణ తప్పు మార్గంలో ఉందని అన్నారు. వెంటనే ఆమె తల్లిందడ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. పిల్లలు వస్తువులు కారని, వాళ్లకు కాస్త స్పేస్ ఉండాలని చెప్పారు. ఇలా ఇంట్లోనే కెమెరాలతో నిఘా పెట్టి అభద్రతా భావానికి గురి చెయ్యకూడదన్నారు. ఈ ప్రవర్తన వారిని ఇంటినుంచి వెళ్లిపోయేలా చేయడమే గాక తప్పుడు మార్గంలో పయనించేందుకు కారణమవుతుంది కూడా అని గట్టిగా హెచ్చరించారు. లీ తల్లిందండ్రులు కూడా వారి చేసిన తప్పిదం ఏంటో గ్రహించడమే గాక ఆ కెమెరాలను తీసేందుకు అంగీకరించారు. ఇక లీ కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు పలు రకాలుగా స్పదించారు. కనీసం జైలు కూడా ఇంతలా ఉండకదా అంటూ ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఫైర్ అయ్యారు. పైగా ఇది చాటా భయంకరమైనదిగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: Nail Art: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు.. కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు..!) -
బెడ్ రూమ్ సీన్.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్
టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భా వాణి భోజన్. అయితే ఈ మూవీతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత నటించిన తమిళ చిత్రం ఓ మై కడవలేతో గుర్తింపు తెచ్చుకుంది. మొదట బుల్లితెర నటిగా 2010లో కెరీర్ ప్రారంభించిన వాణి ప్రస్తుతం హీరోయిన్గా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు పెద్ద హిట్ పడలేదు. (ఇది చదవండి: అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది. మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది. దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి సారించింది భామ. తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా.. వాణిభోజన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె మాట్లాడుతూ కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్రూం సన్నివేశంలో నటించాలని చెప్పారని వివరించింది. అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగాగు. దీంతో తాను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశానని తెలిపింది. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది. అయితే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఒక నటుడితో ప్రేమ, సహజీవనం అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) -
ఇది మామూలు ర్యాగింగ్ కాదుగా.. ఆ ఇంటి ఓనర్ పరిస్థితి ఏంటో?
నా డబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను అద్దెకిస్తానంటూ ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో..నెటిజన్లు సైతం తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? బెంగళూరులో ప్రముఖ ప్రాంతాలుగా పేరున్న ఇందిరానగర్‌కు చెందిన భరత్_ఎంజీ ఎక్స్.కామ్‌లో తన డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో ఉండేందుకు కిరాయి దారులు కావాలని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో ‘ఇందిరానగర్ 80 అడుగుల రోడ్డులో లేజీ సుజీ పక్కన ,12వ మెయిన్‌కి కుడివైపున నా 2 BHK ఫ్లాట్‌ని అద్దెకు ఇస్తున్నాను. ఇటీవలే ఇంటీరియర్స్ చేశారు. బెడ్రూమ్లో ప్రొజెక్టర్, మోటరైజ్డ్ స్క్రీన్‌తో హోమ్ థియేటర్ సెటప్ ఉంది. ఎలాంటి పరిమితులు లేవు. అక్టోబర్ 15 ఇంట్లో అద్దెకు జాయిన్ అవ్వొచ్చు. రెంట్ రూ. 45 వేలు, రెంట్‌కు ఇల్లు కావాలంటే డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి’ అని పేర్కొంటూ ఆ ఇంటి ఫోటోల్ని జత చేశారు. మురిసి పోయి.. రెంటు పెంచేసి అసలే ఇందిరా నగర్, పైగా చూడటానికి ఇల్లు బాగుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారు సైలెంట్‌గా ఉంటారా? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి ఓనర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌కి వందల మంది తమకు ఆ ఇల్లు అద్దెకు కావాలని రిప్లయి ఇచ్చారు. తాను పెట్టిన పోస్ట్‌కి ఊహించని స్పందన చూసిన యజమాని మురిసిపోయాడు. గంటలోనే అద్దె రూ.45 వేలు కాదని, రూ.55 వేలంటూ మరో పోస్ట్ పెట్టాడు. మా ఇంటిని అద్దెకిస్తున్నాం దీంతో యాజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తూ ప్రపంచ దేశాల్లో ప్రముఖ మైన ఇళ్లను, ప్రభుత్వ కార్యాలయాల్ని అద్దె ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. రెంట్ ఎంతో చెబుతూ సెటైరికల్‌గా కొన్ని పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు సైతం నెటిజన్లను అలరించడంతో.. ఇంటి ఓనర్ తిక్క కుదురుతుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన పోస్ట్‌లను చూసి అలరించండి Story of bangalore rents these days covered in two images. 10k increase in just 6 hours. pic.twitter.com/j0VF44aZI5 — Nitin Kalra (@nkalra0123) September 3, 2023 అయ్యో పాపం అనుకున్నారు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో అతిన్ బోస్ అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ ‘ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఇంటి కోసం చూస్తున్నాను’ అని పేర్కొంటూ పింక్ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. ఇందిరా నగర్లో 2బీహెచ్‌కే బెడ్ రూంలో ఉంటున్నా. అద్దె రూ.35,000. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంటి యజమాని అద్దెను ఒక్కసారిగా 60 శాతం పెంచేశాడు. ఇప్పుడు ఇందిరాగనర్ లో రూ.60 వేల లోపు అద్దెకు ఇల్లు లభించని పరిస్థితి ఉంది. రూ.80 వేలు పెట్టినా కష్టంగానే ఉంది’ అని బోస్ వాపోయాడు. అప్పట్లో అతిన్ బోస్ తీరుతో.. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా అంటూ నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. ఇప్పుడు అదే నెటిజన్లు ఇంటి యజమానులు గంటలోనే రెంటు రూ.10వేల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. Renting my 20 BHK villa also known as 'raichand house' with private helicopter in Indiranagar. No restrictions Move in date: Oct 15 Rent: 200K Attached pic DMs are open pic.twitter.com/7yh3g8VbqC — Jagdish Patil (@jagdishpatil02) September 3, 2023 Renting my New Delhi apartment Just off Kingsway road, next to Raisina Hill Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/V3HXkbG9gE — Sumit Sharma (@Sumitkrsharma) September 3, 2023 Renting my Delhi bungalow nearby Raisina hills 340 BHK Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open https://t.co/RJlbLLJc9Y pic.twitter.com/raBbjqKOhI — Аshish Pradhan 🇮🇳🇺🇦🕉️⚕️🩺 (@DrAshishPradhan) September 3, 2023 Renting my West Delhi bungalow. Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/Q5P8XUX0FR — Anmol (@anmolm_) September 3, 2023 -
మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే..
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఫుట్హా గ్రామంలోని ఆ ఇంటిలోని వారంతా ఆ క్షణంలో వణికిపోయి, బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి బెడ్రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మెసలి నక్కివుంది. ఉదయాన్నే అది వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనేవారంతా బయటకు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని ఎవరో అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే గ్రామస్తులంతా లాలా రామ్ ఇంటికి చేరుకున్నారు. వారు దానిని ఒక సంచీలో బంధించి, తరువాత నదిలో విడిచిపెట్లారు. ఇది కూడా చదవండి: తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ -
మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..!
చిత్తూరు: తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని ఓ మందిరానికి వెళ్లిన తల్లిదండ్రులను ఏమార్చాడో మాంత్రికుడు. మీ అమ్మాయిని ఎక్కడకు తీసుకెళ్లినా రోగం నయంకాదన్నాడు. దీనికి కారణం మీ ఇంట్లో రూ.కోట్లు విలువజేసే వజ్రాలున్నాయన్నాడు. ధన పిశాచి మీ కూతురి ఒంట్లో చేరడంతో జబ్బున పడిందని పక్కాగా నమ్మించాడు. ఆపై బాధితులను ఏమార్చా కటకటాలపాలయ్యాడు. పలమనేరు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన సయ్యద్‌బాష కుమార్తెకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగోలేదు. గాలి సోకింటుందని ఎవరో చెప్పారని మదనపల్లి సమీపంలోని యాతాళవంక వద్ద దర్గాకు ఈనెల ఒకటో తేదీన తీసుకెళ్లారు. అక్కడ సయ్యద్‌బాష భార్యకు దూరపు బంధువైన అజీజ్ అలీ వారికి కనిపించి విచారించగా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఇవన్నీ కాదు తన స్నేహితుడున్నాడని అతనికి చూయిస్తే ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడని తాము గంటావూరుకే వస్తామంటూ తెలిపాడు. దీంతో మదనపల్లెకు చెందిన రెడ్డి నరసింహులు, అజీజ్ అలీ వారింటికి వెళ్లి, వారికుమార్తెను పరిశీలించి ఇంట్లో భారీగా వజ్రాలున్నాయనియ ధన పిశాచి మీ కుమార్తెను పట్టుకుందని నమ్మించారు. ఇందుకు విరుగుడుగా మంచి ముహూర్తం చూసి మీ ఇంట్లోని వజ్రాలను వెలికితీసి అందులోని ఓ వజ్రాన్ని మీ కుమార్తెకు ఉంగరంగా తొడగాలని చెప్పారు. దీంతో ఈనెల 18న అమావాస్య రోజు సయ్యద్‌బాష ఇంటిలోని బెడ్రూంలో గుప్తనిధులున్నాయని చెప్పిన చోట ఐదడుగులు గోతిని తీసి ఈ ఇద్దరూ పూజలు చేశారు. అక్కడ రెండు విలువైన వజ్రాలు లభించాయంటూ నకిలీవి సయ్యద్‌బాషాకు ఇచ్చారు. అతని నుంచి రూ.20 వేలు పూజా ఖర్చులకు తీసుకొన్నారు. ఇదే గోతిలో ఇంకా చాలా విలువైన వజ్రాలున్నాయని అతన్ని నమ్మించారు. ఇందుకోసం ఇంకా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్న తతంగాలపై స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఉంచారు. ఇదే సమయంలో తనకు దీనిపై అనుమానముందంటూ బాధితుడు పోలీసులను బుధవారం ఆశ్రయించాడు. గురువారం మళ్లీ గంటావూరులోకి ఇంటివద్దకు వచ్చిన అజీజ్, రెడ్డి నరసింహలును స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నకిలీ వజ్రాలతో మోసం చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి వారి మాయ మాటలను ప్రజలు నమ్మరాదని సీఐ చంద్రశేఖర్ హెచ్చరించారు. -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ఉంచారు. ఆ ఎస్టేట్‌లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్‌లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్‌లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్‌లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్‌పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్‌లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్‌లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్‌ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్‌పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్‌లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
లక్కీ లాటరీలో మూడు కోట్ల ఇల్లు.. రూ. 280కే!!
‘మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం...రండి బాబు రండి..రూ.3.7కోట్ల ఖరీదైన ఇల్లును రూ.280కే అందిస్తాం’ అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది? రూ.280కే.. రూ. 3 కోట్ల విలువైన ఆ ఇల్లును కొనుగోలు చేయొచ్చా? ఇంతకీ ఆ ఇంటి కథాకమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ధర రూ.3.7 కోట్లు. అందులో మూడు స్టేర్లు. స్టైలిష్ ఫర్నీచర్. నాలుగు పెద్ద పెద్ద బెడ్రూంలు. తినేందుకు విశాలమైన కిచెన్‌లో డైనింగ్ ఏరియా. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సేదతీరేందుకు లివింగ్ రూమ్. పైగా ఇంటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. సాధారణంగా ఇటువంటి విలాసవంతమైన భవనంలో ఉండేందుకు నెల అద్దె సుమారు రూ.188,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం కొనుగోలు దారులకు కేవలం రూ.280కే ఇస్తామని ప్రకటించారు. ముగురు సోదరులు బ్రిటన్‌కు చెందిన డానియల్, జాన్సన్,ట్వెన్‌ఫోర్ ముగ్గురు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కోవిడ్ -19 సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. బిజినెస్ ప్రారంభంలో వాళ్లకు తట్టిన ఓ చిన్న ఐడియా కోటీశ్వరుల్ని చేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో రూ. 280కే కోట్ల విలువైన బంగ్లాను అప్పనంగా ఇచ్చేస్తామని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఓ షరతు విధించారు. ఏంటా షరతు! ఐడియా..కనెక్టింగ్ పీపుల్ ముగ్గురు సోదరులు ఈ ఖరీదైన ఇంటిని అమ్మేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. రూ. 280తో లాటరీ కొంటే ఆ విల్లా మీ సొంతమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కేంబ్రిడ్జ్ న్యూస్ ప్రకారం..ఇంటిని అమ్మేందుకు అవసరమైన స్టాంప్ డ్యూటీ, చట్టపరమైన రుసుము వంటి బదిలీ ఖర్చులను కవర్ చేయడానికి ట్వెన్‌ఫోర్ బ్రదర్స్ లాటరీ తరహాలో సుమారు 155,000 టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ 155,000 టిక్కెట్లు అమ్ముడుపోకపోతే..లాటరీ తీసి అందులో గెలిచిన విజేతకు ఇంటికి బదులుగా లాటరీ మొత్తం నగదులో 70 శాతం అందిస్తారు. బావుంది కదా బిజినెస్. ట్రామ్వే పాత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకు ఈ ముగ్గురు సోదరులు నష్టపోలేదు. ట్రామ్వే పాత్ ట్రామ్వే పాత్ వెబ్సైట్ ప్రకారం..బ్రిటన్ కెంట్లోని మెడ్వేలో ఉన్న ఈ అద్భుతమైన 4 బెడ్ రూమ్‌ల ఇల్లు చారిత్రాత్మక సంస్కృతి, కళలు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో ఉంది. లండన్ విక్టోరియా నుంచి లండన్ సెయింట్ పాన్క్రాస్ల నాలుగు కిలోమీటర్ల దూరాన్ని గంటలోపు చేరుకునే ప్రయాణ సౌకర్యం ఉంది’ అని పేర్కొంది. -
పోలీసుల అత్యుత్సాహం.. నవ వధువు బెడ్రూమ్లోకి చొరబడి మద్యం కోసం
పాట్నా: బిహారలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తూ 2016లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్‌లో లో గుజరాత్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు మద్యపాన నిషేధం విధించగా.. నాలుగో రాష్ట్రంగా బిహార్ నిలిచింది. తాజాగా సీఎం నితీష్ కుమార్ మద్యపాన నిషేదంపై శుక్రవారం మధుబనిలో జరిగిన ఓ సభలోనూ ప్రసంగిస్తూ.. మహిళల డిమాండ్ మేరకే తాను మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకున్న రాష్ట్ర పోలీసులు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బీహార్ పోలీసుల బృందం పాట్నాలోని నవ వధువు గదిలోకి వెళ్లి మద్యం కోసం వెతికారు. ఆ సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా రాష్ట్రంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరోసారి కొత్తగా పెళ్లైన వధువు గదిలోకి చొరబడి పోలీసులు దాడులు నిర్వహించారు. వైశాలి జిల్లా పోలీసులు హాజీపూర్ నగరంలోని హతసర్గంజ్ ప్రాంతంతో ఉన్న శీల దేవీ ఇంటిపై గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు. చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు! అయిదు రోజుల క్రితం తన కొడుకుతో వివాహం చేసుకున్న ఆమె కోడలు బెడ్‌రూమ్‌పై దాడి చేశారు. శీలా కుమారి కోడలు పూజా కుమారి తన బెడ్ రూమ్‌లో ఉండగా.. మహిళా పోలీసుల లేకుండానే పోలీసుల బృందం అక్కడికి వచ్చారు. తన గదిలోకి వెళ్లి ప్రతి చోట వెతికారు. బెడ్, అల్మారా, సూట్‌కేసులతో సహా రూమ్ అంతా సెర్చ్ చేశారు. తన గదిలో ఏం వెతుకుతున్నారని కోడలు పూజా పోలుసులను ప్రశ్నించగా.. సైలెంట్‌గా ఉండాలని పోలీసులు అసభ్యంగా మాట్లాడారు. చదవండి: ఒక్క నెలలో కోటిమందికి పైగా.. ఎయిర్‌లైన్స్ చరిత్రలో మరో రికార్డు ఈ విషయంపై పూజా మాట్లాడుతూ..గదిలో దాచిపెట్టిన మద్యం బాటిళ్ల కోసం వెతుకున్నారని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఆమె అత్త స్పృహ తప్పి పడిపోయినప్పటికీ పోలీసులు తమ సోదాలు కొనసాగించారని వెల్లడించింది. పోలీసుల దాడుల అనంతరం స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపింది. తమ కుటుంబంలో ఎప్పుడూ మద్యం సేవించిన దాఖలాలు లేవని, అయినా పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారని వాపోయింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించేందుకు వైశాలి ఎస్ఎస్పీ మనీష్ కుమార్ నిరాకరించారు. చదవండి: జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం -
ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం!
తగరపువలస (భీమిలి): ఇదో రియల్ సస్పెన్స్ కథ. బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ ఆసామి ఫిర్యాదు చేయడం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటం.. ఆ వెనుకే క్లూస్‌టీమ్.. తరువాత డాగ్ స్క్వాడ్ రావడం.. పలుచోట్ల తవ్వకాలు జరపటం.. సోదాలు చేయటం.. ఎదురింట్లో రూ.19 లక్షలు లభించటం వంటి పరిణామాలు రోజంతా కనిపించాయి. సీన్ కట్‌చేస్తే.. ఉన్నట్టుండి ‘మేమూ.. మేమూ.. పరిష్కరించుకుంటాం. ఇక మీరు వెళ్లి రావొచ్చు’ అని ఆ ఆసామి చెప్పటం.. మారుమాట్లాడకుండా పోలీసులు వెనుదిరగడం జరిగిపోయాయి. భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటున్న మేడ చిన్నారావు అలియాస్ గురుమూర్తి కర్ర పెండలం వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఏడాది మార్చిలో విజయనగరం జిల్లా గజపతినగరంలో భూమి విక్రయించగా రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి బెడ్రూమ్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయించాడు. ఈ నెల 17న ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్ విభాగం క్లూస్ టీమ్ వచ్చి సోమవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు. పోలీసులు వచ్చి ఇంట్లో, ఆవరణలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ప్రయోజనం లేక.. అదే ఇంటికి ఎదురుగా చిన్నారావు (గురుమూర్తి)కే చెందిన పెంకుటింట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఇంట్లో వాళ్ల పనేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. సీన్ మారిపోయింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారు చిన్నారావు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రూ.55 లక్షలు మాయమైన భవనంలో ఫిర్యాదుదారు చిన్నారావు నివసిస్తుండగా.. రూ.19 లక్షలు లభ్యమైన ఎదురింట్లో అతని ఇద్దరు కుమారులు ఉంటున్నారు. -
బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు
అహ్మదాబాద్: పెళ్లయిన పది రోజులు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత భర్తలో అనూహ్య మార్పులు. అత్తింటికి వెళ్లిన అమ్మాయికి పక్షం రోజుల్లోనే నరకం కనపడింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తామామ కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి సర్దుకుపోదామని భార్య కలుద్దామని వెళ్తే భర్త చీత్కరిస్తున్నాడు. బెడ్రూమ్లో కూడా సక్రమంగా ఉండడం లేడు. మరోసారి అడగ్గా అతడు భార్యను చితకబాదిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి అహ్మదాబాద్‌కు చెందిన యువతికి ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన వివాహమైంది. పెళ్లయిన పది రోజులకు కట్నం తీసుకురావడం లేదని వేధింపులు మొదలుపెట్టారు. వాటిని భరిస్తూ భర్తతోనే ఉండాలని భావించిన ఆ మహిళ బెడ్రూమ్లోనైనా సక్రమంగా ఉంటాడంటే అదీ లేదు. కోరి కోరి వస్తే కూడా చీత్కరిస్తున్నాడు. ఆ విషయానికి వచ్చేసరికి కోపంతో దాడి చేస్తున్నాడు. ఇక వద్దని బెడ్రూమ్లో వదిలేసి బయటకు వెళ్లేవాడు. చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్ ‘నువ్వు అందంగా లేవు’ అని చెప్పి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటానని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వాపోయింది. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆగస్టు 1వ తేదీన పుట్టింటికి వచ్చింది. అయితే పెద్దలు కల్పించుకుని మళ్లీ అత్తింటికి పంపించారు. అయినా కూడా వారిలో మార్పురాలేదు. దీంతో ఆగస్టు 8వ తేదీన పుట్టింట్లో వదిలేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. -
పడకగది ఏ దిక్కులో ఉండాలి?
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, క్షణం తీరిక లేకుండా గడిపి.. ఇంటికొచ్చాక సేద తీరేది పడక గదిలోనే. అందుకే ఇల్లు, ఇంట్లోని బెడ్రూమ్ అన్నీ పక్కాగా వాస్తు ప్రకారం ఉంటేనే ఇంట్లోని వారికి మనశ్యాంతి కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. • ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. • కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులోనే ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పైఅంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలకు దారి తీయవచ్చు. • పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది. • ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి. • నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు. • తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు. • పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. • ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు, న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబం ధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
ఫేస్ బుక్ లో ఆకట్టుకున్న ఘటన!
చాలామందికి నిద్రపోయే ముందు ఓ చిన్నపాటి భయం కలుగుతుంది. నిద్రించే సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందోనని, ఉదయం నిద్ర లేచే వరకూ ఎలా ఉంటామోనని భయపడుతుంటారు. కొందరు ఎటువంటి భయం కలగకుండా, మంచి నిద్ర పట్టడంతోపాటు, శుభోదయం కావాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయికి నిజంగానే నిద్రలో ఓ భయంకర అనుభవం ఎదురైందట. మంచి నిద్రలో ఉండగా వినిపించిన శబ్దానికి కళ్ళు తెరచి చూడగా జీవితంలో మరచిపోలేని దృశ్యం కనిపించిందట. దాంతో ఆమె తన అనుభవాలతో కూడిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ కు చెందిన ట్రినా హిబ్బర్డ్.. భయంకర శబ్దం విని, నిద్రలో ఉలిక్కిపడి లేచిందట. తాను ఊహించినట్లుగానే తనకు సమీపంలో ఓ 66 పౌండ్ల బరువు, 16 అడుగుల పొడవు ఉన్న పైథాన్ కనిపించడంతో పై ప్రాణాలు పైకే పోయాయట. ఆ కొండచిలువ తన మంచంమీదినుంచీ టోపీలు పెట్టుకునే షల్ఫ్ మీదుగా ఏకంగా గోడలకు తగిలించిన ఫోటో ఫ్రేములను చుట్టుకుంటూ, ఇంటి పై కప్పుకు చేరిందట. నాలుగేళ్ళక్రితం 2012 లో కూడ ఆమె ఈ పైథాన్ ను చూసిందట. ఇదంతా చూస్తే ఇదేదో దాని స్వంత ప్రాపర్టీలాగా ఉందని, ఇంతకు ముందు కూడా నీటికోసం పూల్ లోకి దిగుతుండగా ఆ పైథాన్ ను చూశానని ఆమె తన ఫేస్ బుక్ కామెంట్ లో రాసింది. అయితే అప్పట్లో దూరంగా చూసి పెద్దగా పట్టించుకోని ట్రినా.. ఇటీవలి ఘటన తర్వాత మాత్రం మరోసారి దానికి ఛాన్స్ ఇవ్వకోడదనుకుంది. అందుకే పాములు పట్టే మాంటీ అనే వ్యక్తిని పిలిచి పట్టించేసిందట. -
బెడ్రూమ్ నుంచే లక్షలు కొల్లగొడుతోంది!
డబ్బు సంపాదించడమే ఆమె లక్ష్యం కాదు. కానీ లక్షలకు లక్షలు వచ్చిపడుతున్నాయి. స్టార్ డమ్ కూడా కోరుకున్నదికాదు. కానీ, హయ్యస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్ గా ఫేమస్ అయిపోయింది. ఇంకోమాట చెప్పాలంటే జీవితం పట్ల ఆమెకున్న సానుకూల దృక్ఫథమే ఇప్పుడున్న స్థాయికి తీసుకెళ్లింది. సంప్రదాయాలను పక్కనపెడుతూ, సంపాదనా మార్గాలు కొత్తపుంతలు తొక్కుతోన్న 'ఈ-కాలానికి' తగ్గట్టు బెడ్ రూమ్ నుంచే నెలకు 20 లక్షలకుపైగా సంపాదిస్తోంది.. 20 ఏళ్ల బెథాని మోటా. బెథాని మోటా హయ్యస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్లలో ఒకరు. చోటామోటా టిప్ప్ నుంచి బడా నేత బరాక్ ఒబామాను ఇంటర్వ్యూ వరకు ఆమె రూపొందించిన వీడియోలన్నీ సంచలనాలే. ఒక అంశాన్ని ఎన్నుకుని, అందమైన గొంతుకతో మాట్లాడుతూ, అద్భుతమైన తన రూపలావణ్యాంతో వీడియోల్లో కనిపించే బెథాని తక్కువ సమయంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. జస్ట్ బెడ్ రూమ్ లో కూర్చొనే Macbarbie07 పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. 2009లో ప్రారంభించిన చానెల్ ద్వారా ఔట్ ఫిట్ ఐడియాలు, మేకప్ టిప్స్, హెయిర్ ట్యూషన్స్, రెసిపీస్, డూ ఇట్ యువర్సెల్ఫ్ ఐడియాలు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, మోటివేషన్ క్లాసులు.. ఒక్కటేంటి, ఎన్నిరకాల ప్రయోగాలు చెయ్యొచ్చో అన్నీ చేసేసింది. ఆమె చానెల్ ను 98 లక్షల మంది వీక్షకులు రెగ్యులర్ గా చూస్తారట. ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ 'బిజినెస్ ఇన్ సైడర్' అంచనా ప్రకారం బెథాని మోటా నెలకు 40 వేల డాలర్లు (మన కరెన్సీలో పాతిక లక్షలకు పైమాటే) సంపాదిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ రిటెయిలర్ కంపెనీ ఫరెవర్ 21తోపాటు జేసీ పెన్నీ స్టోర్స్ తో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న బెథాని.. ఆయా సంస్థల ఉత్పత్తులను తన వీడియోల్లో ప్రమోట్ చేస్తుందన్నమాట. ఇంటర్నెట్ లో తనను ఆదరిస్తోన్న అభిమానులను ప్రత్యక్షంగా కలిసి నాలుగు మంచిమాటలు చెప్పేందుకు 'మోటా-వేటర్' (మోటివేటర్ కు ప్రత్యామ్నాయంగా ఆమె క్రియేట్ చేసిన పదం) పేరుతో టూర్లు నిర్వహిస్తుంది. యూట్యూబ్ లో బెథాని మోటా సృష్టిస్తోన్న సంచలనాలకు గుర్తింపుగా 2015లో టీన్ ఛాయిస్ అవార్డు ఆమెను వరించింది. పట్టుమని పదేళ్లైనా నిండకముందే ఇంటర్నెట్ ఫ్రీక్ గా మారిన బెథాని.. 12 ఏళ్లకే తన మొట్టమొదటి వీడియోను యూట్యుబ్ లో పెట్టింది. 'మై స్పేస్ పేరు'తో ఆమె చేసిన వీడియో చూసి ఫ్రెండ్స్ గేలి చేశారట. ఇక బంధువులైతే ' నీకింకా యూట్యూబ్ లోకి వెళ్లే వయసురాలేదు' అని నిరాశపరిచారట. ఆ వయసులోనే విమర్శలనే హార్డిల్స్ ను దాటుకుంటూ తనకేదైతే ఇష్టమో అదే చేస్తోంది బెథాని. 'ఫలానా పనో లేక అలాంటి ఉద్యోగమో చేయాలని లేదిప్పుడు. ఇంటర్నెట్ క్రియేటివిటీకి రెడ్ కార్పెట్ లాంటిది. నచ్చిన పని చేయండి. ధనలక్షి మీ దగ్గరికి నడిచొచ్చేరోజు తప్పక వస్తుంది. పాజిటివ్ యాట్యిట్యూడ్ ను మాత్రం విడిచిపెట్టొద్దు' అని యువతకు 'మోటావేట్' మంత్రం చెబుతుంది బెథాని మోటా. -
ఇళ్లు మంజూరు చేస్తారంటూ...
-
అద్దంపై ప్రేమలేఖ!
ఆమె అతడిని పట్టించుకోలేదు. కానీ అతడు ఆమెను పట్టించుకున్నాడు. ఆమె తనకు కావాలనుకున్నాడు. అమె అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ ఆమె బెడ్ రూమ్ అద్దంపై రాశాడు. ఆమైనా చూస్తుందో లేదో అనుకున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా చూస్తున్నారు. దాంపత్యానికి అర్థం, బాంధవ్యానికి పరమార్థం చెప్పే అతని రాతల షేర్ వాల్యూ సోషల్ మీడియాలో చాలా పెరిగిపోయింది. లాస్ ఏంజెలెస్‌లోని టిమ్ మర్ఫీ భార్య... మోలీ మర్ఫీ డిప్రెషన్లో ఉంది. ఆమె తన డిప్రెషన్‌తో అతడిని చాలా బాధపెట్టింది. అయినా ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న టిమ్ ఆమెను బాగు చేసేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఆమెను తానెందుకు ప్రేమిస్తున్నాడో చెప్పే నోట్‌ను ఆమె అద్దంపై రాశాడు. ఆమె చూడదేమోననుకున్నాడు. కానీ మోలీ దాన్ని చూసింది. చలించింది. ఆమెలో మార్పు మొదలైంది. తన భర్త నోట్‌ను ఇమ్గుర్ అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు లక్షల మంది చూశారు. ఇద్దరి మధ్య బాంధవ్యం ఇప్పుడు మరింత గట్టి పడింది. -
హాట్ సెల్ఫీస్!
ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ తమిళ తార వసుంధర కశ్యప్ బెడ్రూమ్ సెల్ఫీస్. తన బాయ్‌ఫ్రెండ్‌తో బాగా క్లోజ్‌గా ఉండగా తీసుకున్న సెల్ఫీలు సోషల్ సైట్లో అప్లోడ్ అయిపోయాయి. వైరస్‌లా ఇంటర్ నెట్ అంతా పాకేశాయి. వాటిని చూసి షాక్‌తిన్న ఈ సెక్సీ సుందరి... వెంటనే తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలను డిలీట్ చేసేసింది. అసలవి తనవి కావని... మార్ఫింగ్ పిక్చర్స్ అని వాపోతోంది. అయితే ఈ అమ్మడే పబ్లిసిటీ కోసం కావాలని ఈ ఫొటోలను అప్లోడ్ చేసిందనేది కొందరి అభిప్రాయం. అలాంటిదేమీ లేదని... వసుంధర స్మార్ట్ ఫోన్‌ను కొందరు ఆకతాయిలు హ్యాకింగ్ చేసి, ఆ బొమ్మలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారన్నది మరికొందరి వాదన. -
జస్ట్ ఫర్ కిడ్స
అంకెలు.. అక్షరాలు.. పదాలు.. వ్యాఖ్యలు.. సూక్తులు ఏవైనా ఎక్కడైనా అలంకారమే! ఇప్పుడివి గోడలపై, రకరకాల ఫర్నిచర్ రూపంలో పిల్లల్ని పలకరిస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలకు వాటిపై అవగాహన కలగడంతో పాటు వారిలో ఆయా అంశాల పట్ల ఆసక్తి కలిగించడానికి వీలవుతుందని అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. సిటీలో ఈ ట్రెండ్ ఇప్పుడు అంకెలు, లెక్కల ప్రాశాస్త్యాన్నీ, అక్షరాలు వర్ణమాలలోని ఆనుపానుల్నీ, పదాల భావసౌందర్యాన్నీ గుర్తు చేస్తూ అలరిస్తోంది. పదాలూ, పదబంధాలూ, చిత్రాలు, ప్రముఖుల మాటలు.. వీటిని పోస్టర్లు, ఫొటోల రూపంలో ఇప్పటి వరకు హాలు, బెడ్రూమ్, డ్రాయింగ్‌రూమ్, రీడింగ్‌రూమ్ గోడలకు అలంకారమయ్యేవి. ఇప్పుడవే ఫర్నిచర్ రూపంలో అలరిస్తున్నాయి. పిల్లల బెడ్రూమ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పేదేముంది. రంగురంగుల అక్షరాలతో అలంకరిస్తే వాళ్ల ఆనందానికి అంతే ఉండదు. మాములుగా అక్షరాలనీ అంకెలనీ పుస్తకాల్లో చూపించో లేదో పలకమీద రాయమంటే ఓ పట్టాన మాట వినరు. అదే అక్షరాల్ని గోడలపై అందంగా కనిపిస్తే వాటిని ఏదో క్షణంలో చూస్తూ చదువుతారు. ఒకటికి పదిసార్లు చూస్తుండటం వల్ల అవి చిన్ని బుర్రల్లో పదిలమైపోతాయి. అయితే ఈ అక్షరాలనేవి గోడలమీద రాతలకే పరిమితం కాకుండా ఫర్నిచర్ రూపంలో వస్తున్నాయి. ఎక్కువగా బుక్ర్యాక్లు, టేబుల్స్, చైర్స్, బెడ్‌ల్యాంప్‌లు, ప్లవర్ వేజులు, గోడ గడియారాలు.. వంటివి అక్షర క్రమం వచ్చేలా రూపొందిస్తున్నారు. పిల్లల బంక్బెడ్స్లో ఏబీసీడీలు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. - విజయారెడ్డి -
ఒక ఇల్లు... 102 పాములు!
సమ్‌థింగ్ స్పెషల్ సరదాగా నాల్రోజులు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన ఆ కుటుంబ సభ్యులు భీతావహులు అయ్యారు. ఇంటి నిండా పాములు ఉండటంతో వారికి వణుకు పుట్టింది. హాలు, వంటగది, బెడ్రూమ్ తేడా లేకుండా అన్ని చోట్లా పాములు కనిపించే సరికి వాళ్ల ఒళ్లు జలదరించింది. కెనడాలోని సకట్చ్వాన్ ప్రాంతంలో నివసించే ఒక కుటుంబానికి ఈ అనుభవం ఎదురైంది. విశాలమైన కాంపౌండ్‌తో ఉండే వీరి ఇంట్లోకి కుప్పలు తెప్పలుగా పాములు వచ్చి చేరాయి. ఏదో ఒకటీ రెండు పాములు అయితే వింత కాదు కానీ... టూర్ నుంచి తిరిగొచ్చిన వీళ్లకు ఇంట్లో ఏకంగా లెక్కలేనన్ని పాములు పాకుతూ కనిపించే సరికి వెన్నుల్లో వణుకు పుట్టింది. అయితే అవేవీ విషపూరితమైన పాములు కావు, ఎమర్జెన్సీ వాళ్లు వచ్చి ఈ విషయాన్ని తేల్చారు. మొత్తం పాములను పట్టి... లెక్క పెట్టగా వాటి సంఖ్య 102 అని తేలింది. బయట అతిచల్లని వాతావరణాన్ని తట్టుకోలేక పాములన్నీ ఇంటిలోకి చేరి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. ఖాళీ సీసాలతో కొత్త శోభ! బెంగళూరుకు చెందిన ఒక టాయ్ కంపెనీ రూపొందించిన ఈ ‘డంక్’ అనే డెకరేషన్ల్యాంప్లకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. వృథాగా పోయే మెటీరియల్‌తో తయారు చేయగల ఈ ల్యాంప్‌లను రూపొందించినందుకు గానూ సింగపూర్ కంపెనీ ఒకటి అవార్డును ఇచ్చింది. రీ సైకిల్‌కు వెళ్లని గాజు సీసాలకు రంగులు అద్ది... వాటిల్లో చిన్న బల్బ్‌ను అమర్చితే చాలు... ఈ ‘డంక్’ తయారవుతుంది. ఎలక్ట్రిసిటీ సరఫరా కావడానికి వైరు, వీటిని ఉంచడానికి చిన్న పీటలాంటి ఏర్పాటు ఉంటే చాలు.. ఈ డంక్ రంగు రంగుల కాంతి వెదజెల్లడానికి రెడీ అయినట్టే! మూడ్‌కు తగ్గట్టుగా వివిధ రంగుల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో డెకరేషన్‌కు, కాంతి కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. కార్నర్ టేబుళ్లలోనూ, బుక్షెల్ఫ్ల వద్ద, ఖాళీ టేబుళ్ల మీద ఈ డంక్‌ను ఏర్పాటు చేసి చూడండి.. ఇంటికి కొత్త శోభ వచ్చినట్టేనని రూపకర్తలు చెబుతున్నారు. మరి ఒకసారి ట్రై చేయండి, ఇంటికి కొత్త సొబగులు అద్దండి. -
విమానంలో లగ్జరీ బెడ్రూమ్!
దుబాయ్: ఆకాశంలో విహరిస్తూ లగ్జరీ హోటల్ సూట్లో సౌకర్యాలన్నీ అనుభవించే అనుభూతిని పొందాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా బెడ్రూమ్, మీకోసమే విడిగా అటాచ్డ్ బాత్రూమ్తో పాటు మీరు చిటికేస్తే ఏదికావాలంటే అది అందించేందుకు బట్లర్(సేవకుడు)... ఇలా విమానమే మీ సొంత అపార్ట్మెంట్లా మారిపోతే! ఏంటి ఈ అతిశయోక్తులు అనేనా మీ సందేహం? నిజంగా నిజమండీ ఇవన్నీ. అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఈ లగ్జరీ హోటల్ తరహాలో సూట్లను తమ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. లగ్జరీని ఆకాశమేహద్దుగా తీసుకెళ్లేలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా పేరొందిన ఎయిర్‌బస్ ఏ-380లో ఈ సదుపాయాలను ఆవిష్కరించింది. రెండో అంతస్తులో.... ఏ380 విమానం రెండో అంతస్తు(అప్పర్ డెక్)లో ఈ కొత్త తరహా లగ్జరీ సూట్‌ను ఎతిహాద్ ఏర్పాటు చేస్తోంది. డబుల్ బెడ్రూమ్, బాత్రూమ్, పర్సనల్ బట్లర్‌తో ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి సొంతంచేసుకునేలా చేస్తోంది. కాగా, ఏ380లో పూర్తిస్థాయిలో మొబైల్, వైఫై వినియోగించే సదుపాయం ఉంటుంది. బోయింగ్ బీ787లో వైఫై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలో పూర్తిస్థాయి ప్రైవేటు సూట్స్‌తో కూడిన తొలి విమాన అపార్ట్‌మెంట్స్‌ను ఏ380లో ఎతిహాద్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో రిక్లైనింగ్ లాంజ్ సీట్, లగ్జరీ హోటల్లో ఉండే విధంగా ఫుల్‌లెంగ్త్ బెడ్, మినీ బార్, వార్డ్రోబ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అత్యాధునికమైన సౌండ్‌ను అందించే హెడ్సెట్, వీడియో టచ్‌స్క్రీన్‌తో కూడిన హ్యాండ్సెట్స్, గేమింగ్, హైడెఫినిషన్ స్క్రీన్స్ వంటి సరికొత్త సదుపాయాలనూ ఎతిహాద్ ప్రారంభించింది. కొత్త బిజినెస్, ఎకానమీ క్లాస్‌లను(ద బిజినెస్ స్టూడియో, ఎకానమీ స్మార్ట్ సీట్) ఏ380, బీ787 రెండింటిలోనూ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. విమానంలో ప్రయాణికులకు అందించే సేవలకు సంబంధించి ఈ లగ్జరీ సూట్స్‌తో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పనున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈఓ జేమ్స్ హోగన్ పేర్కొన్నారు. కాగా, భారత్‌కు కూడా ఏ-380 విమానాలను నడిపేందుకు కేంద్రం ఇటీవలే అనుమతించడం తెలిసిందే. అంటే భవిష్యత్తులో భారత ప్రయాణికులకూ ఈ లగ్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న మాట! జెట్-ఎతిహాద్ డీల్‌పై కొత్త సర్కారు ఎఫెక్ట్ ఉండదు భారత్‌లో కేంద్రంలో ప్రభుత్వం మారడం వల్ల జెట్ ఎయిర్‌వేస్‌తో తమ భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఎతిహాద్ ప్రెసిడెంట్, సీఈఓ జేమ్స్ హోగన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌కు చెందిన ఒక అత్యుత్తమ కంపెనీతో మేం జట్టుకట్టాం. ఇదేమీ రాజకీయపరమైన అంశం కాదు. అందువల్ల జెట్‌లో మా పెట్టుబడుల విషయంలో ప్రభుత్వపరమైన ప్రక్రియల్లో మార్పులేవీ ఉండబోవనే సంపూర్ణ విశ్వాసం మాకుంది’ అని ఆయన పేర్కొన్నారు. జెట్-ఎతిహాద్ డీల్‌కు నియంత్రణపరంగా అనేక అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. నెలల తరబడి కొనసాగిన సమీక్షల అనంతరం జెట్‌లో 24 శాతం వాటాను ఎతిహాద్ కొనుగోలు చేసేందుకు ఎట్టకేలకు ఆమోదం లభిం చింది. దీంతో దేశీ ఎయిర్లైన్స్లోకి తొలి విదేశీ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా ఇది నిలి చింది కూడా. కాగా, ఈ డీల్ ఇరు కంపెనీలకూ ప్రయోజనకరమేనని, తాము భారతీయ విమానయాన నిబంధనలను అతిక్రమించలేదని కూడా హోగన్ స్పష్టం చేశారు. -
నిద్రలేమికి కారణాలు ఆరు! పరిష్కార మార్గాలు పది!!
మీకు తెలుసా? కారణాలు ఉద్యోగంలో షిఫ్టులు మారడం నిద్రపోయే ప్రదేశంలో రణగొణ ధ్వనులు గదిలో ఉష్ణోగ్రతలు దేహానికి సౌకర్యంగా లేకపోవడం దైనందిన జీవితంలో ఒత్తిడి పెరగడం(పరీక్షలకు చదువుకోవడం, ప్రేమ విఫలం కావడం, నిరుద్యోగం, వైవాహిక జీవితం భగ్నం కావడం వంటి కారణాలు) మద్యపాన సేవనాన్ని హటాత్తుగా మానేయడం, శరీర కదలికలు లేకుండా రోజు గడపడం, మందుల ప్రభావం సాయంత్రం ఆరు గంటల తర్వాత కాఫీ, టీ తాగడం పరిష్కారాలు: రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి నిద్రపోని సమయంలో పక్క మీద గడపడాన్ని మానాలి బెడ్రూమ్ని నిద్రకే పరిమితం చేయాలి. బెడ్రూమ్లో చదవడం, టీవీ చూడడం, ఆహారం తినడం వంటి వాటిని నివారించాలి పడుకోబోయే ముందు వేడినీటితో స్నానం చేసి గోరువెచ్చని పాలు తాగాలి (వేడి వేడి పాలు తాగితే దేహం చైతన్యవంతం అవుతుంది, నిద్రరాదు) పగటి నిద్రను మానేయాలి. తప్పని సరి అయితే అరగంటకు మించకుండా చిన్న కునుకు తీయవచ్చు. అది కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నిద్రపోకూడదు రోజుకు కనీసం 20 నిమిషాల వ్యాయామం చేయాలి కాఫీ, ధూమపానం, ఆల్కహాల్ సేవనాన్ని మానేయాలి లేదా తగ్గించాలి. కాఫీ, టీ లను పరిమితంగా తీసుకునే వారు కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత తీసుకోకూడదు. నిద్రకు ముందు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు(హెవీ మీల్ తీసుకోకూడదు) ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతుంటే ఈ విషయాన్ని డాక్టర్‌తో సంప్రదించాలి నొప్పి వంటి శారీరక సమస్యలు ఉంటే నొప్పి నివారణ మందులు తీసుకోవాలి -
సోయగాల బాల్కనీ...
అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక బాల్కనీ అనే పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. కిచెన్, బెడ్రూమ్ లేదా హాల్‌కి ఒక్క బాల్కనీ కూడా లేకపోతే ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నా తీసికట్ట్టే. అయితే చాలామంది ఇళ్లలో గాలి, వెలుతురు కోసమే బాల్కనీ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొంతమంది పాత వస్తువులు వేయడానికో, అడ్డుగా ఉన్నాయనుకున్న వస్తువులను చేర్చడానికో బాల్కనీని ఉపయోగిస్తుంటారు. ముఖానికి కళ్లు ఎంత అందమో, ఇంటికి బాల్కనీ అంత అందం. ఎడారిలా తలపించే ఇళ్ల మధ్య బాల్కనీని ఉన్నంతలో ఔట్‌డోర్ ఒయాసిస్‌గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం... కొన్ని బాల్కనీలను లైట్‌వెయిట్‌గా, మిగిలిపోయిన సామగ్రితో పనికానిచ్చేశాం అన్నట్టుగా ఇంటినిర్మాణంలో భాగంగా ముగించేస్తారు. అందుకే ముందుగా నిర్మాణరంగ నిపుణుడితో బాల్కనీ ఎంత పటిష్టమైనదో చెక్ చేయించుకోవాలి. ఉన్న స్థలంలో ఎండ, వాన, చలి కాలాలకు అనువుగా ఉండేలా మలచుకోవాలి. రోజులో ఎంత సేపు బాల్కనీలో గడుపుతారో లెక్కించుకోవాలి. ఆ సమయాన్ని బట్టి సిట్టింగ్, లైటింగ్, మిడిల్ గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్.. ఇవన్నీ పరిశీలించుకోవాలి. అన్ని కాలాలకు తట్టుకునేలా మొక్కలు పెట్టుకోవడానికి అనువైన కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. కుండలలోని మట్టి, నీరు బయటకు రాకుండా జాగ్రత్తపడాలి. బాల్కనీ మొక్కలకు వర్షపు నీరు అందదు. నీటిపాత్రతో పోయడం వల్ల నీరు, మట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బాల్కనీని మెయిన్‌టెయిన్ చేయడం కష్టం అవుతుంది. దీనికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి చక్కని మార్గం. బాల్కనీ డిజైన్‌కు సంబంధించిన పరికరణాలను నిల్వ ఉంచుకోవడం మరిచిపోవద్దు. మరీ గాడీగా కాకుండా బాల్కనీని ఉపయుక్తంగా మార్చుకుంటే చూపులకు ఆహ్లాదంగానూ ఉంటుంది. టై గార్డెన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ నిపుణులతో మాట్లాడి బాల్కనీని అందంగా మార్చుకునే సలహాలను పొందవచ్చు. ఎంత చిన్న బాల్కనీ అయినా మనసుకు ఆహ్లాదంగా, అవసరానికి ఉపయుక్తంగా మార్చుకుంటే కంటికి కాటుక ఇచ్చిన అంత అందం ఇంటి సొంతం అవుతుంది.